MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Airport: తెలంగాణ‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. పేరు ఖ‌రారు చేసిన రేవంత్‌ ప్ర‌భుత్వం.?

Airport: తెలంగాణ‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. పేరు ఖ‌రారు చేసిన రేవంత్‌ ప్ర‌భుత్వం.?

Airport: వ‌రంగ‌ల్ మూమునూరులో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతోన్న ఎయిర్‌పోర్టుకు పేరును సూచించాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను కోరింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి వచ్చిన అభిప్రాయాల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 24 2026, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మామునూరు ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు
Image Credit : Gemini AI

మామునూరు ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి సూచనలు కోరారు. దీంతో రాణి రుద్రమదేవి, కాకతీయ, సమ్మక్క-సారలమ్మ, ప్రతాపరుద్ర, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేర్లను సూచించారు. పలువురు రాణి రుద్రమదేవి పేరునే ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం రాణి రుద్రమదేవి పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కొమురం భీం పేరు
Image Credit : ai

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కొమురం భీం పేరు

ఆదిలాబాద్‌లో నిర్మించ‌నున్న‌ విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆదివాసీ ఉద్యమ చరిత్రలో కొమురం భీంకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును విమానాశ్రయానికి పెట్టే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పేర్లపై ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

మరోవైపు రెండు విమానాశ్రయాల నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తోంది. సెప్టెంబర్ 2న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై చర్చించారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేసి అప్పగించినట్లు సీఎం కేంద్రానికి తెలిపారు.

34
తెలంగాణ సంస్కృతి కనిపించేలా డిజైన్
Image Credit : Asianet News

తెలంగాణ సంస్కృతి కనిపించేలా డిజైన్

విమానాశ్రయాల పేర్లతో పాటు వాటి నిర్మాణ డిజైన్‌పైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత నిర్మాణాల డిజైన్లను పరిశీలించి, తెలంగాణ ప్రత్యేకత స్పష్టంగా కనిపించేలా ఉండాల‌ని సూచించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు పూర్తయితే వరంగల్‌తో పాటు ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి విమాన కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వ్యాపార కార్యకలాపాలకు కూడా ఇది మౌలిక వసతిగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

44
రూ.213.59 కోట్లతో కీలక నిర్మాణాలకు టెండర్లు
Image Credit : x.com/IndiGo6E

రూ.213.59 కోట్లతో కీలక నిర్మాణాలకు టెండర్లు

మామునూరు విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే కీలక నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా విడుదలైన టెండర్‌లో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్, ఫైర్ స్టేషన్, ఈఅండ్‌ఎం వర్క్‌షాప్‌తో పాటు ఇతర అనుబంధ పనులు ఉన్నాయి. ఈ ప్యాకేజీ అంచనా విలువ రూ.213.59 కోట్లు. టెండర్ ప్రకారం బిడ్ల సమర్పణకు నవంబర్ 3, 2026 చివరి తేదీగా ఉంది. సెప్టెంబర్ 2న జరిగిన కేంద్ర-రాష్ట్ర స్థాయి సమావేశంలో మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్లను త్వరగా పూర్తి చేసి డిసెంబర్‌లో ప‌నులు ప్రారంభించే అంశంపై చర్చ జరిగింది. దీంతో విమానాశ్రయ నిర్మాణం కార్యరూపం దాల్చే దిశగా అడుగులు వేగవంతమైనట్లు తెలుస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ.. తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగాలు పొందే ఛాన్స్
Recommended image2
Vinayaka Nimajjanam : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 30 వేల మంది పోలీసులతో పహారా
Recommended image3
Now Playing
తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
Related Stories
Recommended image1
ఈ నెల 25వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు... కారణం ఏంటంటే.?
Recommended image2
అమెరికాలో ఒక్క పాలకూర కట్ట ధర ఎంతో తెలుసా? మన దగ్గర కిలో చికెన్ వస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved