MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు

Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు

Hyderabad : మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు ఎంతకైనా తెగిస్తారు అనడానికి పర్పెక్ట్ ఉదాహరణ ఈ ఘటన. హైదరాబాద్ కు చెందిన ఓ సాప్ట్ వేర్ గంజాయి కోసం ఏం చేశాడో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 22 2026, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ హైదరాబాదీ మహా ముదురు...
Image Credit : Gemini AI

ఈ హైదరాబాదీ మహా ముదురు...

Hyderabad : మత్తు పదార్థాలు యువత జీవితాలను చిత్తుచేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మాదకద్రవ్యాల వాడకం ఆగడంలేదు. ఇవి ఎంత ప్రమాదకరమో తెలిసిన చదువుకున్నవారే వీటికి బానిసలు అవుతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో జల్సాలకు అలవాటుపడ్డ ధనవంతుల బిడ్డలు, బాగా సంపాదించే సాప్ట్ వేర్ ఇంజనీర్లు మాదకద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ లెక్కలు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటుపడ్డ ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి ఏకంగా నగర నడిబొడ్డున ఇంట్లోనే గంజాయి పెంచుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇంట్లోనే గంజాయి సాగు...
Image Credit : Getty

ఇంట్లోనే గంజాయి సాగు...

హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన సిహెచ్. శశిధర్ అనే యువకుడు బాగా చదువకున్నాడు... దీంతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది. ఇలా మంచి ఉద్యోగం, హాయిగా జీవించడానికి సరిపడా జీతం వస్తుండటంతో అతడిలో జల్సారాయుడు మేల్కొన్నాడు. సహచర ఉద్యోగులో లేక స్నేహితుల వల్లనో అతడికి గంజాయి తాగడం అలవాటయ్యింది… కొన్నాళ్లకే ఇది అతడికి వ్యసనంగా మారింది. గంజాయి కొట్టకుండా ఉండలేకపోయాడు.. దీంతో శాలరీ మొత్తం దీనికోసమే ఖర్చు చేసేవాడు.

ఇలా పూర్తిగా గంజాయికి అలవాటుపడ్డ అతడు సరిగ్గా పని చేయలేకపోయేవాడు. దీంతో అతడిని భరించలేక సదరు సాప్ట్ వేర్ కంపెనీ ఇంటికి పంపించింది. ఉద్యోగం లేక ఆదాయం కోల్పోయినా అతడి గంజాయి అలవాటు మాత్రం ఆగలేదు. గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో అతడిలోని క్రిమినల్ బయటకు వచ్చాడు. ''గంజాయి కొనడం ఎందుకు... ఇంట్లోనే సొంతంగా సాగుచేసుకుంటే పోలా...'' అనే ఆలోచన వచ్చినట్లుంది. వెంటనే గంజాయి సాగుకు ఇంటి టెర్రస్ పై సెటప్ చేసుకుని మొక్కలను తెచ్చి పెంచసాగాడు. ఇలా అతడు గంజాయి తాగే స్థాయినుండి దాన్ని సాగుచేసే స్థాయికి చేరుకున్నాడు.

34
ఎంత గంజాయి సాగు చేస్తున్నాడో తెలుసా..?
Image Credit : Pexels

ఎంత గంజాయి సాగు చేస్తున్నాడో తెలుసా..?

శశిధర్ గంజాయి సాగుపై పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేశాడు. రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలరాజ్ నేతృత్వంలో నాచారంలోని శశిధర్ ఇంటిపై తనిఖీ చేశారు. ఈ క్రమంలో బాగా పెరిగిన 17 భారీ గంజాయి మొక్కలు లభించాయి. కొన్ని మొక్కలు ఏకంగా మూడు మీటర్ల ఎత్తు పెరిగి ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. వీటి ద్వారా సుమారు 10 కిలోల గంజాయి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు శశిధర్ ను అరెస్ట్ చేశారు. అతడిని ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు.

44
యువతపై మత్తు పదార్ధాల పంజా.. అధికారుల హెచ్చరిక
Image Credit : Asianet News

యువతపై మత్తు పదార్ధాల పంజా.. అధికారుల హెచ్చరిక

నగరంలో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు ఇలా మాధక ద్రవ్యాల ఊబిలో కూరుకుపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి నగరవ్యాప్తంగా మత్తు పదార్ధాల నిరోధక చర్యలను ఎక్సైజ్ శాఖ ముమ్మరం చేసింది. కేవలం వినియోగదారులనే కాకుండా, సరఫరా చేసే నెట్‌వర్క్ మొత్తాన్ని వేటాడతామని... మాధకద్రవ్యాలు వాడినా లేదా అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Now Playing
Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
Recommended image2
Now Playing
మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన: Anti-Drugs Awareness Run in Araku Valley | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved