- Home
- Telangana
- Dasara Holidays: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు.. ఏపీ, తెలంగాణ స్కూళ్లకు హాలిడేస్ ఎప్పటినుంచి అంటే?
Dasara Holidays: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు.. ఏపీ, తెలంగాణ స్కూళ్లకు హాలిడేస్ ఎప్పటినుంచి అంటే?
Dasara Holidays: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో అక్టోబర్ 10 నుండి 22 వరకు, ఏపీలో అక్టోబర్ 10 నుండి 21 వరకు పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ఉండనున్నాయి.

స్కూల్ పిల్లలకు పండగే పండుగ.. ఆ రోజు నుంచే దసరా సెలవులు
దసరా పండుగ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ పండుగ తెచ్చే ఆనందం వేరు. బడి పుస్తకాల ఒత్తిడి, హోమ్‌వర్క్‌లు పక్కన పెట్టి హాయిగా ఎంజాయ్ చేసేందుకు ఈ లాంగ్ హాలిడేస్ సూపర్ ఛాన్స్ ఇస్తాయి. ఈ క్రమంలోనే 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు దసరా సెలవుల అధికారిక షెడ్యూల్‌ను ఖరారు చేశాయి. విద్యా క్యాలెండర్ ప్రకారం ఇరు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం పాటు బడులు మూతపడనున్నాయి.
తెలంగాణలో ఏకంగా 13 రోజుల పండుగ సెలవులు
తెలంగాణ విద్యాశాఖ వెల్లడించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు అమల్లో ఉంటాయి. మొత్తంగా 13 రోజుల పాటు పాఠశాలలు మూసిఉంటాయి. ఈ 13 రోజుల్లో రెండో శనివారం, రెండు ఆదివారాలు కలిసి రావడం విశేషం. వీటిని మినహాయిస్తే నికరంగా 10 పనిదినాలు సెలవులుగా లభిస్తాయి. దసరా సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 23వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
పరీక్షలు ముగియగానే దసరా ధమాకా
దసరా సెలవులకు ముందే విద్యార్థులకు మొదటి సమ్మెటివ్ అసెస్‌మెంట్ (SA-1) పరీక్షలు పూర్తి చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) చర్యలు చేపట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి పాఠశాలల్లో ఎస్ఏ-1 పరీక్షలు మొదలై అక్టోబర్ 9వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. అక్టోబర్ 9వ తేదీయే చివరి పనిదినం కావడం, ఆ వెంటనే అక్టోబర్ 10 నుంచి అధికారిక సెలవులు ప్రారంభం కానుండటంతో విద్యార్థులకు ఎగ్జామ్స్ టెన్షన్ ముగియగానే పండుగ ఉత్సాహం లభించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 12 రోజులు దసరా సెలవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే, దీనికి ముందు అక్టోబర్ 10వ తేదీన రెండో శనివారం, అక్టోబర్ 11వ తేదీన ఆదివారం రావడం వల్ల విద్యార్థులకు అక్టోబర్ 10వ తేదీ నుంచే పాఠశాల బంద్ కానున్నాయి. దీంతో ఏపీలోని బడి పిల్లలకు వరుసగా 12 రోజుల పాటు సుదీర్ఘ విరామం లభించనుంది. సెలవుల అనంతరం అక్టోబర్ 22వ తేదీన స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి.
క్రైస్తవ ఎయిడెడ్ పాఠశాలలకు ప్రత్యేక నిబంధనలు
సాధారణ పాఠశాలలన్నింటికీ ఈ షెడ్యూల్ యథావిధిగా వర్తిస్తుంది. అయితే, క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు సెలవుల సర్దుబాటులో కొంత మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యాసంస్థల్లో డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా దీర్ఘకాలిక సెలవులు ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. అందువల్ల దసరా, క్రిస్మస్ సెలవులను సమన్వయం చేసుకుంటూ తమ స్థానిక పరిస్థితులక అనుగుణంగా దసరా హాలిడేస్ షెడ్యూల్‌లో మార్పులు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు.
టూర్లు, ప్రయాణాలకు ముందస్తు ప్లాన్స్
ఈ ఏడాది ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పది నుంచి పదమూడు రోజుల పాటు సెలవుల లభించడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నారు. సెలవుల తేదీలు ముందే స్పష్టంగా తెలియడంతో ఊర్లకు వెళ్లేవారు, బంధువుల ఇళ్లకు ప్లాన్ చేసుకునేవారు ఇప్పటినుంచే ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొందరు ఈ లాంగ్ హాలిడేస్‌ను సద్వినియోగం చేసుకుంటూ టూర్లు వెళ్లేందుకు ముందస్తు టికెట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.

