MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Who is Divya Deshmukh: చెస్ వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత మహిళ.. ఎవ‌రీ దివ్య దేశ్‌ముఖ్?

Who is Divya Deshmukh: చెస్ వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత మహిళ.. ఎవ‌రీ దివ్య దేశ్‌ముఖ్?

Who is Divya Deshmukh: దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 గెలిచి భారతదేశపు తొలి మహిళా విజేతగా నిలిచారు. అలాగే, నాల్గవ భార‌త‌ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా ఘ‌న‌త సాధించారు.

3 Min read
Mahesh Rajamoni
Published : Jul 28 2025, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్
Image Credit : FIDE Chess

చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

జార్జియాలోని బటుమిలో జరిగిన ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో గెలిచి దివ్య దేశ్‌ముఖ్ చ‌రిత్ర సృష్టించారు. 38 ఏళ్ల కోనేరు హంపీని ఓడించిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ ఛాంపియ‌న్ గా నిలిచారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ ఘనతను సాధించారు. ఫిడే మహిళల వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత మహిళగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు.

ఫైనల్ క్లాసికల్ గేమ్స్ రెండు డ్రాగా ముగియగా, విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ రాపిడ్ మ్యాచ్‌లు నిర్వహించారు. మొదటి రాపిడ్ గేమ్ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో దివ్య నల్ల ముక్కలతో ఆడి గెలిచారు. దాంతో 2.5-1.5 స్కోరుతో వరల్డ్ కప్‌ను అందుకున్నారు.

𝐃𝐢𝐯𝐲𝐚 𝐃𝐞𝐬𝐡𝐦𝐮𝐤𝐡 𝐝𝐞𝐟𝐞𝐚𝐭𝐬 𝐇𝐮𝐦𝐩𝐲 𝐊𝐨𝐧𝐞𝐫𝐮 𝐭𝐨 𝐰𝐢𝐧 𝐭𝐡𝐞 𝟐𝟎𝟐𝟓 𝐅𝐈𝐃𝐄 𝐖𝐨𝐦𝐞𝐧'𝐬 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 🏆.#FIDEWorldCup | #DivyaDeshmukh | #HumpyKonerupic.twitter.com/CubWCPTlLX

— All India Radio News (@airnewsalerts) July 28, 2025

25
గ్రాండ్ మాస్టర్‌గా దివ్య దేశ్‌ముఖ్ కొత్త చరిత్ర
Image Credit : X

గ్రాండ్ మాస్టర్‌గా దివ్య దేశ్‌ముఖ్ కొత్త చరిత్ర

ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్ భారతదేశానికి నాల్గవ మహిళా గ్రాండ్ మాస్టర్ గా మారారు. ఇప్పటి వరకు ఈ హోదా పొందిన వారిలో కోనేరు హంపీ, ద్రోణవల్లి హరికా, ఆర్ వైశాలిలు ఉన్నారు. టోర్నమెంట్ మొదలయ్యే సమయానికి దివ్యకు మూడు జీఎం నార్మ్‌లు ఏవీ లేవు, కానీ ఈ ఒక్క టోర్నీలోనే ఆమె టైటిల్‌కు అర్హత సాధించడం విశేషం.

గెలుపు త‌ర్వాత దివ్య దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. “ఈ విధంగా గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. పోటీ ప్రారంభానికి ముందు ఒక్క నార్మ్ కూడా నాకు లేదు. ఒక్క నార్మ్ అయినా వస్తుందేమో అనుకున్నాను. కానీ చివరికి గ్రాండ్ మాస్టర్ అయ్యాను” అని సంతోషం వ్య‌క్తం చేశారు.

Divya Deshmukh beats Koneru Humpy in tiebreaks to become the FIDE Women's World Cup Champion 2025 - and become India's 88th Grandmaster!

In the all-Indian Finals which went to tiebreaks, Divya defeated Humpy 1.5-0.5. The first Rapid game ended in a draw, and the next one Divya… pic.twitter.com/p5FP5BNzhd

— ChessBase India (@ChessbaseIndia) July 28, 2025

Related Articles

Related image1
Koneru Humpy: ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025.. కోనేరు హంపీ ఎందుకు ఓడిపోయారు?
Related image2
Divya Deshmukh: ఫిడే మహిళల ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్
35
ఎవ‌రీ దివ్య దేశ్‌ముఖ్?
Image Credit : X

ఎవ‌రీ దివ్య దేశ్‌ముఖ్?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్.. డాక్టర్లైన జితేంద్ర, నమ్రత దంపతుల కుమార్తె. ఆమె చిన్ననాటి నుంచే చెస్ పట్ల ఆసక్తి కనబరిచారు. 5 ఏళ్ల వయసులో చెస్ ఆడటం ప్రారంభించిన దివ్య దేశ్‌ముఖ్.. చెన్నైకి చెందిన గ్రాండ్ మాస్టర్ ఆర్‌బీ రమేశ్ వద్ద శిక్షణ పొందారు.

దివ్య దేశ్‌ముఖ్ 7 ఏళ్లకే అండర్-7 నేషనల్ టైటిల్, అండర్-10 (డర్బన్, 2014) టైటిల్, అండర్-12 (బ్రెజిల్, 2017) వరల్డ్ యూత్ టైటిల్స్‌ను గెలిచారు. 2021లో WGM, 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) హోదాలు పొందారు. 2024లో అండర్-20 వరల్డ్ జూనియర్ ఛాంపియన్ గా దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు.

45
ఒలింపియాడ్ గోల్డ్ మెడల్ గెలిచిన దివ్య దేశ్‌ముఖ్
Image Credit : X

ఒలింపియాడ్ గోల్డ్ మెడల్ గెలిచిన దివ్య దేశ్‌ముఖ్

2024లో బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దానిలో దివ్య దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఆమె మూడుసార్లు ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడ‌ల్, అనేక ఆసియా, వరల్డ్ యువతి టైటిల్స్ గెలుచుకున్నారు.

Divya’s hug to her mom says everything ❤️#FIDEWorldCup@DivyaDeshmukh05pic.twitter.com/jeOa6CjNc1

— International Chess Federation (@FIDE_chess) July 28, 2025

55
దివ్య దేశ్‌ముఖ్ కెరీర్‌కు గొప్ప‌ ప్రారంభం
Image Credit : @airnewsalerts/X

దివ్య దేశ్‌ముఖ్ కెరీర్‌కు గొప్ప‌ ప్రారంభం

దివ్య దేశ్‌ముఖ్ విజయంతో భారత మహిళా చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టైటిల్‌ను గెలిచి, గ్రాండ్ మాస్టర్‌గా అవతరించిన ఈ 19 ఏళ్ల యువతి, భారత్‌కు గర్వకారణం. ఇదొక ముగింపు కాదు, ఆమె గొప్ప కెరీర్‌కు ప్రారంభం మాత్రమే

మహిళల చెస్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దివ్య దేశ్‌ముఖ్ కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గుర‌య్యారు. తల్లిని కౌగిలించుకుని ఎమోష‌న‌ల్ అయిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

🏆🇮🇳👏 Divya Deshmukh becomes third FIDE Women’s World Cup winner, defeats Humpy Koneru in tiebreak

Divya Deshmukh, the 19-year-old International Master from Nagpur, Maharashtra, etched her name into chess history by defeating Grandmaster Humpy Koneru 1.5–0.5 in the tiebreaks to… pic.twitter.com/NkwmmTmCGi

— International Chess Federation (@FIDE_chess) July 28, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
క్రికెట్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved