MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !

FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !

Top 10 Football Superstars: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫీవర్ మొదలైంది. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఊపేయడానికి సిద్ధమవుతున్న లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డో, ఎంబాప్పే సహా టాప్ 10 ఫుట్‌బాల్ స్టార్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

5 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2026, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ 10 మంది ఆడితే రికార్డులు బద్దలే.. ఫిఫా వరల్డ్ కప్ 2026 టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్ ఇదే
Image Credit : Getty

ఈ 10 మంది ఆడితే రికార్డులు బద్దలే.. ఫిఫా వరల్డ్ కప్ 2026 టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్ ఇదే

ఫుట్‌బాల్ అంటే కేవలం రెండు జట్ల మధ్య జరిగే ఆట మాత్రమే కాదు. ఇది అద్భుతమైన నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను తమ వైపు తిప్పుకునే ఒక బిగ్ ఫైట్. ఈ మ్యాజికల్ ప్లేయర్స్ ఆటను చూడటానికి జనాలు తమ పనులను, నిద్రను కూడా పక్కన పెట్టేస్తారు. త్వరలో జరగబోయే 2026 ఫిఫా వరల్డ్ కప్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ టోర్నీలో తమ ఆటతో మాయ చేయడమే కాకుండా, రాబోయే కాలంలో ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించబోయే యంగ్ సూపర్ స్టార్స్ ఎందరో ఉన్నారు. ఈ 2026 వరల్డ్ కప్‌పై కొండంత ఆశలు పెట్టుకున్న టాప్ 10 ఫుట్‌బాల్ ఆటగాళ్ల గురించిన పూర్తి వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)
Image Credit : our own

1. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)

గత 15 ఏళ్లుగా ఫుట్‌బాల్ ప్రపంచానికి కింగ్ గా కొనసాగుతున్నాడు లియోనెల్ మెస్సీ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్ల జాబితాలో ఆయన పేరు ఉంటుంది. ఈ తరం అభిమానులకు మెస్సీ ఒక అల్టిమేట్ సూపర్ స్టార్. అతని రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కెరీర్‌లో 900కు పైగా గోల్స్, 8 బ్యాలన్ డి ఓర్ అవార్డులు, 44 ప్రధాన ట్రోఫీలను మెస్సీ సాధించాడు. 2022లో అర్జెంటీనాను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చి తన కెరీర్ లోని అతిపెద్ద కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న మెస్సీకి ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు, అందుకే అతనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో 13 గోల్స్‌తో మెస్సీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

37
2. క్రిస్టియానో రోనాల్డో (పోర్చుగల్)
Image Credit : Asianet News

2. క్రిస్టియానో రోనాల్డో (పోర్చుగల్)

ఈ తరం అందించిన మరో లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రోనాల్డో. పోర్చుగల్‌లోని తన చిన్న గ్రామం నుండి ఇండియాలోని మురికివాడల వరకు కోట్ల మందిని ఫుట్‌బాల్ వైపు లాగిన అయస్కాంతం ఇతను. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధికంగా 970 కంటే ఎక్కువ గోల్స్ చేసిన రికార్డు రోనాల్డో పేరిట ఉంది. ప్రపంచంలోని దాదాపు అన్ని ట్రోఫీలను గెలుచుకున్న రోనాల్డోకు వరల్డ్ కప్ మాత్రం ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. అతని జట్టు పోర్చుగల్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. అందుకే ఈసారి రోనాల్డోపై అభిమానులు భారీగా హోప్స్ పెట్టుకున్నారు. మెస్సీ లాగే రోనాల్డోకు కూడా ఇదే చివరి వరల్డ్ కప్ కావడం దాదాపు ఖాయం.

47
3. కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)
Image Credit : Getty

3. కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)

ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడుతున్న సూపర్ స్టార్స్ అందరిలోనూ 27 ఏళ్ల కిలియన్ ఎంబాప్పే టాప్‌లో ఉన్నాడు. అద్భుతమైన వేగం, బంతిపై తిరుగులేని నియంత్రణ, గోల్ ఫినిషింగ్ స్కిల్స్ అతని ప్రధాన బలాలు. గత వరల్డ్ కప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి అర్జెంటీనాను వణికించిన ఎంబాప్పే, ఇప్పుడు తన రెండో వరల్డ్ కప్ ఆడటానికి రెడీ అవుతున్నాడు. రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతూ ఈ సీజన్ లా లీగాలో 25 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్ రేసులో ఎంబాప్పే అందరికంటే ముందున్నాడు.

4. లామిన్ యమాల్ (స్పెయిన్)

లామిన్ యమాల్ కేవలం 18 ఏళ్ల వయసున్న సూపర్ స్టార్. అతని అద్భుతమైన డ్రిబ్లింగ్ టాలెంట్ చూసి జనాలు అప్పుడే అతడిని 'నెక్స్ట్ మెస్సీ' అని పిలుస్తున్నారు. ఈ వరల్డ్ కప్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్లేయర్ ఇతనే. కేవలం 17 ఏళ్ల వయసులోనే ప్రతిష్ఠాత్మక బ్యాలన్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. దశాబ్దాలుగా బార్సిలోనా జట్టుకు మెస్సీ ఎలా గుండెకాయలా ఉండేవాడో, ఇప్పుడు యమాల్ ఆ జట్టుకు కొత్త ఆస్తిగా మారాడు. బార్సిలోనా తరఫున 2025-26 సీజన్‌లో 45 మ్యాచ్‌లు ఆడిన యమాల్, 24 గోల్స్ చేయడమే కాకుండా 18 అసిస్ట్‌లు అందించాడు. ఈ ఏడాది లా లీగా బెస్ట్ ప్లేయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

57
5. నైమార్ (బ్రెజిల్)
Image Credit : Getty

5. నైమార్ (బ్రెజిల్)

నైమార్ జూనియర్ ఈ తరం లోనే అత్యంత ప్రతిభావంతుడైన, అందరూ ఎక్కువగా మాట్లాడుకునే క్రేజీ ఫుట్‌బాలర్. మిలియన్ల కొద్దీ అభిమానులు అతనికి ఉన్నారు. మెస్సీ, రోనాల్డోలతో సమానంగా నైమార్ పేరు వినిపిస్తుంటుంది, కానీ గాయాలు అతడిని నిరంతరం వేధిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, బ్రెజిల్ తరఫున 79 గోల్స్‌తో ఆ దేశ ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా రికార్డు సృష్టించాడు. ఈసారి వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైనప్పటికీ, ఇంజూరీ ఇష్యూస్ వల్ల అతను ఆడతాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. ఒకవేళ నైమార్ బరిలోకి దిగితే మాత్రం బ్రెజిల్ జట్టుకు అది కొండంత బూస్టింగ్ అవుతుంది.

6. ఎర్లింగ్ హాలాండ్ (నార్వే)

నార్వే స్టార్ ఫుట్‌బాలర్ ఎర్లింగ్ హాలాండ్ ఆధునిక ఫుట్‌బాల్‌లోనే ఒక అసాధారణ స్ట్రైకర్‌గా గుర్తింపు పొందాడు. తన తెలివైన కదలికలతో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంలో అతనికి ప్రత్యేక టాలెంట్ ఉంది. మంచి హైట్, వేగం, బలం, ఫిజికల్ పవర్.. ఇలా ఒక పర్ఫెక్ట్ ఫుట్‌బాలర్‌కు కావలసినవన్నీ హాలాండ్‌లో ఉన్నాయి. ప్రీమియర్ లీగ్‌లో కేవలం 111 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ పూర్తి చేసి అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మాంచెస్టర్ సిటీ తరఫున 2025-26 సీజన్‌లో 27 గోల్స్, 8 అసిస్ట్‌లు చేశాడు. నార్వే దేశం తరఫున అత్యంత వేగంగా 50 అంతర్జాతీయ గోల్స్ చేసిన రికార్డు కూడా హాలాండ్ పేరిటే ఉంది.

67
7. హ్యారీ కేన్ (ఇంగ్లండ్)
Image Credit : Getty

7. హ్యారీ కేన్ (ఇంగ్లండ్)

ఇంగ్లండ్ అందించిన అత్యంత గొప్ప ఫుట్‌బాలర్లలో హ్యారీ కేన్ ఒకరు. ప్రస్తుతం 32 ఏళ్ల వయసున్న కేన్, ఇంగ్లండ్ తరఫున 79 గోల్స్ చేసి ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో 500 గోల్స్ చేసిన మొదటి ఇంగ్లీష్ ప్లేయర్ ఇతనే. టోటెన్‌హామ్ క్లబ్ తరఫున 280 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కేన్ కేవలం గోల్స్ చేయడమే కాదు, తోటి ఆటగాళ్లకు అద్భుతమైన పాస్‌లు ఇస్తూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టిస్తాడు. రెండు కాళ్లతోనూ, హెడ్‌తోనూ గోల్స్ చేయగలడమే అతని స్పెషాలిటీ. 2018 ఫిఫా వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్ గెలుచుకున్న హ్యారీ కేన్, ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

8. వినీషియస్ జూనియర్ (బ్రెజిల్)

ఫుట్‌బాల్ మైదానంలో అత్యంత వేగంగా, మెరుపులా కదిలే ఆటగాళ్లలో వినీషియస్ జూనియర్ ఒకరు. హై స్పీడ్, ఆటపై బలమైన ఇంపాక్ట్ చూపించడం ఇతని ట్రేడ్‌మార్క్. 25 ఏళ్ల వయసున్న వినీషియస్ ఈ ఏడాది బ్రెజిల్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. 2025-26 లా లీగా సీజన్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున 16 గోల్స్, 5 అసిస్ట్‌లు చేశాడు. రియల్ మాడ్రిడ్ జట్టు ఛాంపియన్స్ లీగ్, లా లీగా వంటి పెద్ద ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్ కప్‌లో రోడ్రిగో సిల్వా, ఎండ్రిక్‌లతో కలిసి బ్రెజిల్ అటాకింగ్‌ను ముందుండి నడిపిస్తాడని, కప్‌ను సొంతం చేసుకుంటాడని అభిమానులు నమ్ముతున్నారు.

77
9. జూడ్ బెలింగ్‌హామ్ (ఇంగ్లండ్)
Image Credit : Getty

9. జూడ్ బెలింగ్‌హామ్ (ఇంగ్లండ్)

ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండ్ ప్లేయర్లలో జూడ్ బెలింగ్‌హామ్ ఒకడు. 22 ఏళ్ల వయసున్న ఈ స్టార్ ప్లేయర్ మైదానంలో అన్ని విధాలా గేమ్ పై ప్రభావం చూపగలడు. అద్భుతమైన డ్రిబ్లింగ్, వేగవంతమైన రన్స్, కచ్చితమైన పాస్‌లు, క్విక్ టాకిల్స్, పవర్‌ఫుల్ షాట్స్ అతని బలాలు. 2024 బ్యాలన్ డి ఓర్ రేంకింగ్స్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మైదానంలో ఇతను చూపించే ఎనర్జీని అందుకోవడం ఎవరికైనా కష్టమే. రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్‌గా ఉన్న బెలింగ్‌హామ్, ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు కచ్చితంగా పెద్ద ట్రంప్ కార్డ్ కాబోతున్నాడు.

10. ఉస్మానే డెంబెలే (ఫ్రాన్స్)

మెస్సీ, రోనాల్డోల హవా నడుస్తున్న కాలంలో.. తనదైన అగ్రెసివ్ ఆటతీరుతో దూసుకొచ్చి 2025లో ప్రతిష్ఠాత్మక బ్యాలన్ డి ఓర్ (Ballon d'Or) అవార్డును గెలుచుకున్న అరుదైన ఆటగాడు ఉస్మానే డెంబెలే. మైదానంలో చిరుతపులిలా పరిగెత్తే డెంబెలే, ఎలాంటి అవకాశం లేని చోట కూడా బంతిని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్లగలడు. ఎంతటి గొప్ప డిఫెండర్లకైనా సవాల్ విసరగలడు. 2018లో వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో డెంబెలే సభ్యుడు. ఇప్పుడు 29 ఏళ్ల వయసున్న ఈ స్టార్, ఎంబాప్పేతో కలిసి మరోసారి వరల్డ్ కప్‌లో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో గోల్డెన్ బాల్ గెలిచే టాప్ కంటెండర్లలో డెంబెలే ఒకడిగా ఉన్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
FIFA ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Recommended image2
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved