MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్.. మీ చాటింగ్ సీక్రెట్స్ ఓపెన్ ! అసలు ఏం జరుగుతోంది?

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్.. మీ చాటింగ్ సీక్రెట్స్ ఓపెన్ ! అసలు ఏం జరుగుతోంది?

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై మీ సీక్రెట్ చాట్స్ సేఫ్ కాదు. మే 8 నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మెటా తొలగించింది. మీ ఇన్‌స్టా మెసేజ్‌లు వేరే వాళ్లు కూడా చూస్తారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 08 2026, 09:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై ప్రైవేట్ మాటలు బంద్.. అసలు కారణం ఇదే!
Image Credit : Gemini

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై ప్రైవేట్ మాటలు బంద్.. అసలు కారణం ఇదే!

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫ్రెండ్స్‌తో లేదా స్పెషల్ పర్సన్స్‌తో సీక్రెట్‌గా చాట్ చేస్తున్నారా? పర్సనల్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారా? అయితే ఈ రోజే ఆ పని ఆపేయండి! ఎందుకంటే, ఇప్పటివరకు మీ చాటింగ్‌కు శ్రీరామరక్షలా ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీని మెటా సంస్థ అధికారికంగా తీసేసింది.

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం నుంచి మీ డిజిటల్ ప్రైవసీకి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీని ఉండదు. గతంలో మీ మెసేజ్‌లు కేవలం మీకు, మీరు పంపిన వ్యక్తికి మాత్రమే కనిపించేవి. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండదు. ఇతరులు కూడా చూసే అవకాశముంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భద్రతా కవచం మాయం: ఏంటి ఈ మార్పు?
Image Credit : Getty

భద్రతా కవచం మాయం: ఏంటి ఈ మార్పు?

మెటా సంస్థ అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ లలో ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను నిలిపివేసింది. 2023లో ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్, యూజర్ల మెసేజ్‌లను కంపెనీ కూడా చూడలేనంత పటిష్ఠంగా ఉంచేది. కానీ తాజా పాలసీ మార్పుల వల్ల ఆ సెక్యూరిటీ ఫీచర్ పోయింది. దీని అర్థం ఏంటంటే, మీ ప్రైవేట్ చాట్స్ ఇకపై మునుపటిలా 100% ప్రైవేట్ కాదు.

Related Articles

Related image1
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Related image2
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
35
మెటా ముందే హెచ్చరించింది
Image Credit : Getty

మెటా ముందే హెచ్చరించింది

ఈ సంచలన నిర్ణయం గురించి మెటా ఒక్కసారిగా బాంబు పేల్చలేదు. ఈ ఏడాది మార్చిలోనే దీనిపై యూజర్లను హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ మీడియా లేదా ముఖ్యమైన మెసేజ్‌లు ఉన్నవారు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని, బ్యాకప్ తీసుకోవాలని సూచించింది. 

ఎన్‌క్రిప్షన్ తొలగించిన తర్వాత ఆ మెసేజ్‌లను యాక్సెస్ చేయడం సులభతరం అవుతుంది, ఇది ప్రైవసీ పరంగా ఆందోళన కలిగించే విషయమే. అయితే, ప్రస్తుతానికి ఈ మార్పు కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే పరిమితం చేశారు. వాట్సాప్ లేదా మెసెంజర్ వంటి ఇతర మెటా యాప్స్‌లో ఈ మార్పు ఇంకా రాలేదు.

45
ఈ కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?
Image Credit : Asianet News

ఈ కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?

మెటా ఇంతటి రిస్క్ ఉన్న నిర్ణయం ఎందుకు తీసుకుందనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి ప్రధాన కారణం చైల్డ్ సేఫ్టీ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

1. భారీ జరిమానా: 2026 మార్చిలో న్యూ మెక్సికో జ్యూరీ మెటాపై 375 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. యూజర్ల భద్రత విషయంలో కంపెనీ తప్పుదోవ పట్టించిందని, దీనివల్ల ప్లాట్‌ఫామ్‌పై చిన్నారులపై వేధింపులు పెరిగాయని ఆరోపణలు వచ్చాయి.

2. నేరాల నియంత్రణ: ఎన్‌క్రిప్షన్ తొలగించడం వల్ల మెటా అవసరమైనప్పుడు మెసేజ్‌లను స్కాన్ చేయగలుగుతుంది. దీనివల్ల చైల్డ్ అబ్యూస్ మెటీరియల్, ఆన్‌లైన్ గ్రూమింగ్ వంటి నేరాలను అరికట్టవచ్చని కంపెనీ భావిస్తోంది.

55
అంతర్జాతీయ ఒత్తిడి కూడా ఒక కారణమేనా?
Image Credit : Gemini

అంతర్జాతీయ ఒత్తిడి కూడా ఒక కారణమేనా?

కేవలం జరిమానాలు మాత్రమే కాదు, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల ప్రభుత్వాలు కూడా టెక్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. బ్రిటన్ ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ 2023, ఈయూ 'చాట్ కంట్రోల్ రెగ్యులేషన్' వంటి చట్టాలు హానికరమైన కంటెంట్‌ను గుర్తించాలని కంపెనీలను ఆదేశిస్తున్నాయి. నేరాలను అరికట్టే దిశగా మెటా ఈ అడుగు వేసినప్పటికీ, సామాన్య యూజర్లు మాత్రం తమ ప్రైవసీ గురించి తెగ టెన్షన్ పడిపోతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Recommended image2
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved