MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఇకనైనా కళ్లు తెరవండి.! టీమిండియాకి పట్టిన శని వదలకపోతే.. ఇక అస్సామే

ఇకనైనా కళ్లు తెరవండి.! టీమిండియాకి పట్టిన శని వదలకపోతే.. ఇక అస్సామే

Suryakumar Yadav: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 ఓటమికి తానే పూర్తి బాధ్యుడినని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, పిచ్‌ను అర్థం చేసుకోలేకపోవడం, బ్యాటింగ్‌లో వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణాలన్నాడు.

1 Min read
Author : Pavithra D
Published : Dec 12 2025, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత్ ఓటమి..
Image Credit : Twitter

భారత్ ఓటమి..

దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 51 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంలో, బ్యాటింగ్‌లో తమ బ్యాట్స్‌మెన్‌లు వైఫల్యం చెందడమే ఓటమిని శాసించాయని పేర్కొన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిచ్ కండిషన్ అర్ధం చేసుకోలేకపోయాం..
Image Credit : Twitter

పిచ్ కండిషన్ అర్ధం చేసుకోలేకపోయాం..

పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని సూర్యకుమార్ అంగీకరించాడు. తాము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని, అయితే అప్పుడు వికెట్ ఎలా స్పందిస్తుందనే విషయంపై పూర్తి అవగాహన లేదని చెప్పాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన లెంగ్త్‌లను చూసిన తర్వాతే పిచ్ పరిస్థితి ఏంటో అర్థమైందని తెలిపాడు.

35
గిల్ నిలబడాల్సి ఉంది..
Image Credit : Twitter

గిల్ నిలబడాల్సి ఉంది..

తనతో పాటు గిల్ లాంటి కీలక బ్యాటర్లు బాధ్యత తీసుకొని నిలబడాల్సిన అవసరం ఉందని సూర్యకుమార్ పేర్కొన్నాడు. అభిషేక్ శర్మపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని, అతడికి కూడా ఆఫ్-డే ఉండవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మొదటి బంతికే ఔట్ అయినప్పుడు తాను బాధ్యత తీసుకోవాల్సిందని, క్రీజులో నిలబడితే మ్యాచ్‌ను గెలిపించగలిగేవాడినని, కానీ అలా జరగలేదని అన్నాడు.

45
అక్షర్‌ను అందుకే పంపాం
Image Credit : Twitter

అక్షర్‌ను అందుకే పంపాం

గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బాగా ఆడాడని, టెస్టుల్లో కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడని గుర్తు చేస్తూ, అదే నమ్మకంతో ఈ మ్యాచ్‌లోనూ అతడిని బ్యాటింగ్‌లో ముందుకు పంపామని తెలిపాడు. దురదృష్టవశాత్తూ అది వర్కౌట్ కాలేదని అన్నాడు.

55
వచ్చే మ్యాచ్‌లో పుంజుకుంటాం..
Image Credit : X/BCCI

వచ్చే మ్యాచ్‌లో పుంజుకుంటాం..

అయితే అక్షర్ బాగానే ఆడాడని సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ తమకు ఓ మంచి గుణపాఠమని, వచ్చే మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడతామని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
రో-కో జోలికొస్తే కెరీర్‌లు కూడా ఉండవ్.. గంభీర్, అగార్కర్‌లకు గట్టి అల్టిమేటం
Recommended image2
గంభీర్ ఒక్కడే కాదు.. టీమ్ అందరిదీ తప్పే.! టీమిండియాను ఏకీపారేశాడుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved