MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • ChatGPT: చాట్‌జీపీటీని 5 ప్రశ్నలు అడుగుతున్నారా? మీ లైఫ్ రిస్క్‌లో ఉన్నట్టే !

ChatGPT: చాట్‌జీపీటీని 5 ప్రశ్నలు అడుగుతున్నారా? మీ లైఫ్ రిస్క్‌లో ఉన్నట్టే !

ChatGPT : ప్రస్తుతం ప్రతిదానికి ఏఐ పై ఆధారపడటం క్రమంగా పెరుగుతోంది. అయితే, చాట్‌జీపీటీని ఈ వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతున్నారా? జాగ్రత్త! ఏఐ ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని ఇబ్బందుల్లో నెట్టేయవచ్చు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 07 2026, 10:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చాట్‌జీపీటీ ని ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? నిపుణుల సీరియస్ వార్నింగ్
Image Credit : website

చాట్‌జీపీటీ ని ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? నిపుణుల సీరియస్ వార్నింగ్

ప్రస్తుతం ఏఐ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ పని దగ్గరి నుండి, పర్సనల్ డౌట్స్ వరకు అందరం చాట్‌జీపీటీ లేదా గూగుల్ జెమినీ వంటి ఏఐ టూల్స్ పై ఆధారపడుతున్నాం. అయితే, మనకు తెలియకుండానే ఏఐని కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగి రిస్క్‌లో పడుతున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మీ కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాల్లో ఏఐని గుడ్డిగా నమ్మకూడదు.

కార్నెల్ యూనివర్శిటీ నిర్వహించిన ఎలిఫెంట్ అనే స్టడీ ప్రకారం.. చాట్‌బాట్‌లు మనుషుల కంటే ఎక్కువగా మనం చెప్పేదానికి అవును అని వంత పాడుతాయి. మనుషులు కేవలం 22 శాతం సందర్భాల్లోనే ఎదుటివారి అభిప్రాయాలను సమర్థిస్తే, ఏఐ మాత్రం 72 శాతం సార్లు మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటుంది. దీనివల్ల మీలో ఉన్న తప్పుడు ఆలోచనలు మరింత బలపడే ప్రమాదం ఉంది. మరి చాట్‌జీపీటీని ఏయే విషయాల్లో అడగకూడదో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. మీ వ్యక్తిత్వం గురించి ఏఐని అడగొద్దు
Image Credit : Chatgpt\Twitter

1. మీ వ్యక్తిత్వం గురించి ఏఐని అడగొద్దు

చాలామంది నేను చెడ్డవాడినా?, నేనంటే అందరికీ ఎందుకు ఇష్టం ఉండదు?, నా జీవితంతో నేను ఏం చేయాలి? వంటి ప్రశ్నలను చాట్‌జీపీటీని అడుగుతుంటారు. ఏఐకి భావోద్వేగాలు ఉండవు. అది కేవలం డేటా ఆధారంగా సమాధానం ఇస్తుంది. నేను ఇతరుల కంటే తెలివైనవాడినా?, నా ఆలోచనలు సరైనవేనా? అని అడిగినప్పుడు ఏఐ మిమ్మల్ని మెప్పించేలా సమాధానం ఇస్తుంది. దీనివల్ల మీరు ఒక భ్రమలో బతికే ప్రమాదం ఉంది. నిజ జీవితంలో మీ రిలేషన్ షిప్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది.

36
2. ఆరోగ్య సమస్యలపై చాట్‌బాట్ సలహాలు వద్దు
Image Credit : Getty

2. ఆరోగ్య సమస్యలపై చాట్‌బాట్ సలహాలు వద్దు

నాకు డిప్రెషన్ తగ్గే మార్గం చెప్పండి, నాకు గుండెనొప్పి వస్తోంది, ఇదేం జబ్బు? అని ఏఐని అడగడం చాలా ప్రమాదం. ఏఐ డాక్టర్ కాదు. నాకు క్యాన్సర్ ఉందా?, ఈ లక్షణాలు ఏ వ్యాధికి సంబంధించినవి? అని సెర్చ్ చేస్తే అది ఇంటర్నెట్‌లోని సమాచారాన్ని మిక్స్ చేసి ఏదో ఒకటి చెప్తుంది. అది చూసి మీరు భయాందోళనలకు గురయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ మందు వాడొచ్చా? అని ఏఐని అడిగి మందులు వేసుకోవడం ప్రాణాంతకం కావచ్చు. ఆరోగ్యం విషయంలో డాక్టర్‌ని కలవడమే కరెక్ట్.

46
3. కెరీర్, వ్యాపార నిర్ణయాలు
Image Credit : Getty

3. కెరీర్, వ్యాపార నిర్ణయాలు

నాకు బెస్ట్ కెరీర్ ఏది?, నేను విదేశాలకు వెళ్లాలా?, నాకు ఒక మంచి బిజినెస్ ఐడియా ఇవ్వు అని ఏఐని అడగడం కామన్ అయిపోయింది. కానీ ఏఐకి మీ వ్యక్తిగత సామర్థ్యం, మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ తెలియదు. అది ఇచ్చే జనరల్ సలహాలను పాటించి లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది. మీ కెరీర్ నిర్ణయాలు మీ నైపుణ్యాల మీద ఆధారపడి ఉండాలి కానీ ఒక బాట్ ఇచ్చే సలహా మీద కాదు.

56
4. ఆర్థిక, కోర్టు కేసులు
Image Credit : Gemini

4. ఆర్థిక, కోర్టు కేసులు

నా సేవింగ్స్ మొత్తం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?, టాక్స్ కట్టకుండా లీగల్ గా ఎలా తప్పించుకోవాలి? వంటి ప్రశ్నలు ఏఐని అడగకండి. ఆర్థిక విషయాలు చాలా సున్నితమైనవి. ఏఐ ఇచ్చే టిప్స్ ఎప్పుడూ 100% సేఫ్ కావు. అలాగే కోర్టు కేసుల గురించి, నేను ఈ కేసు గెలుస్తానా? అని అడగడం వల్ల ఉపయోగం లేదు. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి, ఏఐ పాత డేటాతో సమాధానం ఇవ్వవచ్చు.

66
5. జనరల్ నాలెడ్జ్, వైరల్ క్లెయిమ్స్
Image Credit : stockPhoto

5. జనరల్ నాలెడ్జ్, వైరల్ క్లెయిమ్స్

ఏదైనా అరుదైన వ్యాధి గురించి గానీ, కష్టమైన రీసెర్చ్ పేపర్ల గురించి గానీ ఏఐని అడిగినప్పుడు అది ఒక్కోసారి తప్పుడు సమాచారాన్ని నిజంలా చెప్తుంది. లేటెస్ట్ సీక్రెట్ టెక్నాలజీ ఏంటి?, సోషల్ మీడియాలో వచ్చే ఈ వార్త నిజమేనా? అని అడిగితే అది తప్పుగా గైడ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఏఐ ఇచ్చే ప్రతి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఏఐ అనేది మనకు సహాయం చేయడానికి మాత్రమే, మన జీవిత నిర్ణయాలను తీసుకోవడానికి కాదు. దానికి పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. అతిగా ఏఐపై ఆధారపడటం వల్ల మన స్వంతంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
కృత్రిమ మేధస్సు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్: ఈ 7 తప్పులు చేస్తే మీ అకౌంట్ క్లోజ్!
Recommended image2
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Related Stories
Recommended image1
World Longest Train : బాబోయ్.. 7 కిలోమీటర్ల పొడవున్న రైలా? ఒకసారి చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Recommended image2
Blue Moon : ఆకాశంలో అద్భుతం బ్లూ మూన్.. నిజంగానే చందమామ నీలం రంగులోకి మారుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved