MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Motivational: జీవితంలో ఎంత క‌ష్టం వ‌చ్చినా ఒక్క‌సారి ఈ పాట వినండి.. ఏం లిరిక్స్ భ‌య్యా అస‌లు

Motivational: జీవితంలో ఎంత క‌ష్టం వ‌చ్చినా ఒక్క‌సారి ఈ పాట వినండి.. ఏం లిరిక్స్ భ‌య్యా అస‌లు

Motivational: సినిమాల్లో పాటలు వినోదం కోసం మాత్రమే కాకుండా జీవితానికి దారి చూపించే సందేశం కూడా ఇస్తాయి. అలాంటి పాటలలో ఒకటి “సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా” అనే పాట. ఈ పాట ఇప్పటికీ చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 04 2026, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
“చిరునవ్వుతో” సినిమా – ఒక ప్రత్యేకమైన భావోద్వేగ కథ
Image Credit : Tips Telugu/Youtube

“చిరునవ్వుతో” సినిమా – ఒక ప్రత్యేకమైన భావోద్వేగ కథ

2000లో దర్శకుడు జి. రాంప్రసాద్ రూపొందించిన సినిమా చిరునవ్వుతో. ఇందులో హీరోగా వేణు నటించారు. ఈ సినిమాలోని మాటలు, భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాశారు. ఆయన మాటలలో ఉండే చమత్కారం, తాత్వికత ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సిరివెన్న‌ల క‌లం నుంచి జాలువారిన పాట‌లు సైతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

25
సిరివెన్నెల కలం నుంచి జీవిత‌ సందేశం
Image Credit : Tips Telugu/Youtube

సిరివెన్నెల కలం నుంచి జీవిత‌ సందేశం

ఈ సినిమాలోని సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా పాటకు లిరిక్స్ రాసింది ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన రాసే పాటలలో జీవిత తాత్వికత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పాటలో కూడా ఆయన ఒక గొప్ప సందేశాన్ని చాలా సులభమైన పదాలతో చెప్పారు. జీవితంలో బాధలు వస్తాయి, కష్టాలు మన వెంట పడతాయి, కానీ వాటిని చూసి భయపడకూడదు. అందుకే “సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా”

అంటే మనం నవ్వుతూ ఉండగలిగితే అది మనకు సగం బలం లాంటిదని ఈ లైన్ చెబుతుంది.

Related Articles

Related image1
మార్కెట్లో చికెన్ దొర‌క‌డం లేదా.? మిల్మేక‌ర్ క‌ర్రీని ఇలా చేశారంటే చికెన్ కూడా బ‌లాదూర్ అనాల్సిందే
Related image2
Doorbell: ఇంకా అవే పాత డోర్ బెల్స్ వాడుతున్నారా.? స్మార్ట్ బెల్ గురించి తెలిస్తే వెంటనే కొనేస్తారు
35
గతాన్ని మర్చిపో, రేపటి వైపు నడువు
Image Credit : Tips Telugu/Youtube

గతాన్ని మర్చిపో, రేపటి వైపు నడువు

ఈ పాటలోని ఒక ముఖ్యమైన భావం ఏమిటంటే గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. “నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా” అంటే గతంలోని బాధలు మన కళ్ల ముందే ఉంటే మనం ముందుకు సాగలేమని అర్థం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే గతాన్ని వదిలేయాలి, భవిష్యత్తును ఆశగా చూడాలి. అనే సందేశాన్ని ఈ పాట‌లో ఎంతో అందంగా వ్య‌క్త‌ప‌రిచారు.

45
కష్టాలను కన్నీళ్లతో కాదు, చిరునవ్వుతో ఎదుర్కో
Image Credit : Tips Telugu/Youtube

కష్టాలను కన్నీళ్లతో కాదు, చిరునవ్వుతో ఎదుర్కో

మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది బాధపడతారు. కానీ ఈ పాట‌లోని ఓ లైన్ క‌ష్టాన్ని చూసే విధానాన్ని మార్చేస్తుంది. “చుట్టమల్లే కష్టమొస్తే.. కళ్ల నీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకు” అంటే కష్టాలను పెద్దగా పట్టించుకుని వాటికి లొంగిపోవద్దని ఈ లైన్ చెబుతుంది. “ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపు” అంటే సమస్యలు వచ్చినా మనం ధైర్యంగా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. ఈ భావం చాలా మందికి జీవితంలో బలాన్ని ఇస్తుంది.

55
జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈ పాట వినండి
Image Credit : Tips Telugu/Youtube

జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈ పాట వినండి

క‌ష్టాల్లో ఉన్న మ‌నిషి ఒక్క‌సారి ఈ పాట వింటే ఆలోచ‌న మార‌డం ఖాయం. బాధలు శాశ్వతం కావు, కష్టాలు కూడా గడిచిపోతాయి, నవ్వు మనకు ధైర్యం ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఈ పాట ఇస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా మనసు బాధగా అనిపించినప్పుడు ఈ పాట వినాలి. “నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ”. అంటే న‌వ్వు మ‌న జీవితాన్ని ఒక పండుగ‌లా మారుస్తుంద‌న్న గొప్ప సందేశం ఈ పాట‌లో ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
హిట్ టాక్ తెచ్చుకున్న బైకర్ తొలి రోజు కలెక్షన్స్ ఇవే.. మొత్తానికి శర్వానంద్ గేరు మార్చాడుగా..
Recommended image2
Fastest 1500 Crore: పుష్ప 2 రికార్డు బద్దలు.. 1500 కోట్ల క్లబ్‌లో అత్యంత వేగంగా చేరిన నెం.1 సినిమా ఇదే!
Recommended image3
దృశ్యం డైరెక్టర్ కాపీ కొట్టి తీసిన క్రైమ్ థ్రిల్లర్..చంపి పాతిపెట్టే కాన్సెప్ట్ తోనే, ఓటీటీలో మంచి టైం పాస్
Related Stories
Recommended image1
మార్కెట్లో చికెన్ దొర‌క‌డం లేదా.? మిల్మేక‌ర్ క‌ర్రీని ఇలా చేశారంటే చికెన్ కూడా బ‌లాదూర్ అనాల్సిందే
Recommended image2
Doorbell: ఇంకా అవే పాత డోర్ బెల్స్ వాడుతున్నారా.? స్మార్ట్ బెల్ గురించి తెలిస్తే వెంటనే కొనేస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved