MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • ICC Rankings : హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా టీ20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అభిషేక్ దే

ICC Rankings : హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా టీ20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అభిషేక్ దే

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో మార్పులు జరిగాయి. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ టాప్-5లోకి రాగా, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా టాప్-10లోకి తిరిగి వచ్చాడు. ఇక అభిషేక్ శర్మ టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 25 2026, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
టి20 ర్యాంకింగ్స్‌లో మార్పులు
Image Credit : ANI

టి20 ర్యాంకింగ్స్‌లో మార్పులు

టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠ మధ్య ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల స్థానాల్లో భారీ మార్పులు కనిపించాయి. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ టాప్-5లోకి దూసుకెళ్లగా, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా టాప్-10లోకి వచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
దూసుకొచ్చిన ఇషాన్ కిషన్
Image Credit : X@BCCI

దూసుకొచ్చిన ఇషాన్ కిషన్

ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని టీ20 లో ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ 176 పరుగులు చేశాడు.

310
తిలక్‌కు ర్యాంకింగ్స్‌లో నష్టం
Image Credit : Getty

తిలక్‌కు ర్యాంకింగ్స్‌లో నష్టం

ప్రపంచకప్‌లో నిరాశపరిచిన తిలక్ వర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి పడిపోయాడు. ఈ టోర్నీలో తిలక్ 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు. స్లో బ్యాటింగ్, ఇంటెంట్ లేకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలోనే ర్యాంకింగ్స్‌లోనూ దెబ్బతిన్నాడు.

410
నంబర్ వన్ స్థానం నిలబెట్టుకున్న అభిషేక్
Image Credit : Instagram/abhisheksharma_4

నంబర్ వన్ స్థానం నిలబెట్టుకున్న అభిషేక్

ప్రపంచకప్‌లో మూడుసార్లు డకౌట్ అయి నిరాశపరిచినా, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టోర్నీకి ముందు 929 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్, తాజా ర్యాంకింగ్స్‌లో 877 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

510
నంబర్ వన్ స్థానంపై కన్నేసిన పాక్ ఆటగాడు
Image Credit : X/ICC

నంబర్ వన్ స్థానంపై కన్నేసిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఫర్హాన్ 810 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, 815 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు.
610
ర్యాంక్ నిలబెట్టుకున్న సూర్య
Image Credit : ANI

ర్యాంక్ నిలబెట్టుకున్న సూర్య

అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్‌లలో నిరాశపరిచినప్పటికీ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. సూర్య 740 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-10లో సూర్యతో కలిపి నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు.
710
బౌలింగ్‌లో బుమ్రా షో
Image Credit : X@bcci

బౌలింగ్‌లో బుమ్రా షో

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్-10లోకి తిరిగి వచ్చాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో 10 కంటే తక్కువ సగటుతో 7 వికెట్లు పడగొట్టడం బుమ్రాకు కలిసొచ్చింది.
810
చక్రవర్తినే కింగ్
Image Credit : INSTAGRAM/chakaravarthyvarun

చక్రవర్తినే కింగ్

దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో పెద్దగా రాణించకపోయినా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో నంబర్ వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. వరుణ్ 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్ 21 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు, వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ 23 స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో ర్యాంక్‌కు చేరుకున్నారు.
910
ఆల్‌రౌండర్ల పోరు
Image Credit : BCCI\Twitter

ఆల్‌రౌండర్ల పోరు

ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా తన మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న శివమ్ దూబే ఏడో స్థానానికి ఎగబాకాడు. అయితే గత కొన్ని మ్యాచ్‌లుగా తుది జట్టులో చోటు కోల్పోయిన అక్షర్ పటేల్ 18వ స్థానానికి పడిపోయాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా.. పాకిస్థాన్ ఆటగాడు సయీమ్ అయూబ్‌ను వెనక్కి నెట్టి ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

1010
సంజూకు ఎదురుదెబ్బ
Image Credit : AFP

సంజూకు ఎదురుదెబ్బ

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మరింత కిందకు పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సంజూ ఆరు స్థానాలు కోల్పోయి 65వ స్థానంలో నిలిచాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
అభిషేక్ కు దోకా లేదు.. టచ్ చేసే సాహసం కూడా టీమిండియా చేయలేదు.. ఎందుకో తెలుసా..?
Recommended image2
0,0,0 రన్స్ తో హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా అభిషేక్ నే ఎందుకు ఆడిస్తున్నారో తెలుసా? టాప్ రీజన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved