MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!

ICC T20 Rankings : వరల్డ్ కప్ ముగిసినా పాక్ ను వదలనంటున్న ఇషాన్, ఆ ఒక్కటీ లాగేసుకున్నాడుగా..!

ICC T20 Rankings : పాకిస్థాన్ ను వదల బొమ్మాళీ వదల అంటున్నాడు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్. ఇప్పటికే పాక్ టీ20 వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ఇషాన్ ఇప్పుడు ఉన్న ఒక్క ఐసిసి ర్యాంకును లాగేసుకున్నాడు. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 11 2026, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐసిసి ర్యాంకింగ్స్ లో భారత్ హవా...
Image Credit : AFP

ఐసిసి ర్యాంకింగ్స్ లో భారత్ హవా...

ICC Rankings : ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని టీమిండియా గెలుచుకోవడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే టోర్నీ ముగిసినా భారత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు పాక్ మాజీ ప్లేయర్లు. టీమిండియాకు అనుకూలమైన పిచ్ లు రెడీ చేశారని... ఐసిసి ఆతిథ్య జట్టుకే సపోర్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా పాక్ ఓపెనర్ షాహిబ్జాదా పర్హాన్ కు కాకుండా ఇండియన్ ఓపెనర్ సంజూ శాంసన్ కు ఇచ్చారంటూ తప్పుబడుతున్నారు.

ఇలా ఇప్పటికే కడుపుమంటతో రగిలిపోతున్న పాక్ కు మరో షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు ఇషాన్ కిషన్. తాజాగా అతడే పాకిస్థాన్ మరోషాక్ ఇచ్చాడు. ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ లో పాక్ ప్లేయర్ షాహిబ్జాదా పర్హాన్ ను వెనక్కినెట్టి టాప్ 2 కి చేరాడు ఇషాన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐసిసి టీ20 టాప్ ర్యాంకులు మనవే...
Image Credit : Getty

ఐసిసి టీ20 టాప్ ర్యాంకులు మనవే...

టీ20 వరల్డ్ కప్ ముగిసింది... ఇందులో ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లందరికి పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించింది ఐసిసి. వరల్డ్ కప్ ఫైనల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడిన మరో భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ పాక్ ప్లేయర్ పర్హాన్ ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఇషాన్ 871 పాయింట్లతో అభిషేక్ కు చాలా దగ్గర్లో ఉన్నాడు. పర్హాన్ మాత్రం 848 రేటింగ్ పాయింట్లతో వీరికి చాలా దూరంలో ఉండి మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

36
టాప్ 10లో నలుగురు టీమిండియా బ్యాటర్లే...
Image Credit : X

టాప్ 10లో నలుగురు టీమిండియా బ్యాటర్లే...

ఐసిసి తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ 10లో నలుగురు భారత ఆటగాళ్ళే ఉన్నారు. ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో వరుసగా అభిషేక్, ఇషాన్ ఉన్నారు. ఇక హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ 742 రేటింగ్ పాయింట్స్ తో ఏడో స్థానంలో నిలిచాడు. గతంలో ఇతడు ఆరో ర్యాంకులో ఉండగా ఓ స్థానం దిగజారింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 722 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

46
ఐసిసి ర్యాంకింగ్స్ లోనూ అదరగొట్టిన సంజూ శాంసన్
Image Credit : ChatGpt

ఐసిసి ర్యాంకింగ్స్ లోనూ అదరగొట్టిన సంజూ శాంసన్

టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన మలయాళీ కుర్రాడు సంజూ శాంసన్ ఇప్పుడు ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ విడుదల చేసిన కొత్త ర్యాంకింగ్స్ లిస్ట్‌లో సంజూ ఏకంగా 18 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు.. తన కెరీర్‌లోనే బెస్ట్ 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

ఈ టీ20 వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సరిగ్గా ఆడకపోవడంతో సంజూ 65వ స్థానానికి పడిపోయాడు. కానీ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో మొత్తం 43 స్థానాలు ఎగబాకినట్లు అయింది. వరల్డ్ కప్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు కొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు గెలుచుకున్న సంజూ ఐసిసి ర్యాంకింగ్స్ టాప్ 10లోకి వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అతడు టాప్ 20 లో మాత్రమే నిలిచాడు. 

56
నంబర్ 1 ర్యాంకు కోల్పోయిన వరుణ్ చక్రవర్తి..
Image Credit : Getty

నంబర్ 1 ర్యాంకు కోల్పోయిన వరుణ్ చక్రవర్తి..

బౌలింగ్ విభాగంలో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ 1 స్థానాన్ని కోల్పోయాడు. వరల్డ్ కప్ సూపర్ 8 దశ నుంచి అతను నిరాశపరిచాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్, వరుణ్‌ను వెనక్కి నెట్టి 753 రేటింగ్ పాయింట్లతో మళ్లీ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 740 రేటింగ్ పాయింట్లు ఉన్న వరుణ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకుని 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆరు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌లో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మొదటి స్థానంలో, భారత స్టార్ హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ వారం ఇద్దరూ తమ కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించడం విశేషం.

66
ఇతర ప్లేయర్స్ ర్యాంకులు..
Image Credit : X/englandcricket

ఇతర ప్లేయర్స్ ర్యాంకులు..

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 33 బంతుల్లో సెంచరీ కొట్టి వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్, ఏడు స్థానాలు పైకి వచ్చి 20వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్‌లో భారత్‌పై మెరుపు సెంచరీ చేసిన ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ 17 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ మరో ఓపెనర్ టిమ్ సైఫర్ట్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 6వ ర్యాంక్‌కు రావడం మరో ముఖ్యమైన మార్పు. ఇలా ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పాకిస్తాన్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Now Playing
Sanju Samson Father Samson Vishwanath Emotional Comments | India Win T20 | Asianet News Telugu
Recommended image2
ICC Men's T20 World Cup 2026 : భారత్ లేకుంటే బంగ్లాదేశ్ ఎక్కడిది.. బిసిసిఐ లేకుంటే బిసిబి ఎక్కడిది..! ఇదీ చరిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved