MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Tilak Varma : తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు ప్రమోషన్.. సంజూ, బుమ్రాలకు కూడా...

Tilak Varma : తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు ప్రమోషన్.. సంజూ, బుమ్రాలకు కూడా...

ఐసీసీ తాజాగా అన్ని ఇంటర్నేషనల్ టీమ్స్, ఆటగాళ్లకు ర్యాంకింగ్స్‌ ప్రకటించింది... ఇందులో కొన్ని కీలక మార్పులు జరిగాయి. టీమిండియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలకంగా వ్యవహించిన ముగ్గురు ఆటగాళ్లకు ప్రమోషన్ లభించింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 18 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తిలక్ వర్మకు ప్రమోషన్..
Image Credit : Tilak Varma\Twitter

తిలక్ వర్మకు ప్రమోషన్..

ICC Rankings : టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లకు ప్రమోషన్ లభించింది. వీరిలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా ఉన్నాడు. తాజా ఐసిసి ర్యాంకింగ్స్ లో తిలక్ 742 రేటింగ్ పాయింట్స్ తో ఓ ర్యాంకు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
సంజూకు సరైన గుర్తింపు..
Image Credit : Getty

సంజూకు సరైన గుర్తింపు..

టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ఆటతీరుతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన కేరళ కుర్రాడు సంజూ శాంసన్ కు కూడా ప్రమోషన్ లభించింది. ప్రపంచకప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా సంజూ శాంసన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సాధించాడు. వరల్డ్ కప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' గెలిచిన సంజూ ఐసిసి ర్యాంకింగ్స్ లో 637 రేటింగ పాయింట్స్ తో 22 ర్యాంకు నుండి 21వ ర్యాంకుకు చేరుకున్నాడు.

Related Articles

Related image1
ICC Rankings : హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా టీ20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అభిషేక్ దే
Related image2
ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!
38
టీ20 లో మన అభిషేకే తోపు..
Image Credit : Getty

టీ20 లో మన అభిషేకే తోపు..

టీమిండియా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 875 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే అతడి టాప్ ర్యాంకుకు మరో భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ గండి కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇషాన్ 871 పాయింట్లతో 2వ ర్యాంకు సాధించాడు... ఇది ఇతడి కెరీర్ లోనే బెస్ట్ ర్యాంక్. మరో నాలుగు రేటింగ్ పాయింట్లు సాధిస్తే అభిషేక్ నెంబర్ వన్ ర్యాంక్ షేక్ అయినట్లే.

48
బుమ్రాకు ప్రమోషన్..
Image Credit : X@bcci

బుమ్రాకు ప్రమోషన్..

టీ20 ర్యాంకింగ్స్ లో ప్రమోషన్ పొందిన మరో టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా. ఇతడు 702 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకుని 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆసక్తికర విషయం ఏంటంటే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరాడు.

58
టా20 టాప్ బౌలర్లు వీరే..
Image Credit : Getty

టా20 టాప్ బౌలర్లు వీరే..

టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ మూడు, ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగో ర్యాంకు సాంధించాడు. అయిటే టాప్ 5 టీ20 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లు కాగా బుమ్రా ఒక్కడే పాస్ట్ బౌలర్.

68
టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ హవా..
Image Credit : Getty

టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ హవా..

మొత్తంగా ఐసిసి టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో నలుగు టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 9వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. శివమ్ దూబే (27), హార్దిక్ పాండ్యా (48) ర్యాంకుల్లో ఎలాంటి మార్పు లేదు. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, బుమ్రా ఇద్దరే టాప్ 10 లో నిలిచారు... అర్షదీప్ సింగ్ 17, అక్షర్ పటేల్ 18 ర్యాంకులతో టాప్ 20 లో చోటు దక్కించుకున్నారు.

78
టాప్ 10 వన్డే బ్యాటర్లలో నలుగురు టీమిండియా ప్లేయర్లే
Image Credit : Getty

టాప్ 10 వన్డే బ్యాటర్లలో నలుగురు టీమిండియా ప్లేయర్లే

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ ఆఘా 9 స్థానాలు మెరుగుపరుచుకుని 10వ ర్యాంకుకు రావడం గమనార్హం. ఈ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 4, శుభ్ మన్ గిల్ 5, కెఎల్ రాహుల్ 9 స్థానంలో నిలిచారు.

88
టాప్ 10 వన్డే బౌలర్లలో టీమిండియా నుండి ఒక్కడే..
Image Credit : Getty

టాప్ 10 వన్డే బౌలర్లలో టీమిండియా నుండి ఒక్కడే..

వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 705 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు మెహిదీ హసన్ మిరాజ్ 9 స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలోనే ఉన్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
ICC Rankings : హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా టీ20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అభిషేక్ దే
Recommended image2
ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved