MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !

Heatwave Alert: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలోని నిర్మల్‌లో 46.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 21 2026, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో రికార్డ్ బ్రేక్ హీట్
Image Credit : chatgpt

ఏపీ, తెలంగాణలో రికార్డ్ బ్రేక్ హీట్

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మే నెల వచ్చిందంటే చాలు ఎండలు మండుతాయని తెలుసు కానీ, ఈ రేంజ్‌లో మాడ పగిలిపోయేలా ఎండలు ఉంటాయని ఎవరూ ఊహించలేదు. చాలా ప్రాంతాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారిపోయాయి. 

ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ సీజన్‌లోనే అత్యంత దారుణమైన హీట్ వేవ్ ప్రస్తుతం నడుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఏపీలో పిడుగురాళ్ల రికార్డ్.. 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
Image Credit : iSTOCK

ఏపీలో పిడుగురాళ్ల రికార్డ్.. 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పీక్స్‌కు చేరింది. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఏకంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. కేవలం పిడుగురాళ్లే కాదు.. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.1 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు రికార్డయ్యాయి.

కోస్తా, రాయలసీమ పరిధిలోని 11 జిల్లాల్లో పారద 45 డిగ్రీల మార్కును దాటేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఎండ దంచికొట్టింది. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Related Articles

Related image1
Hummingbird : ప్రపంచంలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి ఇదే.. దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Related image2
Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పటినుంచో తెలుసా?
35
తెలంగాణలో నిర్మల్ రికార్డు ఉష్ణోగ్రతలు
Image Credit : 2026 Heatwave In India Extreme North India Summer Hot Weather IMD Alert Delhi temperature to rise Mega El Nino Fears

తెలంగాణలో నిర్మల్ రికార్డు ఉష్ణోగ్రతలు

ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఇక్కడ కూడా పరిస్థితి ఏమాత్రం తక్కువ లేదు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు వేడి గాలులతో అల్లాడిపోతున్నాయి. గత మూడు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు పగబట్టినట్లు ప్రతాపం చూపిస్తున్నాడు. 

రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండలో 46.4, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 46.3, జగిత్యాలలో 46.3, అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనత్‌లో 46.2 డిగ్రీల చొప్పున టాప్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఉదయం 10 గంటలకే బయట ఎండ దంచికొడుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

45
వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త: ఐఎండీ డేంజర్ అలర్ట్
Image Credit : iSTOCK

వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త: ఐఎండీ డేంజర్ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD), విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.. రానున్న నాలుగు రోజుల పాటు (మే 24 వరకు) ఇదే స్థాయిలో వేడి గాలులు, వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయి. గురువారం ఒక్క రోజే ఏపీలోని 74 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 232 మండలాల్లో సాధారణ వడగాడ్పులు వీచే ఛాన్స్ ఉంది.

అలాగే, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 26 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండటంతో, ఆ తర్వాతే ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభించవచ్చు.

55
మధ్యాహ్నం బయటకు వస్తే అంతే సంగతులు: హెల్త్ మినిస్టర్ వార్నింగ్
Image Credit : iSTOCK

మధ్యాహ్నం బయటకు వస్తే అంతే సంగతులు: హెల్త్ మినిస్టర్ వార్నింగ్

ఎండల తీవ్రతపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన గురుదేవ్ | Art Of Living 45th Anniversary | Asianet News Telugu
Recommended image2
Now Playing
Nara Lokesh: ఏపీలో వరల్డ్ క్లాస్ బెస్ట్ ఎడ్యుకేషన్ అధికారులతో లోకేష్ కీలక సమావేశం | Asianet Telugu
Recommended image3
Now Playing
పవన్, జగన్ కలుస్తారా ?? | YS Jagan | Pawan Kalyan | Nadendla Manohar | Asianet News Telugu
Related Stories
Recommended image1
Hummingbird : ప్రపంచంలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి ఇదే.. దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image2
Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పటినుంచో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved