MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ChatGPT: మహిళ ప్రాణం కాపాడిన ChatGPT.. అస‌లేం జ‌రిగిందంటే.?

ChatGPT: మహిళ ప్రాణం కాపాడిన ChatGPT.. అస‌లేం జ‌రిగిందంటే.?

కృత్రిమ మేథ ఉప‌యోగం విప‌రీతంగా పెరుగుతోంది. చిన్న చిన్న ప్ర‌శ్న‌ల‌కే కాకుండా వైద్య ప‌ర‌మైన విష‌యాల‌కు కూడా చాట్ జీపీటీ స‌మాధానాలు ఇవ్వ‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ యువ‌తి పంచుకున్న వివ‌రాలు వైర‌ల్ అవుతున్నాయి. 

2 Min read
Narender Vaitla
Published : Jul 25 2025, 01:44 PM IST| Updated : Jul 25 2025, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రాణాన్ని కాపాడిన చాట్ జీపీటీ
Image Credit : Created By Google Gemini AI

ప్రాణాన్ని కాపాడిన చాట్ జీపీటీ

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. చిన్న సందేహం వచ్చినా ప్రజలు వెంటనే ఏఐ చాట్‌బాట్‌ల సహాయం తీసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో శ్రేయ అనే యువతి తన తల్లిని చాట్ జీపీటీ స‌హాయంతో కాపాడుకున్న అనుభవాన్ని ఎక్స్ వేదిక‌గా పంచుకుంది. దీంతో ఈ ట్వీట్ కాస్త వైర‌ల్ అయ్యింది.

25
ఎంత చికిత్స చేసినా త‌గ్గ‌ని ద‌గ్గు
Image Credit : Getty

ఎంత చికిత్స చేసినా త‌గ్గ‌ని ద‌గ్గు

శ్రేయ తల్లి ఏడాది రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే ఉన్నారు. హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి సహా అనేక విధాలుగా చికిత్స చేసినా ఎటువంటి ఫలితం రాలేదు. పరిస్థితి క్రమంగా దిగజారుతుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. “ఇలాగే కొనసాగితే మరో ఆరు నెలల్లో ప్రాణహాని సంభవించే అవకాశం ఉంది” అని కూడా చెప్పారు.

Related Articles

Related image1
Motivational Story: కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కుంటేనే స‌క్సెస్.. అదేంటి అంటారా? ఈ క‌థ చదివితే మీకే అర్థ‌మ‌వుతుంది
Related image2
Electric scooter: ధ‌ర రూ. 55 వేలు, మైలేజ్ 130 కిలోమీట‌ర్లు.. లైసెన్స్ అవ‌స‌రం లేని బెస్ట్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
35
చాట్‌జీపీటీని ప్రశ్నించగా
Image Credit : GOOGLE

చాట్‌జీపీటీని ప్రశ్నించగా

తల్లి ఆరోగ్యం విష‌యంలో తీవ్ర ఆందోళన చెందిన శ్రేయ చివరి ప్రయత్నంగా చాట్‌జీపీటీ సహాయం కోరింది. తల్లి దగ్గుకు సంబంధించిన లక్షణాలను వివరించగా, చాట్‌బాట్‌ అనేక కారణాల జాబితాను అందించింది. అందులో రక్తపోటు మందులు కూడా దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతాయన్న అంశం శ్రేయ దృష్టిని ఆకర్షించింది.

45
డాక్ట‌ర్ల‌కు వివ‌రించ‌డంతో
Image Credit : Twitter

డాక్ట‌ర్ల‌కు వివ‌రించ‌డంతో

తల్లి బీపీ చికిత్సలో వాడుతున్న మందుల విషయాన్ని వెంటనే వైద్యుడికి తెలిపింది. పరీక్షించిన వైద్యుడు ఆ సూచనలో నిజం ఉందని గుర్తించి మందులను మార్చారు. కొన్ని రోజుల్లోనే తల్లి ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమైంది.

55
‘చాట్‌జీపీటీ వల్లే అమ్మ బతికింది’
Image Credit : Getty

‘చాట్‌జీపీటీ వల్లే అమ్మ బతికింది’

తల్లి కోలుకున్న తర్వాత శ్రేయ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. “వివిధ చికిత్సల తర్వాత కూడా ఫలితం రాకపోయినా, ఏఐ చాట్‌బాట్ ఇచ్చిన సూచన వల్లే మా తల్లి ప్రాణం దక్కింది” అంటూ ఆమె రాసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఏఐని స‌రిగ్గా ఉప‌యోగించుకుంటే ఎంత బాగుంటుందో ఈ సంఘ‌ట‌న చెబుతోంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు అంటున్నారు.

శ్రేయ ఎక్స్ పోస్ట్ 

ChatGPT saved my mom
My mom had a nonstop cough for 1.5 years.
We saw top doctors, visited big hospitals in & out of the city, tried homeopathy, ayurveda, allopathy nothing helped.
It got worse: internal bleeding started.
Doctors said, "If this goes on for 6 more months, it could…

— Shreya.tsx (@Life_of_coder) July 23, 2025

గ‌మ‌నిక‌: ఈ క‌థనాన్ని శ్రేయ అనే యువ‌తి ఎక్స్‌లో చేసిన పోస్ట్ ఆధారంగా అందించ‌డం జ‌రిగింది. చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్ టూల్స్ వైద్యుల‌ను భ‌ర్తీ చేయ‌లేవ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి స్వీయ చికిత్స లేదా ఇంట‌ర్నెట్ వంటి వాటిపై ఆధార‌ప‌ప‌డం మంచిది కాదు. ఆరోగ్యం విష‌యంలో క‌చ్చితంగా వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved