MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • AI: 70 ఏళ్ల క్రిత‌మే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పేరు వ‌చ్చింద‌ని తెలుసా? ఎవ‌రు క‌నిపెట్టారంటే.?

AI: 70 ఏళ్ల క్రిత‌మే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పేరు వ‌చ్చింద‌ని తెలుసా? ఎవ‌రు క‌నిపెట్టారంటే.?

AI: ఇటీవల ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంద‌రూ చ‌ర్చిస్తున్నారు. అయితే “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” అనే పదం మొదట 70 ఏళ్ల క్రిత‌మే వ‌చ్చింద‌న్న విష‌యం మీకు తెలుసా.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 08 2026, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
AI సమ్మిట్‌తో పెరిగిన చర్చ
Image Credit : Gemini AI

AI సమ్మిట్‌తో పెరిగిన చర్చ

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ నిపుణులు పాల్గొన్నారు. AI వేగంగా ఎలా మారుతోంది, ప్రభుత్వాలు ఎలా స్పందించాలి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుంది, నైతిక సమస్యలు ఏమిటి అనే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

25
AI అనే పదం మొదట ఎప్పుడు వచ్చింది?
Image Credit : Asianet News

AI అనే పదం మొదట ఎప్పుడు వచ్చింది?

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొదట 1956లో ఉపయోగించారు. ఈ పేరును అమెరికాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జాన్ మాక్‌కాథీ సూచించారు. అమెరికాలో జరిగిన ఒక పరిశోధనా సమావేశం కోసం తయారుచేసిన ప్రతిపాదన పత్రంలో మొదటిసారిగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అనే పదం వాడారు. ఈ సమావేశం తర్వాత AI అనే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు
Related image2
Andhra pradesh: పెళ్లి పీట‌ల‌పై కాబోయేవాడు, ముందు ప్రేమించిన వాడు.. సినిమాని మించిన ట్విస్ట్
35
ఈ పేరే ఎందుకు పెట్టారు?
Image Credit : Getty

ఈ పేరే ఎందుకు పెట్టారు?

శాస్త్రవేత్తల ఆలోచన ప్రకారం యంత్రాలు కూడా మనుషుల మాదిరిగా నేర్చుకోవడం, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమైతే అది “కృత్రిమ మేథ‌స్సు” అవుతుంది. అందుకే Artificial అంటే కృత్రిమ, Intelligence అంటే మేథస్సు అనే రెండు పదాలను కలిపి Artificial Intelligence అనే పేరు పెట్టారు. ఆ కాలంలో కంప్యూటర్లు ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో యంత్రాలు చెస్ ఆడగలవు, భాష అర్థం చేసుకోగలవు, నిర్ణయాలు తీసుకోగలవు అని శాస్త్రవేత్తలు భావించారు.

45
AI పరిశోధనకు పునాది ఎలా పడింది?
Image Credit : Getty

AI పరిశోధనకు పునాది ఎలా పడింది?

1956లో జరిగిన సమావేశంలో ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వీరిలో మార్విన్ మిస్కీ, క్లాడ్ షామ‌న్‌, అల్లెన్ న్యూవెల్ వంటి వారు ఉన్నారు. ఈ పరిశోధకులే AI పరిశోధనకు పునాది వేశారు. అప్పట్లో ఇది చిన్న ప్రయోగంలా కనిపించినా తరువాత ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీగా మారింది.

55
నేటి ప్రపంచంలో AI ప్రాధాన్యం
Image Credit : Getty

నేటి ప్రపంచంలో AI ప్రాధాన్యం

1956 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన క్రమంగా పెరిగింది. కంప్యూటర్ల శక్తి పెరగడంతో 1980 తర్వాత AI అభివృద్ధి వేగంగా జరిగింది. ఇప్పుడు AI ఆరోగ్య రంగంలో వ్యాధులు గుర్తించడం నుంచి బ్యాంకుల్లో మోసాలు గుర్తించడం వరకు ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వాయిస్ అసిస్టెంట్లు, చాట్‌బాట్లు, సెల్ఫ్ కంట్రోల్‌ కార్లు వంటి అనేక రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ఈ టెక్నాల‌జీ ఇప్పుడు ప్రపంచాన్ని మార్చుతున్న అత్యంత కీలక సాంకేతికతగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Phone Charging Problem: మీ ఫోన్ త్వరగా పాడైపోవడానికి కారణమిదే
Recommended image2
CCTV: ప్రపంచంలో మొట్ట‌ మొదటి CCTV కెమెరాను ఎందుకు తయారు చేశారో తెలుసా.?
Recommended image3
Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్... ఎలా అమలుచేస్తారో తెలుసా..?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు
Recommended image2
Andhra pradesh: పెళ్లి పీట‌ల‌పై కాబోయేవాడు, ముందు ప్రేమించిన వాడు.. సినిమాని మించిన ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved