MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?

Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ ఉన్న టాప్-8 దేశాల జాబితా చూస్తే ఆశ్చర్యపోతారు. అమెరికా, చైనా, రష్యా వంటి పెద్ద దేశాలు ఈ లిస్టులో టాప్‌లో లేవు... ఏ దేశాలు ఉన్నాయో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 04 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం...
Image Credit : Getty

ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం...

రిలయన్స్ జియో ఎంట్రీతో ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందనే చెప్పాలి. మొదట్లో ఫ్రీగా అపరిమిత డేటా అందించడంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగింది... యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటివి ప్రజలకు బాగా చేరువయ్యాయి. జియో సునామీని తట్టుకునేందుకు ప్రత్యర్థి టెలికాం సంస్థలు కూడా ఇంటర్నెట్ డేటా ఛార్జీలు తగ్గించాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్ వాడుతున్న దేశాల్లో ఇండియా టాప్ లో ఉంది... కానీ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో మనం ఇంకా వెనకబడే ఉన్నాం. మరి జెట్ స్పీడ్ ఇంటర్నెట్ కలిగిన దేశాలేవి..? ఈ విషయంతో ఇండియా స్థానమెంత..?

27
1. యూఏఈ
Image Credit : Getty

1. యూఏఈ

అరేబియా ద్వీపకల్పంలో ఆగ్నేయంగా, పర్షియన్ గల్ఫ్ తీరంలో యూఏఈ ఉంటుంది. ఈ ఎడారి దేశం ప్రజల లగ్జరీ జీవనశైలికి, ఆకాశహర్మ్యాలకు ఫేమస్. ఇక్కడ సగటున 686.12 Mbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఇలా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశంగా యూఏఈ నిలుస్తోంది.

Related Articles

Related image1
Internet speed: సెకనులో 10 సినిమాలు డౌన్‌లోడ్‌.. స్టార్‌లింక్‌ని మించి, 100 జీబీపీఎస్‌తో ఇంటర్నెట్‌ సేవలు
Related image2
Internet: ఈ రోజు మనం ఇంటర్నెట్ వాడుతున్నామంటే దానికి ఈ వ్యక్తే కారణం.. ఇంతకీయన ఎవరంటే
37
2. ఖతార్
Image Credit : Getty

2. ఖతార్

సౌదీ అరేబియాతో సరిహద్దు పంచుకుంటున్న చిన్న ద్వీపకల్ప దేశం ఖతార్. ఇదికూడా ఎడారి దేశమే... కానీ ఇక్కడ చమురు నిల్వల కారణంగా బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగివుంది. రాజధాని దోహాలో అత్యాధునిక సౌకర్యాలు, లగ్జరీ జీవితాన్ని కలిగివుండే ప్రజలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ క్రమంలో ఈ దేశం మెరుగైన ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. సగటున 593.34 Mbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది... ఇలా ఖతార్ రెండో స్థానంలో ఉంది.

47
3. కువైట్
Image Credit : Asianet News

3. కువైట్

కువైట్ ఒక ఎడారి దేశం. ఇది అరేబియా ద్వీపకల్పానికి ఈశాన్యంలో ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్‌తో సరిహద్దులను పంచుకుంటుంది. సగటున 399.83 Mbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ప్రపంచంలోనే కువైట్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.

57
4. బహ్రెయిన్
Image Credit : Getty

4. బహ్రెయిన్

బహ్రెయిన్ పర్షియన్ గల్ఫ్‌లోని ఒక ద్వీప దేశం. కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా సౌదీ అరేబియాతో ఇది కనెక్ట్ అయి ఉంది. సగటున 332.04 Mbps ఇంటర్నెట్ వేగంతో, బహ్రెయిన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

67
5. బల్గేరియా
Image Credit : Gemini

5. బల్గేరియా

యూరప్ దేశమైన బల్గేరియాలో సగటు మొబైల్ ఇంటర్నెట్ వేగం 277.97 Mbps. ఈ జాబితాలో బ్రెజిల్ ఆరో స్థానంలో, దక్షిణ కొరియా ఏడో స్థానంలో, బ్రూనై ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాను ఊక్లా (Ookla) రూపొందించింది.

77
ఇంటర్నెట్ స్పీడ్ లో ఇండియా ర్యాంక్ ఎంత..?
Image Credit : Getty

ఇంటర్నెట్ స్పీడ్ లో ఇండియా ర్యాంక్ ఎంత..?

ప్రపంచ దేశాలన్నీ వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం పోటీ పడుతున్నాయి. ఊక్లా (Ookla) రిపోర్ట్ ప్రకారం.. మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో భారత్ ప్రస్తుతం 133.51 Mbps సగటు వేగంతో ప్రపంచవ్యాప్తంగా 26వ స్థానంలో ఉంది. గత ర్యాంకింగ్‌తో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. ఇక అమెరికా 165.57 Mbps వేగంతో 14వ స్థానంలో ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image2
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Recommended image3
రాబోయేది ఆర్థిక సంక్షోభమే.. హైదరబాదీలు ఈ జాగ్రత్తలు పాటించండి..
Related Stories
Recommended image1
Internet speed: సెకనులో 10 సినిమాలు డౌన్‌లోడ్‌.. స్టార్‌లింక్‌ని మించి, 100 జీబీపీఎస్‌తో ఇంటర్నెట్‌ సేవలు
Recommended image2
Internet: ఈ రోజు మనం ఇంటర్నెట్ వాడుతున్నామంటే దానికి ఈ వ్యక్తే కారణం.. ఇంతకీయన ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved