MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?

Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?

Bank Holidays : 2026 మార్చి చివరి వారంలో శ్రీరామ నవమి, మహావీర్ జయంతి, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఏపీ, తెలంగాణలో బ్యాంకుల సెలవులు ఎప్పుడో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 25 2026, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Bank Holidays 2026: మార్చి చివరి వారంలో వరుస సెలవులు
Image Credit : Asianet News

Bank Holidays 2026: మార్చి చివరి వారంలో వరుస సెలవులు

2026 మార్చి నెల ముగింపు వేళ బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. ఈ నెల చివరి వారంలో వరుసగా పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి 26, 28, 29, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అయితే, శ్రీరామ నవమి పండుగ తిథి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో మార్చి 27న కూడా సెలవు ప్రకటించారు. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రామ నవమి సెలవుల్లో మార్పులు: 26 లేదా 27?
Image Credit : Asianet News

రామ నవమి సెలవుల్లో మార్పులు: 26 లేదా 27?

చైత్ర నవరాత్రుల ముగింపు సందర్భంగా జరుపుకునే శ్రీరామ నవమి పర్వదినం ఈ ఏడాది మార్చి 26, 27 తేదీల్లో వస్తోంది. పంచాంగం ప్రకారం, నవమి తిథి మార్చి 26, గురువారం ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27, శుక్రవారం ఉదయం 10:06 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో సెలవులు ఉన్నాయి.

• మార్చి 26న సెలవు ఉన్న రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్.

• మార్చి 27న సెలవు ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, బీహార్.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మార్చి 27న బ్యాంకులు పనిచేయవు.

34
బ్యాంకులకు వారాంతపు సెలవులు
Image Credit : Getty

బ్యాంకులకు వారాంతపు సెలవులు

పండుగ సెలవుల అనంతరం వచ్చే వారాంతంలో కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినాలు. ఈ క్రమంలో మార్చి 28న నాలుగో శనివారం కావడం, మార్చి 29న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వరుసగా రెండు రోజులు పనిచేయవు. దీనివల్ల మార్చి 26 నుండి 29 వరకు చాలా రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు వుండవు.

44
మహావీర్ జయంతి సందర్భంగా మార్చి 31న బంద్
Image Credit : Getty

మహావీర్ జయంతి సందర్భంగా మార్చి 31న బంద్

మార్చి నెల చివరి రోజైన 31వ తేదీ (మంగళవారం) మహావీర్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే, మార్చి 30వ తేదీన (సోమవారం) బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. సెలవుల సమయంలో నగదు కొరత రాకుండా ఉండేందుకు ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
అమరావతి
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
ప్రపంచంలోనే డర్టీయస్ట్ కంట్రీ ఏదో తెలుసా? ఇండియా పొజిషన్ ఏంటి?
Recommended image2
Renault Duster 2026 : అదిరిపోయే లుక్, మైలేజ్ తో పిచ్చెక్కిస్తున్న కొత్త రెనాల్ట్ డస్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved