MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Feature
  • Motivational Story: కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కుంటేనే స‌క్సెస్.. అదేంటి అంటారా? ఈ క‌థ చదివితే మీకే అర్థ‌మ‌వుతుంది

Motivational Story: కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కుంటేనే స‌క్సెస్.. అదేంటి అంటారా? ఈ క‌థ చదివితే మీకే అర్థ‌మ‌వుతుంది

సాధార‌ణంగా కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కోవ‌ద్దు అని పెద్దలు చెబుతుంటారు. అయితే జీవితంలో విజ‌యం సాధించాలంటే మాత్రం కొమ్మ‌ను నరుక్కోవాల్సిందే అని చెప్పే ఒక మంచి నీతి క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 25 2025, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అడవిలో మొదలైన ప్రయాణం
Image Credit : Google Gemini AI

అడవిలో మొదలైన ప్రయాణం

అన‌గ‌న‌గ ఒక రాజు ఓ రోజు వేటకు అడవికి వెళ్తాడు. వేటలో ఉండగా అతనికి ఒక అందమైన చిలుక కనిపిస్తుంది. ఆ చిలుక ఎంతో యాక్టివ్‌గా ఎగురుతూ ఉండటంతో రాజు దానిని చూసి మంత్రముగ్ధుడవుతాడు. ఇంత అంద‌మైన చిలుక నా కోట‌లో ఉంటే ఎంతో బాగుటుంద‌ని ఆశ‌ప‌డి వెంట‌నే దానిని బంధించి అంతపురానికి తీసుకువెళ్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమహల్‌లో చిలుకకు రాచ మ‌ర్యాద‌లు
Image Credit : Google Gemini AI

రాజమహల్‌లో చిలుకకు రాచ మ‌ర్యాద‌లు

రాజమహల్‌లో చిలుకను బంగారు పంజరంలో ఉంచి జీడిపప్పు, బాదంపప్పు, పండ్లు వంటి రుచికరమైన ఆహారం ఇస్తాడు. చిలుకకు కావాల్సిన అన్నీ సౌకర్యాలు కాళ్లదగ్గరే లభించేవి. ఇలా కొన్ని రోజులు గడిచాక రాజు చిలుక గాల్లో ఎగ‌ర‌డాన్ని చూడాల‌ని అనుకుంటాడు.

35
ఎగ‌ర‌డం మ‌ర్చిపోయిన చిలుక
Image Credit : Google Gemini AI

ఎగ‌ర‌డం మ‌ర్చిపోయిన చిలుక

ఇందులో భాగంగానే అక్క‌డే ఉన్న కొంత‌మందికి చిలుక‌ను పంజారం నుంచి బ‌య‌ట‌కు తీయ‌మ‌ని చెబుతాడు. వెంట‌నే సైనికులు చిలుక‌ను బ‌య‌ట‌కు తీసి చెట్టు కొమ్మ‌పై కూర్చొబెడ‌తారు. అయితే చిలుక మాత్రం క‌ద‌ల‌కుండా ఉండిపోతుంది.

సైనికులందరూ చప్పట్లు కొడుతూ దాన్ని ఎగరమని ప్రోత్సహిస్తారు. కానీ చిలుక మాత్రం క‌ద‌ల‌దు. ఎందుకంటే అది ఇప్పటికే సౌకర్యాల మధ్య జీవించడం అలవాటు చేసుకుంది. అడవిలో ఉండే స్వేచ్ఛ, జీవన పోరాటం అన్నీ మరిచిపోయింది.

45
రాజు కీల‌క నిర్ణ‌యం
Image Credit : Google Gemini AI

రాజు కీల‌క నిర్ణ‌యం

దీంతో రాజు ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. ఆ చిలుక‌ను ఎవ‌రైతే ఎగిరేలా చేస్తారో వారికి బ‌హుమతి ఇస్తాన‌ని ప్ర‌క‌టిస్తారు. అయితే చిలుకను ఎగరించే పనిలో చాలామంది విఫలమవుతారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఓ రైతు వేరే పద్ధతిని ఆలోచిస్తాడు. చిలుక కూర్చున్న కొమ్మను గొడ్డలితో నరికి వేస్తాడు. ఒక్కసారిగా చిలుక భయంతో రెక్కలు చాచుకొని ఎగురుతుంది. కొద్ది సేపటికి అది మళ్లీ మునుపటిలాగే ఆకాశంలో విహరించడం మొదలు పెడుతుంది.

55
క‌థ చిన్న‌దే నీతి గొప్ప‌ది
Image Credit : Google Gemini AI

క‌థ చిన్న‌దే నీతి గొప్ప‌ది

ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కంఫర్ట్ జోన్‌లో ఎక్కువ కాలం ఉంటే మన సామర్థ్యాలు, నైపుణ్యాలు మసకబారిపోతాయి. కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మన అసలు శక్తి బయటపడుతుంది. చిలుక ఎగరడానికి కొమ్మ నరికినట్టు, మన జీవితంలోనూ కొన్ని సార్లు కంఫర్ట్ జోన్‌ను విడిచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే నిజమైన విజయం సాధించవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Engine: కార్లకు ఇంజన్ ముందే ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీక్రెట్ లాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Uniform Colors : డాక్టర్లు తెల్లకోటు, పోలీసులు ఖాకీ డ్రెస్.. ఏ యూనిఫామ్ వెనక ఏ అర్థం దాగుందో తెలుసా?
Recommended image3
Rats Behavior : ఎలుకలు ఏ వస్తువులనైనా ఎందుకు కొరికి పాడుచేస్తాయి? అసలు కారణం ఇదే..!
Related Stories
Recommended image1
Electric scooter: ధ‌ర రూ. 55 వేలు, మైలేజ్ 130 కిలోమీట‌ర్లు.. లైసెన్స్ అవ‌స‌రం లేని బెస్ట్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved