MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మా కొడుకు మరణానికి ChatGPTనే కారణం.. కేసు న‌మోదు చేసిన పేరెంట్స్

మా కొడుకు మరణానికి ChatGPTనే కారణం.. కేసు న‌మోదు చేసిన పేరెంట్స్

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగింది. అన్ని రంగాల్లో ఏఐని ఉప‌యోగిస్తున్నారు. మ‌నిషికి అన్ని స‌ల‌హాలు ఇస్తున్న ఏఐతో ప్ర‌మాదాలు కూడా పొంచి ఉన్నాయ‌ని కొన్ని సంఘ‌ట‌న‌లు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి ఈ సంఘ‌ట‌న‌. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 03 2025, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుమారుడి ఆత్మహత్యపై తల్లిదండ్రుల కేసు
Image Credit : Getty

కుమారుడి ఆత్మహత్యపై తల్లిదండ్రుల కేసు

ఇటీవ‌ల క్యాలిఫోర్నియాలోని 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతని తల్లిదండ్రులు OpenAIపై కేసు వేశారు. ఆ బాలుడి పేరు ఆడమ్. తల్లిదండ్రులు మాథ్యూ, మారియా రైన్ దాఖలు చేసిన ఫిర్యాదులో, ChatGPT తమ కుమారుడికి ఆత్మహత్యకు సంబంధించిన సలహాలు ఇచ్చిందని, చివరకు అతడిని ప్రాణాలు తీసుకునే దిశగా ప్రోత్సహించిందని ఆరోపించారు.

24
ఆత్మహత్య సూచనలు
Image Credit : Getty

ఆత్మహత్య సూచనలు

ఫిర్యాదులోని వివరాల ప్రకారం, 2025 ఏప్రిల్ 11న ఆడమ్ ChatGPTతో చివరి సంభాషణ జరిపాడు. ఆ సమయంలో అతను ఎంచుకున్న ఆత్మహత్య పద్ధతిని సాంకేతికంగా ఎలా అమలు చేయాలో ChatGPT వివరణ ఇచ్చిందని ఆరోపించారు. గంటల వ్యవధిలోనే అదే పద్ధతిని ఉపయోగించి ఆడమ్ మృతి చెందినట్టు పేర్కొన్నారు.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లో ఎక్క‌డ భూమి కొనాలి.? ఈ ప్రాంతాల్లో ఈరోజు కొంటే రేపు కోట్లు కురుస్తాయి.
Related image2
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్ర‌త్య‌క్షం.. రీల్ చూసిన భార్య‌కు ఫ్యూజులు అవుట్
34
సూసైడ్ నోట్ రాయ‌డంలో కూడా
Image Credit : Getty

సూసైడ్ నోట్ రాయ‌డంలో కూడా

తల్లిదండ్రుల మాట‌ల ప్ర‌కారం.. మొదట ఆడమ్ చదువులో సహాయం కోసం ChatGPT ఉపయోగించాడు. కానీ క్రమంగా అతనికి చాట్‌బాట్‌పై అనారోగ్యకరమైన అనుబంధం పెరిగింది. ChatGPT అతని ప్రమాదకర ఆలోచనలకు మద్దతిచ్చి, ఆత్మహత్యా నోట్ రాయడంలో కూడా సహకరించిందని త‌ల్లి దండ్రులు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైన్ దంపతులు కోర్టును ఆశ్రయించి, పిల్లల భద్రత కోసం కొత్త నియమాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, ఆత్మహత్య లేదా స్వీయ హానిపై చర్చలు జరిగితే వాటిని ఆటోమేటిక్‌గా ముగించే విధానం, అలాగే మైనర్ యూజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్ అమలు చేయాలని కోరుతున్నారు.

44
AI భద్రతపై ఆందోళనలు
Image Credit : Getty

AI భద్రతపై ఆందోళనలు

ఈ కేసులో OpenAIతో పాటు CEO సామ్ ఆల్ట్మాన్‌ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. Common Sense Media అనే అమెరికన్ స్వచ్ఛంద సంస్థ స్పందిస్తూ, AIను స్నేహితులుగా లేదా మానసిక ఆరోగ్య సలహాదారులుగా వాడటం టీనేజర్లకు ప్రమాదకరమని హెచ్చరించింది. తాజాగా వచ్చిన ఒక అధ్యయనంలో, అమెరికా టీనేజర్లలో 75% మంది AI కంపానియన్స్ వాడుతున్నారని, వారిలో సగం మంది రెగ్యులర్ యూజర్లని తేలింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ప్రపంచం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
Recommended image2
Interesting Facts: న‌లుపు లేదా తెలుపు.. మొబైల్ ఫోన్ ఛార్జ‌ర్లు ఈ రంగుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
Recommended image3
Moltbook: ఈ సోష‌ల్ మీడియా సైట్ మ‌నుషుల కోసం కాదు రోబోల కోసం.. ఎలా ప‌నిచేస్తుందంటే
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో ఎక్క‌డ భూమి కొనాలి.? ఈ ప్రాంతాల్లో ఈరోజు కొంటే రేపు కోట్లు కురుస్తాయి.
Recommended image2
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్ర‌త్య‌క్షం.. రీల్ చూసిన భార్య‌కు ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved