MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holiday: విద్యార్థుల‌కు ఊహించ‌ని సెల‌వులు.. ఈ వీకెండ్ వ‌రుస‌గా 3 రోజులు హాలీడేస్

Holiday: విద్యార్థుల‌కు ఊహించ‌ని సెల‌వులు.. ఈ వీకెండ్ వ‌రుస‌గా 3 రోజులు హాలీడేస్

Holiday: తెలంగాణ‌లో విద్యార్థుల‌కు ఊహించ‌ని విధంగా మూడు రోజులు సెల‌వులు ల‌భించ‌నున్నాయి. జూలై 24వ తేదీన విద్యాసంస్థ‌ల బంద్‌కు పిల‌పునిచ్చిన నేప‌థ్యంలో వ‌రుస‌గా మూడు రోజులు పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌నున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 23 2026, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నీట్ వివాదంపై విద్యార్థి సంఘాల ఆందోళన
Image Credit : Asianet News

నీట్ వివాదంపై విద్యార్థి సంఘాల ఆందోళన

నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు విద్యార్థి సంఘాలు జూలై 24వ తేదీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నీట్ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు
Image Credit : X

నీట్ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు

నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ (SFI), ఏఐఎస్‌ఎఫ్‌ (AISF), ఎన్‌ఎస్‌యూఐ (NSUI), పీడీఎస్‌యూ (PDSU), ఏఐఎఫ్‌డీఎస్‌ (AIFDS), ఏఐఎస్‌బీ (AISB), ఏఐపీఎస్‌యూ (AIPSU) తదితర విద్యార్థి సంఘాలు ఐక్యంగా ముందుకొచ్చాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ జూలై 24న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి.

Related Articles

Related image1
రూ. 40 వేల జీత‌మున్నా ఈ ల‌గ్జ‌రీ కారుకు ఓన‌ర్ అయిపోవ‌చ్చు.. లుక్‌లోనే కాదు ఫీచ‌ర్ల‌లో కూడా తోపు
Related image2
ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది
35
కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు
Image Credit : ANI

కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు

నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పరీక్షల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తూ, దాని వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలని కోరుతున్నాయి. విద్యా వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగిస్తోందంటూ VBSA బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది.

45
ఢిల్లీ ఘటనపై ఆగ్రహం.. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు
Image Credit : ANI

ఢిల్లీ ఘటనపై ఆగ్రహం.. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు

ఇటీవల ఢిల్లీలో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ప్రజలు నిలవాలని ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి పిలుపునిచ్చారు.

55
విద్యార్థులకు వరుసగా మూడు రోజుల లాంగ్ వీకెండ్
Image Credit : Getty

విద్యార్థులకు వరుసగా మూడు రోజుల లాంగ్ వీకెండ్

జూలై 24వ తేదీ శుక్రవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపు రావడంతో విద్యార్థులకు వరుస సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత జూలై 25వ తేదీ శనివారం ఏకాదశి సందర్భంగా పలు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అనంతరం జూలై 26వ తేదీ ఆదివారం సాధారణ వారాంతపు సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది. అయితే బంద్ విజయవంతం కావడం, స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థల నిర్వహణపై తుది నిర్ణయం ఆయా యాజమాన్యాలు, జిల్లా అధికారులదే. కాబట్టి విద్యార్థులు తమ కళాశాలలు లేదా పాఠశాలల నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను గమనించడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఇక్కడకూడా మహిళల పెత్తనమే వస్తది.. సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Funny Punches
Recommended image2
స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ... రూ. 16 కోట్ల‌తో హైదరాబాద్ శివారులోని ఈ ప్రాంతానికి కొత్త ఊపు
Recommended image3
Heavy Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక ఈ 9 జిల్లాల్లో వర్ష బీభత్సమే, బిఅలర్ట్
Related Stories
Recommended image1
రూ. 40 వేల జీత‌మున్నా ఈ ల‌గ్జ‌రీ కారుకు ఓన‌ర్ అయిపోవ‌చ్చు.. లుక్‌లోనే కాదు ఫీచ‌ర్ల‌లో కూడా తోపు
Recommended image2
ఇది కదా మ‌న‌ హైదరాబాదీలకు కావాల్సింది.. ఈ ఎలక్ట్రిక్ కారు మన రోడ్లపై పరుగులు పెడితే ఉంటది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved