Samsung Galaxy : రూ.లక్ష ఫోన్..ఇప్పుడు రూ.45వేలకే..అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్..
Samsung Galaxy : రూ.లక్షకు పైగా పలికే సామ్సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.45 వేల దొరుకుతుంది. అమెజాన్‌లో ప్రకటించిన భారీ ఆఫర్‌తో డైరెక్ట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, క్రెడిట్ కార్డు క్యాష్‌బ్యాక్ కలిపి భారీగా తగ్గుతోంది. ఈ ఆఫర్ ఎలా వస్తుంది?

సామ్సంగ్ గెలాక్సీ S26 FE 5G ధర తగ్గింపు
ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తో పాటు కాస్త అందుబాటులో ఉండే బడ్జెట్.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో సామ్సంగ్ 'FE' సిరీస్ ఫోన్స్ ముందుంటాయి. మీరూ అలాంటి ఫోన్ కోసం చూస్తుంటే, తాజాగా వచ్చిన ఈ ఆఫర్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సామ్సంగ్ గెలాక్సీ S26 FE 5G స్మార్ట్‌ఫోన్ ను తక్కువ ధరకే ఎలా సొంతం చేసుకోవచ్చో చూద్దాం.
అమెజాన్‌లో సామ్సంగ్ గెలాక్సీ S26 FE ఆఫర్ వివరాలు
సామ్సంగ్ గెలాక్సీ S26 FE 5G (8GB RAM + 256GB స్టోరేజ్, పిస్తా కలర్) మోడల్ అసలు ధర (MRP) రూ.1,09,999. కానీ, ప్రస్తుతం అమెజాన్ లో ఇది రూ.66,999 కే అందుబాటులో ఉంది. ఎలాంటి ఇతర ఆఫర్లు లేకుండానే డైరెక్ట్ గా 39% డిస్కౌంట్ అంటే.. సుమారు రూ.43,000 ఆదా చేసుకోవచ్చు.
దీనితో పాటు అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ వాడితే ధర మరింత తగ్గుతుంది. ఉదాహరణకు, రెండేళ్ల క్రితం నాటి సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.19,800 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ S26 FE ఫోన్ ధర రూ.47,199కి పడిపోతుంది. ఇతర పాత ఫోన్లకు కూడా ఇలాంటి మంచి ఎక్స్చేంజ్ వాల్యూనే వస్తుంది.
'అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్' క్రెడిట్ కార్డు వాడేవారికి అదనపు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు 5%, నాన్-ప్రైమ్ మెంబర్స్ కు 3% క్యాష్‌బ్యాక్ వస్తుంది. అయితే ఈఎంఐ ఆర్డర్స్, అమెజాన్ బిజినెస్ లావాదేవీలకు ఇది వర్తించదు.
ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే ఈ ఫోన్ ను ఫైనల్ గా రూ.45,000 నుంచి రూ.50,000 లోపే కొనొచ్చు. మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ ను బట్టి డిస్కౌంట్ మారుతుంది. బాగా పనిచేసే ఫోన్ కు మంచి వాల్యూ దక్కుతుంది.
డిస్ ప్లే & పెర్ఫార్మెన్స్
డిస్ ప్లే - ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో 6.7-అంగుళాల డిస్ ప్లే ని కలిగి ఉంది.
పెర్ఫార్మెన్స్ - సామ్సంగ్ సొంత ఎక్సినోస్ 2500 (Exynos 2500) చిప్సెట్ తో ఇది పనిచేస్తుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. రోజువారీ పనులు, మల్టీ-టాస్కింగ్, హెవీ యాప్స్ ను ఇది సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు.
అప్డేట్స్ & డిజైన్
సాఫ్ట్వేర్ & అప్డేట్స్ - ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చే ఈ ఫోన్ కు ఏకంగా 7 ఏళ్ల పాటు ఓఎస్ (OS), సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని సామ్సంగ్ హామీ ఇచ్చింది. ఒకే ఫోన్ ను ఎక్కువ కాలం వాడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
డిజైన్ - గ్లాస్, అల్యూమినియం (Glass-and-aluminium) తో తయారు చేసిన ఈ ఫోన్, మిడ్-రేంజ్ ఫోన్ల కంటే ప్రీమియం లుక్ ను ఇస్తుంది.











