MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్.. 466 పరుగులతో రికార్డుల మోత.. ఆపేది ఎవడ్రా !

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్.. 466 పరుగులతో రికార్డుల మోత.. ఆపేది ఎవడ్రా !

Vaibhav Suryavanshi : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపే బ్యాటింగ్ తో సంచలనం రేపాడు. ఇప్పటికే 466 పరుగులు చేశాడు. ఇందులో 44 సిక్సర్లు బాదాడు. ఒక రికార్డు సెంచరీ కొట్టాడు. ఇప్పుడు సెమీఫైనల్లో మరో సునామీ రేపుతానంటున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 21 2025, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత.. భారత యంగ్ స్టార్ తుఫాను
Image Credit : X/BCCI

వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత.. భారత యంగ్ స్టార్ తుఫాను

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో టీమిండియా యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదిక పై వరుస రికార్డులు బద్దలు కొడుతున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్‌ స్టార్ గా ముందుకు సాగుతున్నాడు.

ఈ టోర్నమెంట్ లో వైభవ్ ఇప్పటివరకు ఆడిన 11 టీ20ల్లోనే 466 పరుగులు సాధించాడు. కేవలం 211 బంతుల్లోనే 220.85 స్ట్రైక్ రేట్ తన ఆటను కొనసాగించాడు. ఏకంగా 44 సిక్సర్లు బాదాడు. అతని బ్యాటింగ్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లకు దిమ్మదిరిగిపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొలి మ్యాచ్ నుంచే దూకుడు.. కేవలం 32 బంతుల్లో సెంచరీ
Image Credit : X/BCCI

తొలి మ్యాచ్ నుంచే దూకుడు.. కేవలం 32 బంతుల్లో సెంచరీ

ఈ టోర్నమెంట్‌లో వైభవ్ తన పవర్ హిట్టింగ్ ను తొలి మ్యాచ్ నుంచే మొదలుపెట్టాడు. యూఏఈపై సునామీ నాక్ ఆడాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే క్రీజులోకి వచ్చిన అతను ప్రత్యర్థి బౌలర్లను ఊపిరాడనివ్వకుండా దాడి చేశాడు. కేవలం 32 బంతుల్లో సెంచరీ కొట్టాడు. మొత్తం 144 పరుగులు తన ఇన్నింగ్స్ ను 342 స్ట్రైక్ రేట్ తో కొనసాగించాడు. తన నాక్ లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు.

ఈ ఇన్నింగ్స్ టోర్నమెంట్‌కు కొత్త టోన్ సెట్ చేసిన వైభవ్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. అతని బ్యాటింగ్ స్టైల్, ఫుట్‌వర్క్, షాట్ సెలెక్షన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Related Articles

Related image1
2026 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
Related image2
హార్దిక్ పాండ్యా ఆగట్లేదు భయ్యా.. జిమ్ లో మహికా శర్మతో రొమాంటిక్ ఫోటోలు వైరల్!
35
పాకిస్తాన్, ఒమన్ మ్యాచ్‌ల్లో నిరాపర్చాడు.. కానీ
Image Credit : X/BCCI

పాకిస్తాన్, ఒమన్ మ్యాచ్‌ల్లో నిరాపర్చాడు.. కానీ

యూఏఈపై తుపాను సృష్టించిన తర్వాత పాకిస్తాన్‌పై 45 పరుగులు, ఒమన్‌పై కేవలం 12 పరుగులు మాత్రమే రావడంతో వైభవ్ కొంత ఒత్తిడిని అనుభవించాడు. కానీ, నాకౌట్ మ్యాచ్‌లలో మరోసారి సునామీ రేపుతానంటున్నాడు. బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తానంటున్నాడు. శుక్రవారం ఇండియా-ఏ vs బంగ్లాదేశ్-ఏ సెమీఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

45
89 మంది బ్యాట్స్‌మెన్‌లలో నంబర్ 1 వైభవ్
Image Credit : X/BCCI

89 మంది బ్యాట్స్‌మెన్‌లలో నంబర్ 1 వైభవ్

గ్రూప్ దశలో మొత్తం 89 మంది బ్యాటర్లు ఆడగా, మూడు ప్రధాన విభాగాల్లో వైభవ్ టాప్ స్థానంలో నిలిచాడు. వాటిలో అత్యధిక స్ట్రైక్ రేట్ – 242.16తో ఈ టోర్నమెంట్‌లో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 144 నమోదుచేశాడు. అలాగే, మూడు మ్యాచ్‌ల్లో అత్యధికంగా 18 సిక్సర్లు బాదాడు.

55
టీ20లో అతి చిన్న వయసులో రెండు సెంచరీలతో వైభవ్ వరల్డ్ రికార్డు
Image Credit : X/BCCI

టీ20లో అతి చిన్న వయసులో రెండు సెంచరీలతో వైభవ్ వరల్డ్ రికార్డు

టీ20 క్రికెట్ లో అతిచిన్న వయస్సులోనే సెంచరీలు బాదిన రికార్డు ఫ్రాన్స్ ఆటగాడు గుస్తావ్ మెక్‌కాన్ పేరుపై ఉంది. వైభవ్ కేవలం 14 ఏళ్లు 232 రోజుల్లో టీ20ల్లో రెండు శతకాలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 

బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ తన ఆటపై మాట్లాడుతూ.. “200 పరుగులు చేసినా నాన్న సంతోషపడరు… ఇంకో 10 చేయాల్సింది అంటారు. “అమ్మ మాత్రం వేరేలా ఉంటుంది. సెంచరీ చేసినా, డకౌట్ అయినా, ఆమె చిరునవ్వు ఒకటే. షాట్లు ప్రయోగించను. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాటినే ఆడతాను” అని చెప్పాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
2026 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
Recommended image2
హార్దిక్ పాండ్యా ఆగట్లేదు భయ్యా.. జిమ్ లో మహికా శర్మతో రొమాంటిక్ ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved