MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • డీలిమిటేష‌న్ అంటే ఏంటి? దీంతో ఏం జరుగుతుంది.? రేవంత్ రెడ్డి దీనిని ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు.?

డీలిమిటేష‌న్ అంటే ఏంటి? దీంతో ఏం జరుగుతుంది.? రేవంత్ రెడ్డి దీనిని ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు.?

Delimitation: చెన్నైలో శనివారం జరగబోయే అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అస‌లు డీలిమిటేషన్ అంటే ఏంటి? గతంలో ఎలా అమలైంది? ఇప్పుడు ఎందుకు వివాదాస్పదంగా మారింది? వివరంగా చూద్దాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 15 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీలిమిటేషన్ అంటే ఏమిటి?
Image Credit : Asianet News

డీలిమిటేషన్ అంటే ఏమిటి?

దేశంలో జనాభా మార్పులను పరిగణలోకి తీసుకుని లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ప్రతి ప్రాంతంలో జనాభా సమానంగా ఉండేలా సీట్లు కేటాయించడం దీని ప్రధాన లక్ష్యం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ సీట్లను కూడా ఈ ప్రక్రియలోనే నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం ప్రతి జనగణన తర్వాత ఈ ప్రక్రియ జ‌రుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండేలా రాజకీయ ప్రాతినిధ్యాన్ని సర్దుబాటు చేయడమే డీలిమిటేషన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇప్పటివరకు ఎన్ని సార్లు జరిగింది?
Image Credit : our own

ఇప్పటివరకు ఎన్ని సార్లు జరిగింది?

భారతదేశంలో డీలిమిటేషన్ నాలుగు ప్రధాన దశల్లో జరిగింది:

* 1952 – మొదటి సార్వత్రిక ఎన్నికల ముందు (1951 జనాభా ఆధారం)

* 1963 – రెండోసారి సరిహద్దుల మార్పులు

* 1973 – సీట్ల సంఖ్య 545కు పెరిగింది

* 2002 – 2001 జనాభా ఆధారంగా సరిహద్దుల మార్పు (సీట్ల సంఖ్య మార్చలేదు)

అయితే 1976లో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణతో సీట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేశారు. తరువాత 84వ సవరణతో 2026 వరకు ఈ ఫ్రీజ్‌ను కొనసాగించారు.

Related Articles

Related image1
Old Bedsheets: పాత బెడ్ షీట్ల‌ను ప‌డేయ‌కండి.. ఇలా చేస్తే డ‌బ్బులు ఆదా, ఇంటికీ స్టైలిష్ లుక్
Related image2
HYD: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన‌డం కంటే.. ఇలా ప్లాన్ చేస్తే కాలుపై కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
35
సీట్ల పెంపు ఎందుకు నిలిచిపోయింది?
Image Credit : our own

సీట్ల పెంపు ఎందుకు నిలిచిపోయింది?

డీలిమిటేషన్ నిలిపివేయడానికి ప్రధాన కారణం జనాభా నియంత్రణకు ప్రోత్సాహం ఇవ్వడం. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరిగింది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం వస్తుంది. ఈ అసమానతను తగ్గించేందుకు 1971 జనాభా లెక్కల ఆధారంగానే సీట్లను స్థిరపరిచారు. అందుకే ప్రస్తుతం కూడా లోక్‌సభలో 543 సీట్లు కొనసాగుతున్నాయి.

45
కొత్త డీలిమిటేషన్‌తో ఏం మారుతుంది.?
Image Credit : our own

కొత్త డీలిమిటేషన్‌తో ఏం మారుతుంది.?

2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ దేశ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 128 సీట్లు, బీహార్‌లో 40 నుంచి 70 సీట్లు, తెలంగాణ‌లో 17 నుంచి 20 సీట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 25 నుంచి 28కి పెరుగుతాయి. అలాగే త‌మిళ‌నాడులో 39గా ఉన్న సీట్ల సంఖ్య 41కి, కేర‌ళ‌లో 20 నుంచి 19కి త‌గ్గే అవ‌కాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ లాభం లేదా నష్టం కూడా ఉండొచ్చు.

55
రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
Image Credit : ‍‍X

రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధానంపై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వాదన ప్రకారం జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయి. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలకు ఇది శిక్షలా మారుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచే ప్రతిపాదన వల్ల పెద్ద రాష్ట్రాలకే ఎక్కువ లాభం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఉత్తర–దక్షిణ మధ్య అంతరం మరింత పెరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్స్‌ను ప్ర‌తిపాదించారు.

* మోడ‌ల్ 1 ప్ర‌కారం 50% సీట్లు – జీడీపీ, ఆర్థిక పనితీరు ఆధారంగా, 50% – జనాభా ఆధారంగా కేటాయించాలి.

* మోడల్ 2లో 40% జనాభా, 40% ఆర్థిక పనితీరు, 20% సమాఖ్య సమతుల్యత ఆధారంగా నిర్ణ‌యించాలి.

ఈ విధానంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు న్యాయం, చిన్న రాష్ట్రాలకు రక్షణ, దేశ సమతుల్యత కాపాడే అవకాశం ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మొత్తం మీద డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పునర్విభజన మాత్రమే కాదు – దేశ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయం. జనాభా ఆధారంగా సీట్లు పెంచాలా? లేక అభివృద్ధి, ఆర్థిక పనితీరు కూడా పరిగణలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు సమాన న్యాయం కోరుతుంటే, కేంద్రం సమగ్ర విధానం అవసరం అని చెబుతోంది. 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ఈ వివాదానికి ఎలా తెర దించుతుందో చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
అనుముల రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image3
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Related Stories
Recommended image1
Old Bedsheets: పాత బెడ్ షీట్ల‌ను ప‌డేయ‌కండి.. ఇలా చేస్తే డ‌బ్బులు ఆదా, ఇంటికీ స్టైలిష్ లుక్
Recommended image2
HYD: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన‌డం కంటే.. ఇలా ప్లాన్ చేస్తే కాలుపై కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved