MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • హైదరాబాద్ లో రోజుకి 70 వేలు, ఇంతకీ ఆ టూర్ స్పెషల్ ఏంటో తెలుసా?

హైదరాబాద్ లో రోజుకి 70 వేలు, ఇంతకీ ఆ టూర్ స్పెషల్ ఏంటో తెలుసా?

Hyderabad: హైదరాబాద్ నుంచి సోమశీల, శ్రీశైలం వెళ్లే భక్తులు, పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త అవకాశాన్ని తీసుకొస్తోంది. ఆకాశ మార్గంలో ఈ పుణ్యక్షేత్రాలకు చేరుకునే హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 05 2026, 06:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆకాశ మార్గంలో సోమశీల–శ్రీశైలం యాత్ర
Image Credit : Gemini AI

ఆకాశ మార్గంలో సోమశీల–శ్రీశైలం యాత్ర

హెలికాప్టర్ సేవల ద్వారా హైదరాబాద్ నుంచి సోమశీలకు చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్లేలా ప్రత్యేక ప్యాకేజీ రూపొందించారు. ఈ ప్రయాణంలో కృష్ణా నది పరిసరాలు, నల్లమల అరణ్య ప్రాంతం వంటి ప్రకృతి అందాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశం ఉంటుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశీల ప్రాంతం ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి. అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేలా యాత్రను రూపొందించారు. పర్యటనతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఈ సేవ‌ల‌ను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించ‌నున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒకరోజు ప్యాకేజీ వివరాలు
Image Credit : Srisailam Temple Page

ఒకరోజు ప్యాకేజీ వివరాలు

ఒకరోజు ప్యాకేజీ ఎంపిక చేసుకున్నవారు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మొదట సోమశీల ప్రాంతానికి చేరుకుని కృష్ణా నది పరిసరాలను వీక్షిస్తారు. అనంతరం లలితాంబిక సోమేశ్వర ఆలయంలో దర్శనం ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం పూర్తి చేసి అదే రోజు సాయంత్రానికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి సుమారు రూ.1,10,000గా నిర్ణయించారు.

Related Articles

Related image1
Doorbell: ఇంకా అవే పాత డోర్ బెల్స్ వాడుతున్నారా.? స్మార్ట్ బెల్ గురించి తెలిస్తే వెంటనే కొనేస్తారు
Related image2
Motivational: జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి చాలు.. ఏం లిరిక్స్ భ‌య్యా అస‌లు
35
రెండు రోజుల ప్రత్యేక ప్యాకేజీ
Image Credit : our own

రెండు రోజుల ప్రత్యేక ప్యాకేజీ

రెండు రోజులు టూర్ ప్లాన్ చేసుకున్న వారి కోసం రెండు రోజుల ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో సోమశీల, శ్రీశైలంలో బస, భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఆలయాల్లో వీఐపీ దర్శనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో అదనపు వసతి సదుపాయం కూడా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ రెండు రోజుల టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి సుమారు రూ.1,40,000గా ఉండనుంది. 

45
బెల్-407 హెలికాప్టర్‌తో సేవలు
Image Credit : Asianet News

బెల్-407 హెలికాప్టర్‌తో సేవలు

ఈ యాత్ర కోసం బెల్-407 మోడల్ హెలికాప్టర్‌ను వినియోగించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ ఈ సేవలను నిర్వహించనుంది. ప్రయాణికుల భద్రత, సమయపాలనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తక్కువ సమయంలో సౌకర్యవంతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా చెబుతున్నారు.

55
కొల్లాపూర్ ప్రాంతానికి పర్యాటక గుర్తింపు
Image Credit : T Govt Twitter

కొల్లాపూర్ ప్రాంతానికి పర్యాటక గుర్తింపు

ఇదిలా ఉంటే ఈ సంద‌ర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ హెలీ టూరిజం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుంద‌ని తెలిపారు. ముఖ్యంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. హెలికాప్టర్ సేవలు ప్రారంభమైతే సోమశీల, శ్రీశైలం ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున‌ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
Doorbell: ఇంకా అవే పాత డోర్ బెల్స్ వాడుతున్నారా.? స్మార్ట్ బెల్ గురించి తెలిస్తే వెంటనే కొనేస్తారు
Recommended image2
Motivational: జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి చాలు.. ఏం లిరిక్స్ భ‌య్యా అస‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved