తెలుగు రాష్ట్రాల్లో టాప్ విద్యాసంస్థలివే... ఇక్కడ చదివితే మీ పిల్లల భవిష్యత్ బంగారమే
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్స్ లో తెలుగు రాష్ట్రాలకు చెందినవి ఎన్ని విద్యాసంస్థలున్నాయి? తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో బెస్ట్ విద్యాసంస్థలేవో ఇక్కడ తెలుసుకుందాం.

IIT Hyderabad
Top Educational Institutes in Telugu States : తమ పిల్లల చదువు విషయంలో ఈతరం పేరెంట్స్ చాలా జాగ్రత్త పడుతున్నారు... మంచి చదువు, కెరీర్ కోసం లక్షలు ఖర్చుచేసి విదేశాలకు పంపిస్తున్నారు. అయితే మన దేశంలోనూ ఇప్పుడు విద్యాప్రమాణాలు పెరిగాయి... చాలా యూనిర్సిటీలు, కాలేజీలు అత్యుత్తమ విద్యాబోధనతో పాటు స్కిల్స్ డెవలప్మెట్ కోసం ఇంటర్నేషనల్ లెవల్ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇలా దేశంలో ఐఐటి, ఐఐఎంలతో పాటు చాలా కాలేజీల్లో చదివినవారు ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ కంపెనీల్లో ఉన్నతస్థానంలో ఉన్నారు.
అయితే ఏది మంచి కాలేజీ? ఎక్కడ తమ పిల్లలను చదివించాలి? అనే డైలమా చాలామంది పేరెంట్స్ కు ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నమే NIRF (National Institutional Ranking Framework) ర్యాంకింగ్స్. కేంద్ర విద్యాశాఖ దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో అందించే విద్యాభోదన, ఇతర సౌకర్యాల ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. వివిధ విభాగాల్లో అంటే ఉత్తమ యూనివర్పిటీలు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడికల్ కాలేజీలు వంటివాటిలో ర్యాంకులు ప్రకటించారు.
NIRF-2025 ర్యాంకింగ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన స్థానం సంపాదించాయి. కొన్ని విభాగాల్లో అయితే టాప్ 10 లో కూడా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్ధలు నిలిచాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుండి టాప్ 100 లో నిలిచిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
KNOW
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT Hyderabad) - 72.31 స్కోరు - ఆలిండియా లెవెల్లో 7వ ర్యాంకు
2. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT Hyderabad) - 58.45 స్కోరు - 38వ ర్యాంకు
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి (IIT Tirupati) - 52.73 స్కోరు - 57వ ర్యాంకు
4. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - 49.36 స్కోరు - 74వ ర్యాంకు
5. విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ ఆండ్ రీసెర్చ్, గుంటూరు - 48.27 స్కోరు - 80వ ర్యాంకు
6. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం - 47.37 స్కోరు - 88వ ర్యాంకు
7. ఎస్ఆర్ యూనివర్సిటీ, వరంగల్ - 47.16 స్కోరు - 91వ ర్యాంకు
8. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTU Hyderabad) - 46.74 స్కోరు - 94వ ర్యాంకు
తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ యూనివర్సిటీ జాబితా
1. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - 61.83 స్కోరు - 18వ ర్యాంకు
2. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం (AU Visakhapatnam) - 59.20 స్కోరు - 23వ ర్యాంకు
3. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ - 57.94 స్కోరు - 30వ ర్యాంకు
4. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT Hyderabad) - 52.34 స్కోరు - 55వ ర్యాంకు
5. విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ ఆండ్ రీసెర్చ్ , గుంటూరు - 50.06 స్కోరు - 70వ ర్యాంకు
6. జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTU Hyderabad) - 49.22 స్కోరు - 81వ ర్యాంకు
7. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ , గుంటూరు - 49.08 స్కోరు - 84వ ర్యాంకు
8. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ మేనేజ్మెంట్ (GITAM), విశాఖపట్నం - 48.79 స్కోరు - 88వ ర్యాంకు
ఓవరాల్ ర్యాకింగ్స్ లో టాప్ తెలుగు విద్యాలయాలు
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ - 67.04 స్కోరు - 12వ ర్యాంకు
2. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - 60.32 స్కోరు - 26వ ర్యాంకు
3. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం - 56.62 స్కోరు - 41వ ర్యాంకు
4. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ - 55.24 స్కోరు - 53వ ర్యాంకు
5. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT Warangal) - 53.23 స్కోరు - 63వ ర్యాంకు
6. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ - 49.91 స్కోరు - 89వ ర్యాంకు
ఫార్మసి, మెడికల్ విభాగంలో టాప్ తెలుగు కాలేజీలివే :
ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఆండ్ రీసెర్చ్ NIRF ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో నిలిచింది. ఈ కాలేజ్ 75.64 స్కోరుతో ఐదవస్థానంలో ఉంది. ఇక మెడికల్ విభాగంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్ ఒక్కటే టాప్ 50లో చోటు దక్కించుకుంది... ఈ కాలేజ్ 51.41 స్కోరుతో49వ స్థానంలో నిలిచింది.