డిసెంబర్ 31 రాత్రి మందు తాగినా పోలీసులకు దొరకకూడదంటే ఏం చేయాలో తెలుసా.?
December 31: ఇయర్ ఎండ్ పార్టీల్లో ఆల్కహాల్ సర్వసాధారణమే విషయం తెలిసిందే. అయితే తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మందు తాగినా పోలీసులకు దొరకకూడదంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

బ్రీత్ అనలైజర్ టెస్ట్
తాగి వాహనం నడుపుతున్న వారిని పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ ద్వారా గుర్తిస్తారనే విషయం తెలిసిందే. శ్వాసలో మనం వదిలే గాలిలో ఎంత ఆల్కహాల్ ఉందో కొలిచే పరీక్షనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ అని అంటారు. దీని ద్వారా రక్తంలో ఉన్న ఆల్కహాల్ శాతం (BAC – Blood Alcohol Content) అంచనా వేస్తారు. పోలీసులు ఈ టెస్ట్ ద్వారా వాహనం నడపగల స్థితిలో ఉన్నామా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తారు. సాధారణంగా రోడ్డుపై చిన్న హ్యాండ్ డివైస్‌తో టెస్ట్ చేస్తారు. అవసరమైతే పోలీస్ స్టేషన్‌లో పెద్ద మెషిన్‌తో మళ్లీ పరీక్ష చేస్తారు.
బ్రీత్ అనలైజర్ ఎలా పని చేస్తుంది?
మందు తాగిన తర్వాత అది రక్తంలో కలుస్తుంది. రక్తం ఊపిరితిత్తుల ద్వారా వెళ్లేటప్పుడు కొంత ఆల్కహాల్ గాలిలోకి వస్తుంది. మనం ఊపిరి ఊదినప్పుడు ఆ గాలిని బ్రీత్ అనలైజర్ పరికరం పరీక్షిస్తుంది. ఈ పరికరంలో ఉండే కెమికల్ ఆల్కహాల్‌తో రియాక్షన్ అవుతుంది. ఆ మార్పును ఎలక్ట్రిక్ సిగ్నల్‌గా మార్చి BAC శాతాన్ని చూపిస్తుంది. సుమారు 2100 మిల్లీలీటర్ల ఊపిరి గాలి = 1 మిల్లీలీటర్ రక్తంలో ఉన్న ఆల్కహాల్ అనే లెక్కతో ఇది పని చేస్తుంది.
ఎంత ఆల్కహాల్ తాగితే డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడతాం?
భారతదేశంలో (చాలా రాష్ట్రాల్లో) చట్టం ప్రకారం అనుమతించిన పరిమితి:
BAC 0.03% వరకు – చట్టపరంగా అనుమతి
0.03% దాటితే – డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
ఇది సాధారణంగా ఇలా ఉంటుంది (వ్యక్తి బరువు, శరీర నిర్మాణంపై ఆధారపడి మారుతుంది):
30–45 నిమిషాల్లో
బీర్ 1 బాటిల్ (330 ml)
లేదా స్పిరిట్ 30 ml (విస్కీ/రమ్/వోడ్కా)
* బీర్స్ లేదా 60 ml స్పిరిట్ తాగితే. డ్రంక్ డ్రైవ్‌లో దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. “ఎంతలోపు తాగితే ఏం కాదు” అనే కచ్చితమైన లెక్క లేదు. ఒక్క డ్రింక్ కూడా కొందరిలో త్వరగా ప్రభావం చూపుతుంది.
డిసెంబర్ 31న స్పెషల్ డ్రైవ్‌లు
సాధారణ రోజులతో పోల్చితే డిసెంబర్ 31న పోలీసులు ఎక్కువగా చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. న్యూ ఇయర్ రాత్రి ఎక్కువమంది ఆల్కహాల్ తీసుకుంటారు. అందుకే ప్రధాన రోడ్లపై చెక్‌పోస్టులు, మిడ్‌నైట్ తర్వాత స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తారు. తాగి దొరికితే ఫైన్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయి.
సురక్షితంగా ఆల్కహాల్ ఎలా సేవించాలి?
ఆల్కహాల్ తాగాలని అనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
* తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకూడదు.
* ముందే క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది.
* లేదంటే ఒక డ్రైవర్‌ను నియమించుకోవాలి.
* ఇక రాత్రుళ్లు పార్టీకి అటెండ్ అవుతే ఆల్కహాల్ అలవాటు లేని ఒక స్నేహితుడిని మీ వెంట తీసుకెళ్లడం ఉత్తమం.
* ఇక ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకోకండి.
* ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరిపడ నీటిని తీసుకుంటూ ఉండాలి.
గమనిక: తక్కువ, ఎక్కువ మోతాదుతో సంబంధం లేకుండా ఆల్కహాల్ ఎంత తీసుకున్నా ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.

