MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Divya Deshmukh: ఫిడే మహిళల ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

Divya Deshmukh: ఫిడే మహిళల ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

Divya Deshmukh: భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచకప్ 2025 టైటిల్ గెలిచింది. ఫైన‌ల్ పోరులో కోనేరు హంపీని ఓడించి తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 28 2025, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ విజేత‌గా భార‌త గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్
Image Credit : FIDE Chess

ప్రపంచ విజేత‌గా భార‌త గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025 విజేతగా భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు. ఆమె గెలుపు భార‌త దేశానికి గర్వకారణంగా మారింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ అనుభవజ్ఞురాలైన భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీని రాపిడ్ టైబ్రేక్‌లో ఓడించింది. ఈ గెలుపుతో దివ్య ఫిడే ప్రపంచకప్‌ను గెలిచిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు సాధించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అద్భుత టైబ్రేక్ తో దివ్య దేశ్‌ముఖ్ విజయం
Image Credit : FIDE Chess

అద్భుత టైబ్రేక్ తో దివ్య దేశ్‌ముఖ్ విజయం

మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియగా, ఫైనల్ విజేతను నిర్ణయించేందుకు రాపిడ్ టైబ్రేక్ నిర్వహించారు. రెండు రాపిడ్ గేమ్స్ 10 నిమిషాల సమయంతో ప్రతి కదలికపై 10 సెకన్ల ఇన్‌క్రిమెంట్‌తో జరిగాయి. మొదటి గేమ్ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో హంపీ చేసిన పొరపాటును దివ్య చాకచక్యంగా ఉపయోగించుకొని విజయం సాధించింది. చివరికి 75వ ఎత్తులో హంపీ త‌గ్గాల్సి వ‌చ్చింది.

35
చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్
Image Credit : X

చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్

ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్ కేవలం 19 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాను సొంతం చేసుకుంది. భారత్ నుండి ఇది సాధించిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్రలో నిలిచింది. అంతేకాదు, మహిళల ఫిడే చెస్ ప్రపంచకప్ గెలిచిన తొలి భారతీయురాలిగా దివ్య అరుదైన ఘనత అందుకుంది.

45
ఫిడే ఫైనల్ లో ఇద్దరు భారతీయులే !
Image Credit : X/ChessbaseIndia

ఫిడే ఫైనల్ లో ఇద్దరు భారతీయులే !

ఈ ఫైనల్ మ్యాచ్ మ‌రింత విశేషం అని చెప్పాలి. ఫైన‌ల్ లో త‌ల‌ప‌డింది ఇద్ద‌రు భార‌తీయులే. ఫిడే మహిళల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఇద్దరు భారతీయ మహిళా క్రీడాకారిణులు తలపడటం ఇదే మొద‌టిసారి. ఇది భారత చెస్ లోతైన అభివృద్ధికి ప్రతిబింబం. దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు ముందు సెమీఫైనల్‌లో చైనా మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగీని ఓడించింది.

55
దివ్య దేశ్‌ముఖ్ కు ఎంత ప్రైజ్ మ‌నీ ద‌క్కుతుంది?
Image Credit : @airnewsalerts/X

దివ్య దేశ్‌ముఖ్ కు ఎంత ప్రైజ్ మ‌నీ ద‌క్కుతుంది?

ఫిడే టైటిల్‌తో పాటు దివ్య $50,000 (రూ. 41 లక్షలు) ప్రైజ్ మనీ కూడా గెలుచుకుంది. ఇప్పటికే 2020లో ఫిడే ఆన్‌లైన్ ఒలింపియాడ్‌లో దేశానికి గోల్డ్ మెడల్ అందించడంలో కీలకంగా వ్యవహరించిన దివ్య, 2021లో భారతదేశపు 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందింది. తాజా విజయం ఆమె కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. దివ్య దేశ్‌ముఖ్ అంకితభావం, నైపుణ్యం, ప్రామాణిక ఆటతీరు భారత యువతకు ఎంతో ప్రేరణగా నిలిచాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IND vs ENG: జడేజా-వాషింగ్టన్ దెబ్బకు బెన్ స్టోక్స్ షాక్.. డ్రా హైడ్రామా ! వీడియో వైర‌ల్
Recommended image2
India vs England: చివరి టెస్టులో ఇంగ్లాండ్ పై గెలుస్తుందా? ఓవల్‌లో భారత్‌ గెలుపు అవకాశాలెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved