MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • CCTV: ప్రపంచంలో మొట్ట‌ మొదటి CCTV కెమెరాను ఎందుకు తయారు చేశారో తెలుసా.?

CCTV: ప్రపంచంలో మొట్ట‌ మొదటి CCTV కెమెరాను ఎందుకు తయారు చేశారో తెలుసా.?

CCTV: ప్ర‌స్తుతం సీసీటీవీ వినియోగం భారీగా పెరిగింది. వీధులు, షాపులు, బ్యాంకులు, ఇళ్ల వద్ద ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. అయితే సీసీటీవీ కెమెరాల‌ను ఎందుకు రూపొందించారో తెలిస్తే మీరు క‌చ్చితంగా షాక్ కావాల్సిందే. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 07 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదలైన CCTV కథ
Image Credit : Asianet News

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మొదలైన CCTV కథ

1940లలో ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం ప్రభావంలో ఉంది. అప్పట్లో జర్మనీ శక్తివంతమైన ఆయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా V-2 రాకెట్ అనే దీర్ఘదూర క్షిపణిని తయారు చేసింది. ఈ రాకెట్ ప్రపంచంలో తొలి లాంగ్ రేంజ్ గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ గా గుర్తింపు పొందింది. అయితే దీని పరీక్షలు చాలా ప్రమాదకరంగా ఉండేవి. లాంచ్ సమయంలో చిన్న లోపం జరిగినా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉండేది. శాస్త్రవేత్తలు రాకెట్ దగ్గర నిలబడి పరిశీలించడం అసాధ్యం. అందుకే సురక్షిత దూరం నుంచి రాకెట్ లాంచ్‌ను చూడగలిగే ఒక ప్రత్యేక పద్ధతి అవసరమైంది.

25
జర్మన్ ఇంజినీర్ రూపొందించిన తొలి CCTV వ్యవస్థ
Image Credit : Getty

జర్మన్ ఇంజినీర్ రూపొందించిన తొలి CCTV వ్యవస్థ

ఈ సమస్యకు పరిష్కారం చూపింది జర్మనీకి చెందిన ఇంజినీర్ వాల్ట‌ర్ బ్ర‌చ్‌. 1942లో ఆయన ఒక ప్రత్యేక కెమెరా వ్యవస్థను రూపొందించారు. ఈ కెమెరాలను జర్మనీలోని పీనేమ్యుండే (Peenemünde) మిలిటరీ బేస్ వద్ద రాకెట్ లాంచ్ ప్యాడ్ దగ్గర అమర్చారు. కెమెరాలు రాకెట్ నుంచి వచ్చే మంటలు, వేగం వంటి వివరాలను రికార్డు చేయడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యం భద్రత కాదు. శాస్త్రవేత్తలు రాకెట్ పనితీరును సురక్షితంగా గమనించి డేటా సేకరించడానికి ఇది ఉపయోగపడింది.

Related Articles

Related image1
Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?
Related image2
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
35
“క్లోజ్డ్ సర్క్యూట్” అనే పదం ఎలా వచ్చింది?
Image Credit : Getty

“క్లోజ్డ్ సర్క్యూట్” అనే పదం ఎలా వచ్చింది?

వాల్ట‌ర్ బ్ర‌చ్ రూపొందించిన కెమెరా సిస్టమ్‌లో ఒక ముఖ్యమైన టెక్నాలజీ ఉంది. కెమెరా నుంచి వచ్చే వీడియో సిగ్నల్‌ను కేబుల్ ద్వారా నేరుగా ఒక మానిటర్‌కు పంపే విధానం. అంటే టీవీ ప్రసారాల్లా గాలిలో సిగ్నల్ పంపడం కాదు. ఒక మూసిన వైర్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే వీడియో చేరేది. అందుకే దీనికి క్లోజ్‌డ్ స‌ర్క్యూట్ టెలివిజ‌న్ (CCTV) అనే పేరు వచ్చింది. ఈ విధానం వల్ల శాస్త్రవేత్తలు బంకర్‌లో కూర్చొని రాకెట్ లాంచ్‌ను ప్రత్యక్షంగా చూడగలిగారు.

45
ప్రమాదకర పరిస్థితుల్లో కెమెరాల రక్షణ
Image Credit : Getty

ప్రమాదకర పరిస్థితుల్లో కెమెరాల రక్షణ

రాకెట్ లాంచ్ సమయంలో భారీ మంటలు, వేడి, షాక్‌వేవ్స్ వస్తాయి. అందుకే కెమెరాలను ప్రత్యేక రక్షణతో ఏర్పాటు చేశారు. వీటిలో ప్ర‌ధానంగా.. కెమెరాలను, మందమైన స్టీల్ కవర్లు, బలమైన కాంక్రీట్ షీల్డ్ లోపల అమర్చారు. అక్కడి నుంచి పొడవైన కేబుల్స్ ద్వారా సిగ్నల్‌ను దూరంలోని సురక్షిత బంకర్ కు పంపించారు. ఈ బంకర్‌లో కూర్చుని శాస్త్రవేత్తలు మొదటిసారి తమ ప్రాణాలకు ప్రమాదం లేకుండా రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా గమనించారు.

55
తర్వాత భద్రతా వ్యవస్థగా మారిన CCTV
Image Credit : Getty

తర్వాత భద్రతా వ్యవస్థగా మారిన CCTV

జర్మనీలో ఈ ప్రయోగం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకే CCTV టెక్నాలజీ ప్రపంచానికి పరిచయమైంది. 1949లో అమెరికాకు చెందిన Vericon అనే కంపెనీ ఈ సిస్టమ్‌ను వాణిజ్యంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఆదిలో ఈ కెమెరాలకు రికార్డింగ్ సదుపాయం లేదు. మానిటర్ ముందు కూర్చొని లైవ్‌గా మాత్రమే చూడాలి. తర్వాత కాలంలో VCR టెక్నాలజీ, ఆపై డిజిటల్ స్టోరేజ్ వచ్చాయి. దాంతో CCTV కెమెరాలు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్, వీధులు, ఇళ్లు లాంటివి భద్రత కోసం విస్తృతంగా ఉప‌యోగిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్... ఎలా అమలుచేస్తారో తెలుసా..?
Recommended image2
Meta: స్మార్ట్ గ్లాసుల్లో రికార్డ్ అయ్యే పర్సనల్ వీడియోలను ఎవరైనా చూస్తున్నారా.?
Recommended image3
Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?
Related Stories
Recommended image1
Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?
Recommended image2
నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved