MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Best Smart Band : 21 రోజుల బ్యాటరీ, 150+ స్పోర్ట్స్ మోడ్స్‌... అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్

Best Smart Band : 21 రోజుల బ్యాటరీ, 150+ స్పోర్ట్స్ మోడ్స్‌... అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్

1.72-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో 'షావోమి స్మార్ట్ బ్యాండ్ 11' (Xiaomi Smart Band 11) రిలీజ్ అయింది. దీని ధర, ఇతర పూర్తి ఫీచర్ల వివరాలు చూసేయండి!

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 18 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11 లాంచ్
Image Credit : Xiaomi

షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11 లాంచ్

ప్రపంచ మార్కెట్లలో షియోమీ తన కొత్త 'షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11' (Xiaomi Smart Band 11)ను లాంచ్ చేసింది. 1.72-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్ ప్లేతో వచ్చిన ఈ స్మార్ట్ బ్యాండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2) మానిటరింగ్, వైబ్రేషన్ అలర్ట్స్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నీటి అడుగున కూడా ఇది హార్ట్ రేట్‌ను ట్రాక్ చేయగలదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11 ధర వివరాలు (Price)
Image Credit : Xiaomi

షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11 ధర వివరాలు (Price)

భారతీయ కరెన్సీ ప్రకారం షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11 ధర సుమారు రూ. 5,500గా ఉంది. ఇది మిడ్ నైట్ బ్లాక్ (Midnight Black), గ్లేసియర్ సిల్వర్ (Glacier Silver), మిస్టిక్ రోజ్ (Mystic Rose) కలర్స్‌లో లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్స్‌తో పాటు, ప్రత్యేకమైన యూనిబాడీ అల్యూమినియం (Unibody Aluminium), సిరామిక్ (Ceramic) ఫినిష్ మోడల్స్‌లో కూడా ఇది మార్కెట్లోకి వచ్చింది. షియోమీ 18 ప్రో (Xiaomi 18 Pro) సిరీస్, మిజియా (Mijia) డివైజ్‌లతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో కూడా ఇది అమ్మకానికి వస్తోంది.

34
ఫీచర్లు & స్పెసిఫికేషన్లు (Specifications & Features)
Image Credit : Xiaomi

ఫీచర్లు & స్పెసిఫికేషన్లు (Specifications & Features)

షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11లో 212x520 పిక్సెల్ రిజల్యూషన్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 1.72-అంగుళాల అమోలెడ్ టచ్ డిస్ ప్లేను ఇచ్చారు. 9.99 మి.మీ మందం ఉన్న ఈ బ్యాండ్ బరువు (స్ట్రాప్ లేకుండా) కేవలం 15.58 గ్రాములు మాత్రమే. కచ్చితమైన హెల్త్ ట్రాకింగ్ కోసం డ్యూయల్-ఎల్ఈడీ (Dual-LED), డ్యూయల్-పీడీ (Dual-PD) ఆప్టికల్ సెన్సార్లతో పాటు సరికొత్త హార్ట్ రేట్ అల్గారిథమ్స్, మెడికల్ కాలిబ్రేషన్‌ను ఇందులో వాడారు.

24 గంటల పాటు హార్ట్ రేట్, SpO2ను ఇది మానిటర్ చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే వెంటనే వైబ్రేషన్ ద్వారా అలర్ట్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ మానిటరింగ్, మహిళల ఆరోగ్య నిర్వహణ, స్లీప్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 150 పైగా స్పోర్ట్స్ మోడ్స్ కు సపోర్ట్ చేస్తుంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్ ఉన్నందున స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు కూడా హార్ట్ రేట్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.

44
సెన్సార్లు & కనెక్టివిటీ ఫీచర్లు
Image Credit : Xiaomi

సెన్సార్లు & కనెక్టివిటీ ఫీచర్లు

ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, పల్స్ ఆక్సీమీటర్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, లీనియర్ హాప్టిక్ మోటార్ వంటి సెన్సార్లను ఇందులో అమర్చారు. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం ఎన్ఎఫ్సీ (NFC), రిమోట్ కెమెరా షట్టర్ కంట్రోల్, షార్ట్‌కట్ జెస్చర్స్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 8.0 లేదా ఐఓఎస్ 14.0 ఆపై వెర్షన్లలో 'Mi Fitness' యాప్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 233mAh బ్యాటరీ ఇచ్చారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 90 నిమిషాలు పడుతుంది. లైట్ యూసేజ్‌లో 21 రోజులు, నార్మల్ యూసేజ్‌లో 10 రోజులు, ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే (AOD) ఆన్‌లో ఉంటే 6 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని షియోమీ పేర్కొంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(21.1 ov) 98 & 74/3
Day 2 - Session 3
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Samsung Galaxy : రూ.లక్ష ఫోన్..ఇప్పుడు రూ.45వేలకే..అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్..
Recommended image2
విన‌డానికి ఒకేలా ఉన్నా.. వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ మధ్య తేడాలు ఏంటో తెలుసా?
Recommended image3
Cyber Security: ప్రపంచాన్ని వణికించిన టెక్ అవుటేజ్‌లు.. అసలు ఏం జరుగుతోంది? మీ డేటాను ఇలా కాపాడుకోండి
Related Stories
Recommended image1
Smart Watches : టైటాన్ నుండి రియల్ మీ వరకు.. బెస్ట్ 5 స్మార్ట్ వాచెస్ ఇవే
Recommended image2
Best Smart Watch : 10 రోజుల బ్యాటరీ లైఫ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్.. ఈ వాచ్ చాలా స్మార్ట్ గురూ..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved