MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి

Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి

Driving Licence: ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్ ఫైన్లకు బదులుగా ఈ-ఫైన్ పంపిస్తున్నారు. మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఒక‌వేళ మీరు ఆ నెంబ‌ర్ మార్చితే మెసేజ్ రాదు. మరి ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో నెంబర్ ఎలా మార్చుకోవాలంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 15 2026, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొబైల్ నంబర్ అప్‌డేట్ ఎందుకు అవసరం?
Image Credit : Gemini AI

మొబైల్ నంబర్ అప్‌డేట్ ఎందుకు అవసరం?

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ చాలా మందికి తర్వాత మారిపోతుంది. కానీ లైసెన్స్‌లో దానిని అప్‌డేట్ చేయరు. దీంతో ఈ-ఫైన్ లు, లైసెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు, ఇతర ముఖ్యమైన సమాచారం అందదు. కాబట్టి ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్‌ను లైసెన్స్‌తో అనుసంధానం చేసుకోవడం అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప‌రివ‌హ‌న్ సార‌థి పోర్ట్‌లో..
Image Credit : our own

ప‌రివ‌హ‌న్ సార‌థి పోర్ట్‌లో..

ఫోన్ నెంబ‌ర్ అప్డేట్ చేసుకోవాల‌నుకునే వారు ముందుగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన పరివహన్ సారథి (Parivahan Sarathi) పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత.. ఆన్‌లైన్ స‌ర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. ఆ త‌ర్వాత డ్రైవ‌ర్స్‌/లెర్న‌ర్స్ లైసెన్స్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ తెరుచుకున్న తర్వాత డ్రాప్‌డౌన్ జాబితా నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రాష్ట్రానికి సంబంధించిన సారథి డ్యాష్‌బోర్డ్ తెరుచుకుంటుంది.

35
మొబైల్ నంబర్ మార్చే ఆప్షన్ ఎలా సెల‌క్ట్ ఎంచుకోవాలి?
Image Credit : our own

మొబైల్ నంబర్ మార్చే ఆప్షన్ ఎలా సెల‌క్ట్ ఎంచుకోవాలి?

రాష్ట్ర డ్యాష్‌బోర్డ్‌లో పైభాగంలో ఉన్న Others ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే Update Mobile Number ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) ఎంపిక, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, లైసెన్స్ జారీ తేదీ, పుట్టిన తేదీ వంటి వివరాల‌న్నీ ఎంట‌ర్ చేసి త‌ర్వాత స‌బ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

45
కొత్త మొబైల్ నంబర్‌ను ఇలా నమోదు చేయండి
Image Credit : our own

కొత్త మొబైల్ నంబర్‌ను ఇలా నమోదు చేయండి

వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో పేరు, పాత మొబైల్ నంబర్, తండ్రి పేరు వంటి వివరాలను ఒకసారి పరిశీలించాలి. అన్నీ సరిగ్గా ఉంటే Proceed బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత.. కొత్త మొబైల్ నంబర్ నమోదు చేయాలి. నంబర్ మార్చడానికి కారణం ఇవ్వాలి. కొత్త నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేసి వెరిఫికేష‌న్ చేసుకోవాలి. OTP విజయవంతంగా వెరిఫై అయిన వెంటనే మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.

55
అప్‌డేట్ తర్వాత కలిగే ప్రయోజనాలు
Image Credit : our own

అప్‌డేట్ తర్వాత కలిగే ప్రయోజనాలు

మొబైల్ నంబర్ అప్‌డేట్ అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ-ఫైన్ సమాచారం వెంటనే మొబైల్‌కు వస్తుంది. లైసెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు సకాలంలో అందుతాయి. అవసరమైనప్పుడు ఆన్‌లైన్ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు. జరిమానాల సమాచారం మిస్ కాకుండా ఉంటుంది. కార్యాలయాలకు వెళ్లకుండా చాలా సేవలను ఇంట్లో నుంచే పూర్తి చేసుకోవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు కుండపోత వర్షాలు
Recommended image2
జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Recommended image3
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Related Stories
Recommended image1
USA: అమెరికాలో బ‌ట్ట‌లు బ‌య‌ట ఆరేయ‌డం నిషేధమ‌ని తెలుసా.? మ‌రి వారి ప‌రిస్థితి ఏంటో ఆలోచించారా?
Recommended image2
మూడేళ్ల క్రితం ల‌క్ష పెట్టుబ‌డి పెడితే ఈరోజు రూ. 87 ల‌క్ష‌లు అయ్యింది.. ఈ కండోమ్ కంపెనీ మ్యాజిక్ చేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved