MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • Hyderabad: నువ్వు క‌దా అన్న రియ‌ల్ హీరో అంటే.. ఆటో డ్రైవ‌ర్ ప‌నికి పోలీసులు ఫిదా, నెటిజ‌న్లు సెల్యూట్

Hyderabad: నువ్వు క‌దా అన్న రియ‌ల్ హీరో అంటే.. ఆటో డ్రైవ‌ర్ ప‌నికి పోలీసులు ఫిదా, నెటిజ‌న్లు సెల్యూట్

Hyderabad: హైద‌రాబాద్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ చూపించిన ధైర్యసాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. నగరంలోని బేగం బ‌జార్‌లో జరిగిన చైన్ స్నాచింగ్ ప్రయత్నాన్ని ఓ ఆటో డ్రైవర్ అడ్డుకొని నిందితుడిని పోలీసులకు ప‌ట్టించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 08 2026, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాకింగ్ చేస్తుండ‌గా చైన్ స్నాచింగ్
Image Credit : Sajjanar/X

వాకింగ్ చేస్తుండ‌గా చైన్ స్నాచింగ్

మంజు ఓంలత అనే మహిళ తన కోడలితో కలిసి మార్చి 4వ తేదీన మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. అదే సమయంలో సోహెల్ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. చైన్ లాక్కొని పారిపోతుండ‌గా నిందితుడి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో మహిళ వెంటనే గట్టిగా కేకలు వేసింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే తెల్ల‌వారు జామున కావ‌డంతో అక్క‌డ పెద్ద జ‌నాలు లేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆటోతో ఢీకొట్టి నిందితుడిని అడ్డుకుని..
Image Credit : V.C. Sajjanar, IPS/X

ఆటోతో ఢీకొట్టి నిందితుడిని అడ్డుకుని..

అయితే అదే స‌మ‌యంలో అటుగా ఆటోలో వెళ్తున్న మహ్మద్ జహీర్ అనే డ్రైవర్ ఈ ఘటనను తన రియర్ వ్యూ మిర్రర్‌లో గమనించాడు. దాదాపు 100 మీటర్లు ముందుకు వెళ్లిపోయినా వెంటనే ఆటోను తిరిగి సంఘటన స్థలానికి తీసుకొచ్చాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. జహీర్ తన ఆటోను అతడి బైక్‌కు బ‌లంగా ఢీకొట్టాడు. దీంతో నిందితుడు కిందపడిపోయాడు. అయితే అక్క‌డితో ఆగ‌ని సోహెల్ ఆటో డ్రైవర్‌పై దాడి చేశాడు. అయినా జహీర్ భయపడకుండా అతడిని అడ్డుకొని పారిపోకుండా నిలువరించాడు. కొద్ది సేపటికే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

34
ఆటో డ్రైవ‌ర్‌ను గుర్తించిన పోలీసులు
Image Credit : V.C. Sajjanar, IPS/X

ఆటో డ్రైవ‌ర్‌ను గుర్తించిన పోలీసులు

అయితే ఈ సాహసం చేసిన అనంతరం జాహెర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు విచార‌ణలో భాగంగా పోలీసులు అక్క‌డున్న సీసీటీవీ దృశ్యాల్లో జాహెర్ సాహ‌సాన్ని గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా జాహెర్‌ను గుర్తించారు. జాహెర్ సాహసాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ మంగళవారం (మే 05) ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కార్యాలయంలో జాహెర్‌కు ప్రశంసా పత్రం, నగదు పురస్కారాన్ని అందజేశారు. “నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్‌ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు”. అని కొనియాడారు.

✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం

✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేత

నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB

— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026

44
నిందితుడిపై ఇప్పటికే 16 కేసులు
Image Credit : V.C. Sajjanar, IPS/X

నిందితుడిపై ఇప్పటికే 16 కేసులు

ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో సోహెల్ పాత నేరస్థుడిగా తేలింది. అతడిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 16 కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల్లో ఇలాంటి బాధ్యతాయుతమైన స్పందన చాలా అవసరం అని కమిషనర్ పేర్కొన్నారు. నేరాలు జరుగుతున్నప్పుడు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Related Stories
Recommended image1
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image2
TV Remote: టీవీ రిమోట్‌ను చేతితో కొట్ట‌గానే ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల లాజిక్ ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved