- Home
- Telangana
- Realestate: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి.? తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు
Realestate: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి.? తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు
భారతదేశంలో 2025 మొదటి అర్థ భాగంగా (జనవరి - జూన్) రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితిపై నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా ఓ నివేదకను విడుదల చేసింది. వీటి ప్రకారం దేశంలోని ఏయే నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాప్ 8 నగరాల్లో తగ్గిన అమ్మకాలు
2025లో మొదటి 6 నెలల్లో దేశంలోని ప్రధాన 8 నగరాల్లో మొత్తం 1,70,201 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం తో పోలిస్తే 2 శాతం తగ్గుదల. కొన్ని నగరాల్లో తక్కువ డిమాండ్ కారణంగా ఈ గణనీయమైన ప్రభావం పడినట్లు నివేదికలో వెల్లడైంది.
చాలా నగరాల్లో తగ్గిన విక్రయాలు
ఢిల్లీలో 8 శాతం ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. అలాగే బెంగళూరులో 3% తగ్గుదల, పుణెలో 1% తగ్గింది. ఇక దేశంలో అత్యధికంగా కోల్‌కతాలో 11శాతం తగ్గుదల కనిపించింది. ముంబై, అహ్మదాబాద్లో అమ్మకాలలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
దూసుకెళ్తున్న హైదరాబాద్, చైన్నై
దేశంలో అన్ని నగరాల్లో పరిస్థితుల్లో ఒకలా ఉంటే హైదరాబాద్, చెన్నైలో మాత్రం భిన్నంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఆరు నెలల కాలంలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగాయి. మొత్తం 19,048 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక చెన్నై అత్యధికంగా 12 శాతం వృద్ధి పెరిగింది. చెన్నైలో ఈ 6 నెలలలో మొత్తం 8935 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కొత్తగా వచ్చిన యూనిట్లు కూడా తగ్గుదల
ప్రధానంగా కొత్తగా ప్రారంభించిన గృహ ప్రాజెక్టులు (launches) కూడా తగ్గిపోయాయి. మొత్తం 1,79,740 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 2% తక్కువ కావడం గమనార్హం. కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఢిల్లీలో 17 శాతం తగ్గాయి.
కాగా హైదరాబాద్‌లో 6 శాతం, కోల్‌కతాలో అత్యధికంగా 29% తగ్గుదల కనిపించింది. కాగా బెంగళూరులో కొత్త లాంచ్‌లు 31% పెరిగాయి, చెన్నైలో 9% వృద్ధి కనిపించింది. అహ్మదాబాద్‌లో 5 శాతం వృద్ధి కనిపించింది.
నివేదిక ఏం చెబుతోందంటే
మొత్తం మీద ఈ నివేదిక ఆధారంగా చూస్తే, దేశవ్యాప్తంగా గృహాల అమ్మకాలు కొంత మందగించాయి. అయితే, హైదరాబాద్, చెన్నైలో మాత్రం స్థిరంగా వృద్ధి కనిపించడం గమనార్హం. దీనికి ఆ నగరాల్లో ఉద్యోగ అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలే కారణంగా చెబుతున్నారు.