హార్దిక్ పాండ్యా ఆగట్లేదు భయ్యా.. జిమ్ లో మహికా శర్మతో రొమాంటిక్ ఫోటోలు వైరల్!
Hardik Pandya and Mahieka Sharma: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహీకా శర్మతో తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరి వ్యక్తిగత క్షణాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

హార్దిక్ పాండ్యా, మహీకా శర్మల రొమాంటిక్ క్షణాలు
మోడల్ మహీకా శర్మతో తన సంబంధాన్ని వెల్లడించిన తర్వాత, భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవిత వివరాలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫోటోలు, వీడియోలను పంచుకున్నాడు, వాటిలో కొన్నింటిలో అతని ప్రియురాలు మహీకా కూడా ఉంది.
హార్దిక్ పాండ్యా, మహీకా శర్మల ఫోటోలు వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో హార్దిక్, మహీకా శర్మలు సాంప్రదాయ దుస్తుల్లో కెమెరాకు పోజులిచ్చారు. హార్దిక్ తన ప్రియురాలి చెంపలపై ముద్దుపెడుతూ కూడా కనిపించాడు. ఈ క్లోజ్ మూమెంట్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
మరో వీడియోలో వారిద్దరూ మతపరమైన వేడుకలు చేస్తూ కనిపించారు, ఇది వారి దీపావళి వేడుకలకు సంబంధించినది కావచ్చు.
అద్దం సెల్ఫీలో హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ
వైరల్ ఫోటోలలో ఒకటి ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో హార్దిక్ పాండ్యా, మహీకా శర్మను తన చేతుల్లో ఎత్తుకొని ఉండగా, మహీకా మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. జిమ్ లో వీరిద్దరూ కలిసివున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.
ఎవరీ మహీకా శర్మ?
మహీకా శర్మ ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రముఖ బ్రాండ్లకు కమర్షియల్ క్యాంపైన్లలో కనిపించారు.
అలాగే మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తాహిలియాని వంటి భారతీయ ప్రముఖ డిజైనర్ల ర్యాంప్‌లపై నడిచారు. 2024లో ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో “మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్)” పురస్కారం అందుకున్నారు.
2024లో మహీకా శర్మ పెద్ద ఈవెంట్‌కి ముందు తీవ్రమైన కంటి వ్యాధితో బాధపడినప్పటికీ, ర్యాంప్ వాక్ రద్దు చేయకుండా ధైర్యంగా పాల్గొన్నారు. ఆమె ప్రొఫెషనల్ దృక్పథం అప్పట్లో చర్చనీయాంశమైంది.
నటాషా స్టాన్‌కోవిక్‌తో హార్దిక్ వివాహం, విడాకులు
హార్దిక్ పాండ్యా ఇదివరకు నటాషా స్టాన్కోవిక్‌ని వివాహం చేసుకున్నారు. వీరు మే 2020లో వివాహం చేసుకోగా, 2023 ఫిబ్రవరిలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో ఘనంగా మళ్లీ వివాహం జరుపుకున్నారు. అయితే, 2024 జూలైలో వీరు విడిపోతున్నట్టు ప్రకటించారు.
“నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత, మేము పరస్పర అంగీకారంతో విడిపోయాలని నిర్ణయించుకున్నాం. మా శ్రేయస్సు కోసం తీసుకున్న కఠిన నిర్ణయమిదే. మా కుమారుడు అగస్త్య మా జీవితాల్లో ప్రధానంగా ఉండనున్నాడు. అతడి సంతోషం కోసం కలిసి కో-పేరెంటింగ్ కొనసాగిస్తాం” అని ఇద్దరు తెలిపారు. అలాగే, “ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నామని” తెలిపారు.

