MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీ ఊర‌ట

Telangana: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీ ఊర‌ట

Telangana: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప‌లు లేఅవుట్లు, భవనాలకు సంబంధించిన ఆస్తులకు ఉపశమనం కల్పించేలా చర్యలు చేపట్టింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 24 2026, 10:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
22ఏ జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్‌కు అవకాశం
Image Credit : Gemini AI

22ఏ జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్‌కు అవకాశం

కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు ఉన్నప్పటికీ, భూమి రికార్డుల్లోని కొన్ని అంశాల కారణంగా ఆ ఆస్తులు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీంతో వాటిని విక్రయించడం, కొనుగోలు చేయడం, యాజమాన్య హక్కులను మార్చుకోవడం సాధ్యం కాకుండా పోయింది. ఇలాంటి కేసుల్లో కేవలం 22ఏ జాబితాలో పేరు ఉండటమే రిజిస్ట్రేషన్‌ నిరాకరణకు కారణం కాకుండా, ఆస్తికి ఉన్న చట్టబద్ధమైన అనుమతులు, ఇతర రికార్డులను పరిశీలించి ముందుకు వెళ్లేలా ప్రభుత్వం నిర్ణయించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జీహెచ్ఎమ్‌సీ, హెచ్ఎమ్‌డీఏ, డీటీసీపీ అనుమతులకు ప్రాధాన్యం
Image Credit : GHMC/X

జీహెచ్ఎమ్‌సీ, హెచ్ఎమ్‌డీఏ, డీటీసీపీ అనుమతులకు ప్రాధాన్యం

చట్టబద్ధమైన ప్లానింగ్‌ అథారిటీల నుంచి లేఅవుట్‌ లేదా నిర్మాణానికి అనుమతులు పొందిన ఆస్తులకు ఈ నిర్ణయం ముఖ్యంగా ఉపయోగపడనుంది. GHMC, HMDA, DTCP వంటి సంస్థల అనుమతులు ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల కారణంగా రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయిన సందర్భాల్లో సంబంధిత పత్రాలను సమర్పించి పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి 22ఏ భూమికి ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని కాకుండా, నిర్దేశించిన విధానం ప్రకారం అర్హతను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటారు.

34
హైదరాబాద్‌ చుట్టుపక్కల ఆస్తిదారులకు ఊరట
Image Credit : Gemini AI

హైదరాబాద్‌ చుట్టుపక్కల ఆస్తిదారులకు ఊరట

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న నివాస కాలనీలు, ప్లాట్లు, ఫ్లాట్ల యజమానులకు ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తికాకపోవడంతో కొనుగోలు, విక్రయాలు నిలిచిపోవడం, యాజమాన్య మార్పులు జరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే అర్హత ఉన్న ఆస్తులకు లావాదేవీలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి లావాదేవీలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

44
జిల్లా కలెక్టర్లకు అమలు బాధ్యతలు
Image Credit : Asianet News

జిల్లా కలెక్టర్లకు అమలు బాధ్యతలు

ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లు, DTCP, HMDA అధికారులకు రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 22ఏ జాబితాలో ఉన్న ఆస్తికి సంబంధించి అవసరమైన అనుమతులు, యాజమాన్య పత్రాలు, రెవెన్యూ రికార్డులు, ఇతర సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయిన ఆస్తిదారులు తమ వద్ద ఉన్న పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీ

22ఏ భూముల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీదేవసేనను కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించింది. రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్‌కుమార్‌ ఝా, సంబంధిత జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీలో 22ఏ భూముల అంశంపై చర్చ జరిగిన తర్వాత ఈ కమిటీ ఏర్పాటైంది. భూముల వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలను పరిశీలించడం దీని బాధ్యతల్లో ఒకటి. ఈ కమిటీ పరిధి కేవలం 22ఏ భూములకే పరిమితం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని తీసుకెళ్లే ట్ర‌క్ ఎంత స్పీడుతో వెళ్తుంది? డ్రైవ‌ర్‌కి ఎంత జీత‌మిస్తారో తెలుసా?
Recommended image2
Airport: తెలంగాణ‌లో కొత్త ఎయిర్‌పోర్టు.. పేరు ఖ‌రారు చేసిన రేవంత్‌ ప్ర‌భుత్వం.?
Recommended image3
ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ.. తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగాలు పొందే ఛాన్స్
Related Stories
Recommended image1
ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని తీసుకెళ్లే ట్ర‌క్ ఎంత స్పీడుతో వెళ్తుంది? డ్రైవ‌ర్‌కి ఎంత జీత‌మిస్తారో తెలుసా?
Recommended image2
అమెరికాలో ఒక్క పాలకూర కట్ట ధర ఎంతో తెలుసా? మన దగ్గర కిలో చికెన్ వస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved