NIRF Ranking 2022: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యా సంస్థల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకులను విడుదల చేసింది. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ టాప్ ర్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు నిలిచింది.
IIT Madras Best Engineering College in India: దేశంలోని విద్యాసంస్థల్లో మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యా సంస్థల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకులను విడుదల చేసింది. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ టాప్ ర్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు నిలిచింది. టీచింగ్, లెర్నింగ్, రిసోర్సెస్, ప్రొఫెషన్ ప్రాక్టిస్ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విడుదల చేశారు. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, ఐఐటీ బాంబే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువహతి, జేఎన్‌యూ ఢిల్లీ, ఏఐఐఎంఎస్ ఢిల్లీలు ఉన్నాయి.
National Institutional Ranking Framework-2022 ప్రకారం టాప్-10 యూనివర్సీటీలు
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - బెంగళూరు (కర్నాటక)
- జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ - న్యూఢిల్లీ (న్యూఢిల్లీ)
- జామియా మిలియా ఇస్లామియా - న్యూఢిల్లీ (న్యూఢిల్లీ)
- జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం - కోల్‌కతా (బెంగాల్)
- అమృత విశ్వ విద్యాపీఠం - కోయంబత్తూరు (తమిళనాడు)
- బనారస్ హిందూ యూనివర్సిటీ - వారణాసి (ఉత్తరప్రదేశ్)
- మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ - మణిపాల్ (కర్నాటక)
- కలకత్తా విశ్వవిద్యాలయం - కోల్‌కతా (బెంగాల్)
- వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - వెల్లూరు (తమిళనాడు)
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - హైదరాబాద్ (తెలంగాణ)
- ఉస్మానియా యూనివర్సిటీ - హైదరాబాద్ ( 22వ స్థానంలో ఉంది)
National Institutional Ranking Framework-2022 ప్రకారం టాప్-5 కాలేజీలు
- మిరాండా హౌస్ - న్యూఢిల్లీ
- హిందూ కాలేజీ - ఢిల్లీ
- ప్రెసిడెన్సీ కాలేజీ - చెన్నై
- లయోలా కాలేజీ - చెన్నై
- లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ ఉమెన్ - కోయంబత్తూరు
National Institutional Ranking Framework-2022 ప్రకారం టాప్-5 లా యూనివర్సిటీలు
- నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ - బెంగళూరు
- నేషనల్ లా యూనివర్సిటీ - న్యూఢిల్లీ
- సింబయాసిస్ లా స్కూల్ - పూణే
- నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా - హైదరాబాద్
- పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యురిడిషియల్ సైన్సెస్ - కోల్‌కతా
National Institutional Ranking Framework-2022 ప్రకారం టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు
- ఐఐటీ మద్రాస్
- IIT ఢిల్లీ
- IIT బాంబే
- IIT కాన్పూర్
- IIT ఖరగ్‌పూర్
- IIT రూర్కీ
- IIT గువహతి
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - తిరుచిరాపల్లి
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - హైదరాబాద్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్
