MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holidays : శ్రీరామనవమి నుండి జగ్జీవన్ రామ్ జయంతి వరకు... ఏకంగా పది రోజుల సెలవులే..!

Holidays : శ్రీరామనవమి నుండి జగ్జీవన్ రామ్ జయంతి వరకు... ఏకంగా పది రోజుల సెలవులే..!

తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగులు ఎగిరిగంతేసే సమాచారం. మార్చి 27 నుండి ఏప్రిల్ 5 వరకు కేవలం మూడురోజులు సెలవులు తీసుకుంటే చాలు… వరుసగా పదిరోజులు సెలవు పొందవచ్చు. ఏరోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 27 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇక సెలవులే సెలవులు...
Image Credit : Gemini AI

ఇక సెలవులే సెలవులు...

Holidays : ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్... కాబట్టి విద్యార్ధులకు పెద్దగా సెలవులుండవు. ఇంకో నెలరోజులు గడిస్తే ఎలాగూ వేసవి సెలవులే... కాబట్టి వాళ్లు సెలవుల గురించి పెద్దగా ఆలోచించరు. కానీ ఉద్యోగులు మాత్రం వేసవిలో సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు... ఎప్పుడు సెలవు వస్తుందా, ఎప్పుడు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో చల్లని ప్రదేశాలకు వెళదామా అని అత్రుతతో ఉంటారు. ఇలాంటివారికి ఏకంగా 10 రోజులు వరుస సెలవులు పొందే అవకాశం వచ్చింది. ఉద్యోగులు ఈ సెలవుల గురించి తెలిస్తే వెంటనే లగేజ్ సర్దేస్తారు, మంచి టూర్ ప్లాన్ చేసుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
మార్చి 27 శ్రీరామ నవమి సెలవు..
Image Credit : gemini

మార్చి 27 శ్రీరామ నవమి సెలవు..

ఇవాళ (మార్చి 27) శుక్రవారం... దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణం, రామచంద్రమూర్తి పట్టాభిషేక వేడుకలతో అయోధ్య నుండి భద్రాచలం వరకు రామాలయాలు సందడిగా మారాయి. హిందువుల ముఖ్యమైన పండగ కాబట్టి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవాళ సెలవే.

38
మార్చి 28 వీకెండ్ సెలవు...
Image Credit : Getty

మార్చి 28 వీకెండ్ సెలవు...

సాధారణంగా కార్పోరేట్ సంస్థలు, ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి శనివారం సెలవు ఉంటుంది. మరికొన్ని రంగాల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వీకెండ్ సెలవు ఉంటుంది. ఇక కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారాాంతంలో సెలవు ఉంటుంది. ఇలా శ్రీరామనవమి తర్వాతరోజు మార్చి 28న కూడా సెలవు రాబోతోంది.

48
మార్చి 29 సెలవు...
Image Credit : X

మార్చి 29 సెలవు...

మార్చి 29 ఆదివారం... కాబట్టి ప్రతి వారంలాగే ఈరోజు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా శ్రీరామ నవమితో పాటు తర్వాతి రెండ్రోజులు సెలవులే... అంటే వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఇవే కాదు వచ్చేవారం మరికొన్ని సెలవులు వస్తున్నాయి.

58
మార్చి 31 సెలవు...
Image Credit : Asianet News

మార్చి 31 సెలవు...

ఈ మార్చ్ నెల ఆదివారం సెలవుతో ప్రారంభమయ్యింది... ఇప్పుడు మరో సెలవుతోనే మంత్ ఎండ్ అవుతోంది. మార్చి 31న మహవీర్ జయంతి... దేశవ్యాప్తంగా ఉన్న జైనులకు ఇది చాలా పవిత్రమైన రోజు. అందుకే ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. అంటే మార్చి 31న ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.

68
ఏప్రిల్ 3 సెలవు..
Image Credit : Getty

ఏప్రిల్ 3 సెలవు..

మార్చి నెల ముగిసి ఇలా ఏప్రిల్ లో అడుగుపెట్టగానే సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 3న క్రిస్టియన్స్ ఎంతో పవిత్రంగా భావించే గుడ్ ప్రైడే ఉంది. ఈ రోజు తమ ఇష్టదైవం యేసుక్రీస్తును స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా గుడ్ ప్రైడే వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 3న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అధికారిక సెలవు ఉంది.

78
ఏప్రిల్ 4, 5 వీకెండ్ సెలవులు..
Image Credit : Getty

ఏప్రిల్ 4, 5 వీకెండ్ సెలవులు..

ఏప్రిల్ 4న శనివారం వీకెండ్ హాలిడే ఉంటుంది. ఇక ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంది. కానీ దీని అవసరం లేకుండానే ఆదివారం సాధారణ సెలవు ఉంటుంది.

88
మార్చి 30, ఏప్రిల్ 1,2 లీవ్ తీసుకుంటే చాలు..
Image Credit : PR

మార్చి 30, ఏప్రిల్ 1,2 లీవ్ తీసుకుంటే చాలు..

మార్చి 30 (సోమవారం), ఏప్రిల్ 1,2 (బుధ, గురువారం) లీవ్ తీసుకుంటే వరుసగా పది రోజులు సెలవు పొందవచ్చు. ఇలా వేసవిలో కలిసివస్తున్న ఈ సెలవుల్లో ఉద్యోగులు ఎంజాయ్ చేయవచ్చు... ఊటీ, కొడైకెనాల్ వంటి చల్లని ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. వరుసగా పదిరోజులంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా పూర్తిచేయవచ్చు. కాబట్టి పని ఒత్తిడితో ఇబ్బందిపడే ఉద్యోగులు ఈ సెలవులను సద్వినియోగం చేసుకుని చిల్ కావచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Recommended image2
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత
Related Stories
Recommended image1
Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?
Recommended image2
Summer Holidays : ఈ వేసవి సెలవుల్లో పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? టాప్ 5 కూల్ డెస్టినేషన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved