MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Hyderabad: 5 ఎక‌రాల్లో రూ. 200 కోట్ల‌తో హైదరాబాద్‌లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్‌.. ఎక్క‌డో తెలుసా.?

Hyderabad: 5 ఎక‌రాల్లో రూ. 200 కోట్ల‌తో హైదరాబాద్‌లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్‌.. ఎక్క‌డో తెలుసా.?

Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ విప్లవానికి గుర్తుగా నిలిచిన సైబ‌ర్ ట‌వ‌ర్స్‌ తరహాలో మరో ఆధునిక పరిపాలన భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) కోసం ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.  

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 16 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కైత్లాపూర్‌లో భారీ ప్రాజెక్ట్
Image Credit : Gemini AI

కైత్లాపూర్‌లో భారీ ప్రాజెక్ట్

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు శాశ్వత ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కైత్లాపూర్‌లో ఐదు ఎకరాల భూమిని ఎంపిక చేశారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో ఈ సమీకృత భవన సముదాయం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇంజినీర్లు డిజైన్‌లపై పని చేస్తున్నారు. తుది రూపకల్పన పూర్తయ్యాక ప్రభుత్వ ఆమోదంతో పనులు ప్రారంభం కానున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీ+8 అంతస్తులతో ఆధునిక నిర్మాణం
Image Credit : Gemini

జీ+8 అంతస్తులతో ఆధునిక నిర్మాణం

ఈ భవనాన్ని జీ ప్లస్ 8 అంతస్తులతో, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించ‌నున్నారు. నిర్మాణ రూపకల్పనలో ఐటీ కారిడార్‌కు తగిన ఆధునిక శైలి ప్ర‌తిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భవనం రూపం, సదుపాయాలు, అంతర్గత విభాగాల ప్లానింగ్ అన్ని కలిపి ఇది ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌గా నిలిచేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

Related Articles

Related image1
HYD: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన‌డం కంటే.. ఇలా ప్లాన్ చేస్తే కాలుపై కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Related image2
హైద‌రాబాద్‌లో మీ సొంతింటి క‌ల ఇక క‌లాగానే మిగిలిపోదు.. రూ. 40 ల‌క్ష‌ల‌కే అపార్ట్‌మెంట్ ల‌భించే ప్రాంతాలు
35
ఒకే చోట అన్ని ప్రభుత్వ సేవలు
Image Credit : Getty

ఒకే చోట అన్ని ప్రభుత్వ సేవలు

ప్రజలకు సులభంగా సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అందుకే మున్సిపల్ శాఖతో పాటు జలమండలి, రెవెన్యూ, విద్యుత్ శాఖల కార్యాలయాలను ఒకే భవనంలో ఏర్పాటు చేయనున్నారు. అదనంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రజలు వేర్వేరు కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం తగ్గుతుంది.

45
సైబరాబాద్ పరిపాలన విస్తరణ
Image Credit : our own

సైబరాబాద్ పరిపాలన విస్తరణ

ప్రస్తుతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేగంగా విస్తరిస్తోంది. మణికొండ, నార్సింగి, శేరిలింగంపల్లి నుంచి మేడ్చల్ వరకు కీలక ప్రాంతాలు ఇందులో భాగమయ్యాయి. మొత్తం 3 జోన్లు, 16 సర్కిళ్లతో ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద పరిధికి సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యాలయం అవసరమైంది.

55
నగర అభివృద్ధికి కొత్త గుర్తింపు
Image Credit : Gemini AI

నగర అభివృద్ధికి కొత్త గుర్తింపు

హైదరాబాద్ అనగానే ఛార్మినార్‌, గోల్కోండ కోట‌, హైటెక్ సిటీ వంటి ఐకానిక్ నిర్మాణాలు గుర్తొస్తాయి. అయితే ఇప్పుడీ కొత్త నిర్మాణం కూడా నగరానికి మరో గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఐటీ నగరంగా హైదరాబాద్ స్థాయిని మరింత పెంచే ఈ ప్రాజెక్ట్, పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, సైబరాబాద్ కోసం నిర్మిస్తున్న ఈ సమీకృత భవనం పరిపాలనలో సౌలభ్యం, వేగం తీసుకురావడమే కాకుండా నగరానికి మరో ఐకానిక్ నిర్మాణంగా నిలవనుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image3
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Related Stories
Recommended image1
HYD: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన‌డం కంటే.. ఇలా ప్లాన్ చేస్తే కాలుపై కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Recommended image2
హైద‌రాబాద్‌లో మీ సొంతింటి క‌ల ఇక క‌లాగానే మిగిలిపోదు.. రూ. 40 ల‌క్ష‌ల‌కే అపార్ట్‌మెంట్ ల‌భించే ప్రాంతాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved