MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • OnePlus N6x: వ‌న్‌ప్ల‌స్ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 18 వేల బ‌డ్జెట్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

OnePlus N6x: వ‌న్‌ప్ల‌స్ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 18 వేల బ‌డ్జెట్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

OnePlus N6x: వన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ ఎన్‌6ఎక్స్‌ను విడుదల చేసింది. ఇటీవల వచ్చిన OnePlus N6కు తోడుగా ఎంట్రీ లెవల్ విభాగంలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఆగస్టు 4 నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాను. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 31 2026, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధర ఎంత? ఎప్పుడు కొనుగోలు చేయొచ్చు?
Image Credit : Amazon.in

ధర ఎంత? ఎప్పుడు కొనుగోలు చేయొచ్చు?

OnePlus N6x రెండు వేరియంట్లలో అందుబాటులోకి వ‌స్తోంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ. 18,999 కాగా, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ. 20,999గా నిర్ణ‌యించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందిస్తోంది. ఈ ఫోన్ ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయి?
Image Credit : Amazon.in

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయి?

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ఠ ప్రకాశం అందిస్తుంది. ఐ ప్రొటెక్షన్ మోడ్, డార్క్ మోడ్, స్క్రీన్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 Apex ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. 4GB RAMతో పాటు గరిష్ఠంగా 128GB స్టోరేజ్ లభిస్తుంది. ఎక్కువసేపు గేమింగ్ లేదా భారీ వినియోగ సమయంలో వేడి తగ్గించేందుకు పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్ట‌మ్‌ను కూడా కంపెనీ అందించింది.

Related Articles

Related image1
Tirumala: ప్లాంట్ కొంటే.. జీవితాంతం తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. రంగంలోకి టీటీడీ
Related image2
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
34
కెమెరా, బ్యాటరీ ఫీచర్లు
Image Credit : Amazon.in

కెమెరా, బ్యాటరీ ఫీచర్లు

OnePlus N6x వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇందులో ఆటో ఫోకస్, 10 రెట్లు డిజిటల్ జూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌తో 1080p రిజల్యూషన్‌లో 30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7,000mAh భారీ బ్యాటరీ. దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అవసరమైతే ఇతర పరికరాలను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.

44
ఇతర ముఖ్యమైన ఫీచర్లు
Image Credit : Amazon.in

ఇతర ముఖ్యమైన ఫీచర్లు

OnePlus N6x డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో Android 16 ఆధారిత OxygenOS 16 ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఫోన్‌కు MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా లభించింది. అంటే సాధారణ వినియోగంలో మెరుగైన మన్నికను అందించేలా రూపొందించారు. ఈ ఫోన్ బ‌ర్గండీ రెడ్‌, ఐస్ బ్లూ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. 214 గ్రాముల బరువు ఉన్న ఈ ఫోన్, భారీ బ్యాటరీతో ఎక్కువసేపు ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
Latest Videos
Recommended Stories
Recommended image1
OPPO: ఒప్పో నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్‌.. మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజ‌ర్
Recommended image2
ఈ సూప‌ర్ మార్కెట్లు 24 గంట‌లు ప‌నిచేస్తాయి, ఒక్క వ‌ర్క‌ర్‌ కూడా ఉండ‌రు. ఎక్క‌డున్నాయి, ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image3
WhatsApp Tips : వాట్సాప్ లో ఈ సెక్యూరిటీ ఫీచర్ల గురించి మీకు తెలుసా? వీటిని ఆన్ చేసుకుంటేనే మీ డేటా సేఫ్
Related Stories
Recommended image1
Tirumala: ప్లాంట్ కొంటే.. జీవితాంతం తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం. రంగంలోకి టీటీడీ
Recommended image2
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved