MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • Hyderabad : ఈ వేసవిలో మీ పిల్లలను తప్పకుండా తీసుకెళ్లాల్సిన ప్రాంతాలివే..

Hyderabad : ఈ వేసవిలో మీ పిల్లలను తప్పకుండా తీసుకెళ్లాల్సిన ప్రాంతాలివే..

Hyderabad : మీరు ఈ వేసవిలో ఊటీ, కొడైకెనాల్, సిమ్లా వంటి చల్లని ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్ తో పాటు నగర చుట్టుపక్కల్లో చల్లని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. పిల్లలతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయాల్సిన ప్రాంతాలివే..

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 06 2026, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్ లో సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్...
Image Credit : Gemini AI

హైదరాబాద్ లో సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్...

 Hyderabad Tour : పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి... కాబట్టి చాలామంది ఊటీ, కొడైకెనాల్ వంటి చల్లని ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రాంతాలకు పిల్లలకు తీసుకెళ్ళలేకపోతున్నామని పేరెంట్స్ బాధపడాల్సిన పనిలేదు... నగరంలోనే పిల్లలు ఎంజాయ్ చేసే అనేక ప్రాంతాలున్నాయి. ఓ రోజు చారిత్రక ప్రాంతాలు... ఇంకోరోజు ప్రకృతి అందాలు... మరోరోజు చల్లచల్లని ప్రాంతాలకు తీసుకువెళ్లి అద్భుత అనుభూతిని పంచవచ్చు. ఇలా తల్లిదండ్రులు ఈ సమ్మర్ లో పిల్లలతో కలిసివెళ్లాల్సిన హైదరాబాద్ లోని బెస్ట్ స్పాట్స్ ఏవో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హైదరాబాద్ లో కూల్ కూల్ ట్రిప్...
Image Credit : Getty

హైదరాబాద్ లో కూల్ కూల్ ట్రిప్...

వేసవిలో ఎండలు మండిపోవడంతో పిల్లలు చల్లని ప్రాంతాలకు వెళ్ళి చిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రాంతాలు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. వాటర్ గేమ్స్ తో పాటు సరదా సరదా ఆటలతో ఎంజాయ్ చేస్తారు. ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగివచ్చేలా ఈ ప్రాంతాలు ఉన్నాయి.

వండర్లా (Wonderla) : హైదరాబాద్ శివారులో గల అద్భుతమైన అమ్యూజ్మెంట్ పార్క్ ఈ వండర్లా. ఇక్కడ వాటర్ గేమ్స్ తో పాటు ల్యాండ్ గేమ్స్ ఉంటాయి. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడే ఓ రోజంతా హాయిగా గడపవచ్చు.

ఓషన్ పార్క్, జలవిహార్ : వీటిలో కూడా వాటర్ గేమ్స్ ఉంటాయి. అయితే ఓషన్ పార్క్ అయితే హైదరాబాద్ శివారులోని గండిపేటలో ఉంటుంది... ఇక జలవిహార్ అయితే నగరం నడిబొడ్డున హుస్సెన్ సాగర్ సమీపంలో ఉంటుంది. వండర్లాతో పోలిస్తే ఇక్కడ టికెట్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి.

స్నో వరల్డ్ : ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కృత్రిమ మంచు ప్రదేశం ఈ స్నో వరల్డ్. ఇదికూడా హుస్సెన్ సాగర్ సమీపం లోయర్ ట్యాంక్ బండ్ లో ఉంటుంది. ఇక్కడికి వెళితే హిమాలయాలకు వెళ్లిన ఫీలింగ్ ఉంటుంది... హాయిగా మంచుతో ఆడుకోవచ్చు.

Related Articles

Related image1
Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు
Related image2
Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!
33
వీకెండ్ టూర్...
Image Credit : gemini

వీకెండ్ టూర్...

పిల్లలతో కలిసి వీకెండ్ లో వెళ్లాల్సిన చల్లని ప్రాంతాలు కూడా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో అనేకం ఉన్నాయి. పిల్లలు ప్రకృతిని ఆస్వాధిస్తూ ఎంజాయ్ చేస్తారు... పేరెంట్స్ కూడా పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాంటి ప్రాంతాలేవో చూద్దాం.

అనంతగిరి హిల్స్ (వికారాబాద్) : హైదరాబాద్ కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే అనంతగిరి హిల్స్ ఉంటాయి. సమ్మర్‌లో ట్రెక్కింగ్, ప్రకృతి ప్రేమికులకు ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

మల్లెలతీర్థం జలపాతం : దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం వేసవిలో హాయినిస్తుంది. దట్టమైన అటవీప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదించవచ్చు.. ఇదే సమయంలో జలపాతం వద్ద చల్లచల్లగా గడపవచ్చు. అయితే ఇది హైదరాబాద్ కు 200 కి.మీ దూరంలో ఉంటుంది.

సింగూర్ డ్యామ్ : ఇది హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి పారుదల, తాగునీటి ప్రాజెక్ట్. మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంటుంది... కాబట్టి పిల్లలు, పెద్దలు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు రెడీ... ఇక ఈ జిల్లాల్లో భారీ వర్షాలే
Recommended image2
విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
Recommended image3
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం
Related Stories
Recommended image1
Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు
Recommended image2
Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved