MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలో మరో కూకట్ పల్లి.. ఇక్కడ రూ.40-50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, భవిష్యత్ లో అయితే కోట్లు..!

హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలో మరో కూకట్ పల్లి.. ఇక్కడ రూ.40-50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, భవిష్యత్ లో అయితే కోట్లు..!

సంగారెడ్డి… హైదరాబాద్ శివారులోని ఈ పట్టణం ఫ్యూచర్ లో మరో కూకట్ పల్లిలా మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడే ఇక్కడ ఇన్వెస్ట్ మెంట్ చేయడం, తక్కువ ధరలో లభించే ఇళ్లు కొనుగోలుచేయడం మంచిదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. 

3 Min read
Author : Arun Kumar P
Published : Mar 28 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరో కూకట్ పల్లిలా మారుతున్న సంగారెడ్డి
Image Credit : Gemini AI

మరో కూకట్ పల్లిలా మారుతున్న సంగారెడ్డి

Hyderabad : హైదరాబాద్ ఎంత వేగంగా విస్తరించిందో చెప్పడానికి కూకట్ పల్లి పర్పెక్ట్ ఉదాహరణ. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదు అనుకున్న ఈ ప్రాంతం అతితక్కువ సమయంలో ఏ స్థాయిలో మారిపోయిందో చూస్తున్నాం.. చెట్లు, ముళ్లపొదలతో అడవిలా ఉండేది కాస్త మిడిల్ క్లాస్ ప్రజల నివాసానికి అడ్డాగా మారిపోయింది. కూకట్ పల్లితోనే ఆగలేదు... మియాపూర్, చందానగర్, లింగంపల్లి, పటాన్ చెరు వరకు నగరం ఆగకుండా విస్తరిస్తూ పోతోంది.

ఇప్పుడు సంగారెడ్డి వంతు వచ్చింది... హైదరాబాద్ శివారులోని ఈ పట్టణం ఐటీ ఉద్యోగులకు అడ్డాగా మారుతోంది. ఐటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు, నగర శివారులో ప్రశాంత వాతావరణం కలిగివుండటంతో ఇప్పుడు సాప్ట్ వేర్ ఉద్యోగుల కన్ను సంగారెడ్డిపై పడింది. రాబోయే ఐదారు సంవత్సరాల్లో ఈ పట్టణ రూపరేఖలే మారిపోనున్నాయి... ఇది మరో కూకట్ పల్లి అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.40-50 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్...
Image Credit : Gemini AI

రూ.40-50 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్...

ప్రస్తుతం సంగారెడ్డిలో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. పటాన్ చెరు, ఇస్నాపూర్ నుండి సంగారెడ్డి వరకు హైదరాబాద్-ముంబై హైవే పొడవునా అపార్ట్ మెంట్స్, విల్లాలు వెలుస్తున్నారు. కానీ ఐటీ ఉద్యోగులు సంగారెడ్డిలో ఇండిపెండెంట్ ఇళ్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పట్టణం నుండి హైదరాబాద్ కు ఇప్పటికే మెరుగైన రవాణా ఉంది... భవిష్యత్ లో ఇది మరింత మెరుగుపడబోతోంది. అందుకే ఈ పట్టణం ఫస్ట్ ఛాయిస్ గా మారింది.

సంగారెడ్డిలో ప్రస్తుతం ఇండిపెండెంట్ ఇండ్లు రూ.40-50 లక్షల వరకు లభిస్తున్నాయి. హైవేకు ఆనుకుని ఉండే సంగారెడ్డి చౌరస్తా, కలెక్టరేట్ పరిసరాల్లో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా పట్టణంలోకి వెళ్లేకొద్దీ ధరలు తగ్గుతాయి. ఇక సంగారెడ్డి-సదాశివపేట మధ్యలో కూడా తక్కువ ధరకే ఇళ్లు లభిస్తున్నాయి. భవిష్యత్ లో ఈ పట్టణ రూపురేఖలు మార్చే ప్రాజెక్టులు రాబోతున్నాయి... అందుకే ఇప్పుడే తక్కువ ధరలో ఇళ్లు కొనేందుకు ఐటీ ఉద్యోగులే కాదు సామాన్య ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

Related Articles

Related image1
Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక
Related image2
హైదరాబాద్ శివార్లలో మరో సికింద్రాబాద్ లోడింగ్.. ఈ నాలుగు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఖాయం
35
 సంగారెడ్డిలో ప్లాట్స్ ధరలు..
Image Credit : Getty

సంగారెడ్డిలో ప్లాట్స్ ధరలు..

హైదరాబాద్ శివారులో ఉండటంతో సంగారెడ్డిలో అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చేసింది. అయితే నగరంలో మాదిరిగా కాకుండా ఇక్కడ కాస్త బడ్జెట్ ధరల్లో ప్లాట్స్ లభిస్తున్నారు. సామాన్య ఉద్యోగులను దృష్టిలో ఉంచుకునే ఎక్కువశాతం అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నారు... కాబట్టి తక్కువధరకే లభిస్తున్నాయి. రూ.30-40 లక్షలకే మంచి సౌకర్యాలతో కూడిన ప్లాట్స్ సంగారెడ్డిలో అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ కావాలంటే మాత్రం ముంబై హైవేకు ఆనుకుని అనేక అపార్ట్ మెంట్స్ ఉన్నాయి... ఇక్కడ ఒక్కో ప్లాట్ రూ.50-80 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.

45
 సంగారెడ్డిదే భవిష్యత్ అనడానికి ఇవే రీజన్స్..
Image Credit : Gemini AI

సంగారెడ్డిదే భవిష్యత్ అనడానికి ఇవే రీజన్స్..

భారీ ప్రాజెక్టుల రాకతో సంగారెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ కేక్‌లా మారింది. ఒకప్పుడు కేవలం జిల్లా కేంద్రంగానే ఉన్న సంగారెడ్డి, ఇప్పుడు తెలంగాణలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. త్వరలోనే ఇది హైదరాబాద్ లో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

1. రీజనల్ రింగ్ రోడ్డు (RRR)

సంగారెడ్డి ఇప్పటికే వేగంగా డెవలప్ అవుతోంది. దీన్ని జెట్ స్పీడ్ కు తీసుకెళుతోంది రీజనల్ రింగ్ రోడ్డు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ చూట్టూ ఉన్న రింగ్ రోడ్డు తరహాలోనే మరో రోడ్డు నిర్మించాలని భావిస్తోంది. నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో RRR నిర్మాణానికి పూనుకున్నారు. ఇది సంగారెడ్డి మీదుగానే వెళుతోంది. దీంతో ఒక్కసారిగా ఈ పట్టణంలో రియల్ బూమ్ పెరిగింది... ఈ రీజనల్ రింగురోడ్డు పూర్తయితే సంగారెడ్డి రూపురేఖలు మారడం ఖాయం.

2. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)

రీజనల్ రింగ్ రోడ్ (RRR),ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య ఉండటం సంగారెడ్డికి బాగా కలిసొచ్చే అంశం. ఓఆర్ఆర్ ద్వారా నగరం లోపలికి సులభంగా వెళ్లగలిగితే, ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే ఇతర జిల్లాల నుంచి సంగారెడ్డికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ ద్వారా సంగారెడ్డి నుండి ఐటీ ఏరియాలు గచ్చిబౌలి, హైటెక్ సిటీకి తొందరగా చేరుకోవచ్చు. అందుకే ఐటీ ఉద్యోగులు సంగారెడ్డి ఇళ్లు, ప్రాపర్టీస్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

55
సంగారెడ్డి రూపురేఖలు మార్చే ప్రాజెక్టులివే..
Image Credit : X/Hyderabad Metro

సంగారెడ్డి రూపురేఖలు మార్చే ప్రాజెక్టులివే..

3. హైదరాబాద్ ఐఐటీ

సంగారెడ్డి ప్రాంతం గ్లోబల్ మ్యాప్‌లో నిలవడానికి మరో ప్రధాన కారణం కందిలోని ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad). ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ వల్ల ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు పొందింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు సంగారెడ్డి పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చాయి. పిల్లల చదువుకు కూడా అనుకూలంగా ఉండటం కూడా సంగారెడ్డిని నివాస ప్రాంతంగా ఎంపిక చేసుకోడానికి మరో కారణం.

4. మెట్రో సదుపాయం, హైవే విస్తరణ

హైదరాబాద్ మెట్రోను పటాన్ చెరు, ఇస్నాపూర్ వరకు విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని సంగారెడ్డి వరకు విస్తరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదే జరిగితే రవాణా సదుపాయం మరింత మెరుగుపడి ఈ పట్టణం ఊహించని స్థాయిలో డెవలప్ అవుతుంది. ఇస్నాపూర్ వరకు మెట్రో వచ్చినా ఐటీ ఉద్యోగుల రాకపోకలకు మరింత అనువుగా మారుతుంది.

మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు ముంబై హైవే విస్తరణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. హైవేను ఆరు వరుసలుగా విస్తరించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, హైదరాబాద్ ప్రధాన ప్రాంతాల నుండి తక్కువ సమయంలోనే సంగారెడ్డికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ కనెక్టివిటీ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు నివాస ప్రాంతంగా సంగారెడ్డిని ఎంచుకుంటున్నారు.

5. పారిశ్రామిక అభివృద్ధి..

సంగారెడ్డి సమీపంలోని జహిరాబాద్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిమ్జ్ (NIMZ - National Investment and Manufacturing Zone) వంటి భారీ పారిశ్రామిక ప్రాజెక్టును చేపట్టింది. దీనివల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి.. దీంతో సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో గృహ అవసరాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ప్రాజెక్ట్ కూడా సంగారెడ్డి డెవలప్మెంట్ ను నెక్ట్స్ స్టేజ్ కు తీసుకెళుతుందని నమ్ముతున్నారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల సూచ‌న‌లు తీసుకోవ‌డ‌మే మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
స్థిరాస్తి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image3
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Related Stories
Recommended image1
Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక
Recommended image2
హైదరాబాద్ శివార్లలో మరో సికింద్రాబాద్ లోడింగ్.. ఈ నాలుగు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved