MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • Hyderabad: DNA సినిమాను మించిన ట్విస్టులు.. భ‌ర్త వీర్యంతో కాకుండా వేరే వ్య‌క్తి వీర్యంతో

Hyderabad: DNA సినిమాను మించిన ట్విస్టులు.. భ‌ర్త వీర్యంతో కాకుండా వేరే వ్య‌క్తి వీర్యంతో

పెరుగుతోన్న సంతాన‌లేమీ స‌మ‌స్య‌ల కార‌ణంతో ఐవీఎఫ్ సెంట‌ర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ సెంట‌ర్ చేసిన నిర్వాకం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 27 2025, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ నిర్లక్ష్యం
Image Credit : IMDB website, Getty

టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ నిర్లక్ష్యం

సికింద్రాబాద్ గోపాలపురంలోని ఓ ప్ర‌ముఖ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ చుట్టూ తీవ్ర వివాదం రేగింది. ఒక దంపతుల భర్త వీర్యానికి బదులుగా వేరొకరి వీర్యంతో ఐవీఎఫ్‌ జరిపిన ఘటన బయటపడింది. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యి, ఆసుపత్రిలో విస్తృత తనిఖీలు జరిగాయి.

DID YOU
KNOW
?
మొద‌టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎప్పుడు పుట్టిందంటే.?
ఐవీఎఫ్ తొలిసారి 1978లో అందుబాటులోకి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో పుట్టిన తొలి శిశువు పేరు లూయిస్ బ్రౌన్.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అస‌లు విష‌యం వెలుగులోకి ఎలా వ‌చ్చింది.?
Image Credit : our own

అస‌లు విష‌యం వెలుగులోకి ఎలా వ‌చ్చింది.?

మారేడ్‌పల్లికి చెందిన ఓ దంపతులు సంతానం కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌ను ఆశ్రయించారు. చికిత్స అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు. అయితే, రెండు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత బాబు ఆరోగ్యం క్షీణించింది. త‌ర‌చూ అనారోగ్యం బారిన ప‌డుతుండ‌డంతో వైద్యుల‌ను సంప్ర‌దించారు. 

ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క్యాన్స‌ర్ అని నిర్ధార‌ణ అయ్యింది. కుటుంబ చ‌రిత్ర‌లో ఎవరికీ క్యాన్స‌ర్ వ‌చ్చిన సంద‌ర్భాలు లేక‌పోవ‌డంతో అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించారు. బాబు తండ్రితో జీన్స్‌ సరిపోలకపోవడంతో ఆసుపత్రి మోసం వెలుగులోకి వ‌చ్చింది.

35
రంగంలోకి పోలీసులు
Image Credit : Istock

రంగంలోకి పోలీసులు

ఫిర్యాదు అందుకున్న గోపాలపురం పోలీసులు, నార్త్‌జోన్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్ నేతృత్వంలో శనివారం సెంటర్‌పై దాడులు నిర్వహించారు. క్లూస్ టీమ్, రెవెన్యూ అధికారులు, వైద్య విభాగం సహకారంతో రికార్డులను పరిశీలించి, పేషెంట్ ఫైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

45
గతంలోనూ వివాదాస్పద కేసులు
Image Credit : Freepik

గతంలోనూ వివాదాస్పద కేసులు

డాక్టర్ నమ్రతపై ఇదే మొదటి ఆరోపణ కాదని విచారణలో వెలుగులోకి వచ్చింది. పది సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలను సరోగసీకి బలవంతం చేసి, డబ్బు వసూలు చేసిన ఘటనలో ఆమెను అరెస్ట్ చేసి లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఇతర వైద్యుల పేర్లతో సెంటర్లను కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

55
ఇతర కేంద్రాలపై కూడా దర్యాప్తు
Image Credit : Asianet News

ఇతర కేంద్రాలపై కూడా దర్యాప్తు

ప్రస్తుత కేసుతో పాటు విజయవాడ, విశాఖపట్నం సహా పలు చోట్ల సృష్టి బేబీ సెంటర్‌ల కార్యకలాపాలపై పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. విశాఖ కేంద్రంలోని రికార్డులు కూడా పరిశీలించగా, అక్కడి మహిళా మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఇలాంటి బాధితులు ఎంత‌మంది ఉన్నారు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారన్న అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Related Stories
Recommended image1
Gold Price: భారీగా ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌లు.. కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మా.? ఇంకా త‌గ్గుతాయా?
Recommended image2
Viral News: రూ. 30 కోట్ల జీతం.. మీకు మీరే బాస్‌, కేవ‌లం స్విఛ్ ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని. ఇంత‌కీ ఏంటా ఉద్యోగ‌మంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved