NIRF 2025 Rankings : దేశంలోనే టాప్ లా కాలేజ్ మన హైదరాబాద్ దే... ఏదో తెలుసా?
భారతదేశంలో టాప్ లా కాలేజ్ మన హైదరాబాద్ లోనే ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కాలేజీకి టాప్ ర్యాంక్ కేటాయించింది. ఇంతకూ ఆ కాలేజ్ ఏదో తెలుసా?

దేశంలోనే టాప్ లా కాలేజ్ తెలంగాణదే..
Nalsar University of Law : ఇంజనీరింగ్ లో బెస్ట్ కాలేజ్ ఏదంటే టక్కున ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ పేర్లు వినిపిస్తాయి. మేనేజ్మెంట్ అనగానే ఐఐఎం పేరు వినిపిస్తుంది. మెడికల్ అనగానే ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీ పేర్లు వినిపిస్తాయి. మరి లా అనగానే... ఇక్కడే చాలామంది కన్ప్యూజ్ అయ్యేది. సాధారణంగా న్యాయశాస్త్రాన్ని బోధించే కాలేజీలు చాలా తక్కువ... వాటిలో బెస్ట్ ఏదో ఎంచుకోవడం ఇంకా కష్టం.
అయితే చాలామంది తెలుగువాళ్లకు మన హైదరాబాద్ లో దేశంలోనే బెస్ట్ లా కాలేజ్ ఒకటి ఉందని తెలియదు. ఇప్పటికే అనేక మంది న్యాయకోవిదులను తయారుచేసింది ఈ కాలేజ్... ఎందరో సుప్రీం, హైకోర్టుల జడ్జిలు, ప్రముఖ న్యాయవాదులు ఇక్కడ చదువుకున్నవారే. తాజాగా కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో దేశంలోనే బెస్ట్ కాలేజీలకు ర్యాంకులు ప్రకటించగా ఈ హైదరబాద్ లా కాలేజ్ టాప్ లో నిలిచింది. అదే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.
KNOW
దేశంలోని టాప్ 3 లా కాలేజీల్లో నల్సార్ స్థానమెంత?
కేంద్ర ప్రభుత్వం నిన్న(గురువారం) నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ (NIRF) ర్యాంకులను ప్రకటించింది. దేశంలోని వివిధ విభాగాల్లో టాప్ కాలేజీలకు కేంద్ర విద్యాశాఖ NIRF 2025 ర్యాంకులు కేటాయించింది... ఇలా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడికల్, ఫార్మసీ, డెంటల్, ఆర్కిటెక్చర్ ఆండ్ ప్లానింగ్ వంటి పలు విభాగాల్లో టాప్ కాలేజీలను ప్రకటించారు. ఇందులో లా కాలేజీల విభాగంలో హైదరాబాద్ కు చెందిన నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా టాప్ 3 లో చోటు దక్కించుకుంది.
హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లో ఉత్తమ విద్యాబోధనతో పాటు స్టూడెంట్స్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించడంలో ముందుంది. అందుకే దీనికి కేంద్ర విద్యాశాఖ ఉత్తమ ర్యాంకు కేటాయించింది. ఇది మొత్తం 100 కు గాను 79.50 స్కోరు సాధించి 3వ ర్యాంక్ పొందింది. దేశంలోని బెస్ట్ లా కాలేజీల్లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ 82.97 స్కోరుతో టాప్ లో నిలవగా, న్యూడిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ 80.00 స్కోరుతో రెండో ర్యాంకు సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లోని టాప్ లా కాలేజీలివే
హైదరాబాద్ లోని నల్సాల్ యూనివర్సిటీ ఆఫ్ లా తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని కాలేజీలు కూడా దేశంలోని టాప్ లా విద్యాసంస్థలుగా గుర్తింపుపొందాయి. ఇందులో విశాఖపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఉంది. ఇది NIRF ర్యాంకింగ్స్ లో 63.12 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది.
ఇక హైదరాబాద్ కు చెందిన ICFAI ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ 55.28 స్కోరుతో 31వ ర్యాంక్, విశాఖపట్నంలోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ మేనేజ్మెంట్ (GITAM) 53.26 స్కోరుతో 38వ ర్యాంక్ సాధించాయి.
NIRF ర్యాంకింగ్స్ ప్రకారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు :
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT Hyderabad) - 72.31 స్కోరు - ఆలిండియా లెవెల్లో 7వ ర్యాంకు
2. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT Hyderabad) - 58.45 స్కోరు - 38వ ర్యాంకు
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి (IIT Tirupati) - 52.73 స్కోరు - 57వ ర్యాంకు
4. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - 49.36 స్కోరు - 74వ ర్యాంకు
5. విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ ఆండ్ రీసెర్చ్, గుంటూరు - 48.27 స్కోరు - 80వ ర్యాంకు
6. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం - 47.37 స్కోరు - 88వ ర్యాంకు
7. ఎస్ఆర్ యూనివర్సిటీ, వరంగల్ - 47.16 స్కోరు - 91వ ర్యాంకు
8. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTU Hyderabad) - 46.74 స్కోరు - 94వ ర్యాంకు
NIRF ర్యాంకింగ్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ యూనివర్సిటీ జాబితా :
1. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - 61.83 స్కోరు - 18వ ర్యాంకు
2. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం (AU Visakhapatnam) - 59.20 స్కోరు - 23వ ర్యాంకు
3. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ - 57.94 స్కోరు - 30వ ర్యాంకు
4. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT Hyderabad) - 52.34 స్కోరు - 55వ ర్యాంకు
5. విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ ఆండ్ రీసెర్చ్ , గుంటూరు - 50.06 స్కోరు - 70వ ర్యాంకు
6. జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTU Hyderabad) - 49.22 స్కోరు - 81వ ర్యాంకు
7. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ , గుంటూరు - 49.08 స్కోరు - 84వ ర్యాంకు
8. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ మేనేజ్మెంట్ (GITAM), విశాఖపట్నం - 48.79 స్కోరు - 88వ ర్యాంకు
NIRF ర్యాంకింగ్స్ ప్రకారం ఓవరాల్ ర్యాకింగ్స్ లో తెలుగు విద్యాలయాలు :
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ - 67.04 స్కోరు - 12వ ర్యాంకు
2. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - 60.32 స్కోరు - 26వ ర్యాంకు
3. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం - 56.62 స్కోరు - 41వ ర్యాంకు
4. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ - 55.24 స్కోరు - 53వ ర్యాంకు
5. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT Warangal) - 53.23 స్కోరు - 63వ ర్యాంకు
6. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ - 49.91 స్కోరు - 89వ ర్యాంకు