MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?

హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?

Hyderabad: భూకంపాలు ఎక్కువ‌గా ఉత్త‌ర భార‌త‌దేశంలోనే సంభ‌విస్తుంటాయి. అయితే తాజాగా మంగ‌ళ‌వారం భాగ్య న‌గ‌రంలో భూప్ర‌కంప‌న‌లు ఒక్క‌సారిగా న‌గ‌ర వాసులను ఉలిక్కిప‌డేలా చేశాయి. ఇంత‌కీ భూకంపం ఎక్క‌డ సంభ‌వించింది? భ‌విష్య‌త్తులో భూకంపం వ‌చ్చే అవ‌కాశాలున్నాయా

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 10 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌లో ఒక్కసారిగా భయాందోళన
Image Credit : etemaaddaily/Instagram, Getty

హైదరాబాద్‌లో ఒక్కసారిగా భయాందోళన

మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా భూమి షేక్ అయినట్టు అనిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు కంపనం కొనసాగిందని అక్కడ నివసించే వారు తెలిపారు.

25
పాఠశాలల్లో గందరగోళం… వీడియోలు వైరల్
Image Credit : X

పాఠశాలల్లో గందరగోళం… వీడియోలు వైరల్

ఈ సంఘటన సమయంలో పాఠశాలల్లో ఉన్న చిన్నారులు కూడా భయంతో బయటకు వచ్చారు. గాజులరామారం ఆదర్శనగర్ పరిధిలోని ఓ స్కూల్ నుంచి విద్యార్థులు తరగతుల నుంచి పరుగులు తీస్తూ బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Articles

Related image1
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Related image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
35
భూ ప్రకంపనలా? లేక ఇతర కారణమా?
Image Credit : Gemini

భూ ప్రకంపనలా? లేక ఇతర కారణమా?

భూమి కంపించిన సమయంలో భారీ శబ్దం రావడం వల్ల ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇది నిజంగా భూకంప ప్రభావమా? లేక సమీప ప్రాంతాల్లో జరుగుతున్న భారీ నిర్మాణ పనులు, బ్లాస్టింగ్ కారణమా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. స్థానికులను విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు.

45
హైదరాబాద్ భూకంప ప్రమాద స్థాయి ఎంత?
Image Credit : swagruha.telangana.gov.in

హైదరాబాద్ భూకంప ప్రమాద స్థాయి ఎంత?

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వివరాల ప్రకారం హైదరాబాద్ భూకంప ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్న నగరం. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం హైదరాబాద్‌కు పెద్ద రక్షణగా మారింది. ఇక్కడ అప్పుడప్పుడు స్వల్ప స్థాయి భూ ప్రకంపనలు నమోదయ్యే అవకాశం ఉన్నా అవి తీవ్ర నష్టం కలిగించే స్థాయిలో ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాలయ పరివాహక ప్రాంతాల్లా హైదరాబాద్ సిస్మిక్‌గా యాక్టివ్ జోన్‌లో లేదు.

55
భవిష్యత్తులో హైదరాబాద్‌కు భూకంప ప్రమాదం ఉందా?
Image Credit : Gemini AI

భవిష్యత్తులో హైదరాబాద్‌కు భూకంప ప్రమాదం ఉందా?

శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భవిష్యత్తులో హైదరాబాద్‌లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం చాలా తక్కువ. నగరం సిస్మిక్ జోన్–2 పరిధిలో ఉంది. ఈ జోన్‌లో స్వల్ప ప్రకంపనలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంటుంది. అయితే భూమి పొరల్లో జరిగే సహజ మార్పులు, భారీ మౌలిక వసతుల నిర్మాణాలు, భూగర్భ కార్యకలాపాల కారణంగా అప్పుడప్పుడు భూమి కంపించినట్టు అనిపించే ఘటనలు జరగవచ్చు. ఇవి భూకంపాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం జరిగిన ఘటనపై భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం భద్రమైన ప్రాంతమేనని మరోసారి గుర్తు చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Recommended image2
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved