- Home
- Sports
- Cricket
- Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Women's T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్‌లో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అయితే, ఐసీసీ ట్రోఫీ రేసులో భారత్ గెలవాలంటే ఆమెను 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకు?

వరల్డ్ కప్‌లో టీమిండియా గెలవాలంటే రిచా ఘోష్ పొజిషన్ మార్చాల్సిందే..!
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియాకు ఒక గట్టి హెచ్చరిక లాంటి ఇన్నింగ్స్ లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 36 బంతుల్లోనే 68 పరుగులు చేసి ఊచకోత కోసింది. నంబర్ 6 పొజిషన్‌లో వచ్చి ఆమె ఆడిన ఈ ఇన్నింగ్స్ చూశాక, క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఒకే మాట అంటున్నారు. రిచా ఘోష్‌ను నంబర్ 6లో కాకుండా, నంబర్ 5 పొజిషన్‌లో బ్యాటింగ్‌కు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
జూన్ 10 బుధవారం కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. 172 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా.. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ టైమ్‌లో రిచా ఘోష్ గ్రౌండ్‌లోకి వచ్చి ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేసింది. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేసింది.
కానీ ఆమె అవుటయ్యాక టీమిండియా 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఈ 22 ఏళ్ల ప్లేయర్ ఎంత బాగా ఆడినా, ఆమెను నంబర్ 6లో పంపడం వల్ల రన్ రేట్ ప్రెజర్ పెరిగిపోతోంది. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కూడా రిచా నంబర్ 6లోనే వచ్చి డకౌట్ అయింది. అందుకే ఈ మెగా టోర్నీలో భారత్ గెలవాలంటే రిచా ఘోష్‌ను నంబర్ 5లోనే ఎందుకు ఆడించాలో ఇక్కడ చూద్దాం.
2024 వరల్డ్ కప్ తర్వాత బెస్ట్ స్ట్రైక్ రేట్
రిచా ఘోష్ కేవలం క్రీజులో నిలబడి సింగిల్స్ తీసే ప్లేయర్ కాదు, ఆమె ప్యూర్ హిట్టర్. 2024 టీ20 వరల్డ్ కప్ ఎడిషన్ తర్వాత చూసుకుంటే, ప్రపంచంలోనే ఏ బ్యాటర్‌కు లేనంతగా రిచాకు 152.32 స్ట్రైక్ రేట్ ఉంది. మిగతా ఇండియన్ బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిదానంగా నిర్మించడంపై ఫోకస్ పెడితే, రిచా మాత్రం క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే బౌండరీలు బాదగలదు.
తన ఓవరాల్ టీ20 కెరీర్‌లో 144.02 స్ట్రైక్ రేట్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హిట్టర్‌గా ఎదిగింది. పైగా నంబర్ 5 పొజిషన్‌లో రిచాకు అదిరిపోయే రికార్డు ఉంది. ఇప్పటివరకు నంబర్ 5లో 37 మ్యాచ్‌లు ఆడిన రిచా.. 28.57 యావరేజ్‌తో, 133.08 స్ట్రైక్ రేట్‌తో 543 పరుగులు చేసింది. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. కాబట్టి ఆమెను చివర్లో ఫినిషర్‌గా పంపి వేస్ట్ చేయడం కంటే, నంబర్ 5లోనే పంపి ఎక్కువ బంతులు ఆడేలా చేయడం టీమ్‌కు ప్లస్ అవుతుంది
మిడిల్ ఓవర్లలో స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ
రిచా ఘోష్‌ను నంబర్ 5లో ఆడించడం వల్ల టీమిండియాకు మిడిల్ ఓవర్లలో (10 నుంచి 15 ఓవర్ల మధ్య) ఒక మంచి పట్టు దొరుకుతుంది. ప్రత్యర్థి టీమ్స్ సాధారణంగా ఈ ఓవర్లలో స్పిన్నర్లను దించి రన్ రేట్‌ను కట్టడి చేయడానికి ప్లాన్ చేస్తాయి. కానీ రిచా ఘోష్ క్రీజులో ఉంటే స్పిన్నర్లను ఈజీగా అటాక్ చేయగలదు.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే చూశాం. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు ప్రెజర్‌లో వచ్చిన రిచా.. మొదట ఇన్నింగ్స్ నిలబెట్టి, ఆ తర్వాత గేర్ మార్చింది. అదే ఆమె నంబర్ 5లో వచ్చి ఉంటే స్పిన్నర్లు రన్ రేట్ తగ్గించకుండా ముందే కౌంటర్ అటాక్ చేసేది. ఈ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ వరల్డ్ కప్‌లో చాలా అవసరం.
యాంకర్, అగ్రెసర్ మధ్య బ్యాలెన్స్
ఇంగ్లండ్ మ్యాచ్‌లో టీమిండియా పవర్‌ప్లే ముగిసేసరికి 39/2 మాత్రమే చేసింది. ఆ తర్వాత 9.1 ఓవర్లలో 63/4 కి పడిపోయింది. అంటే మిడిల్ ఓవర్లలో రన్ రేట్ పూర్తిగా నత్తనడకన సాగింది. దీనివల్ల లోయర్ ఆర్డర్ మీద ప్రెజర్ పడింది. ఒకవేళ రిచా నంబర్ 5లో వస్తే, టాప్ ఆర్డర్ యాంకర్లకు, లోయర్ ఆర్డర్ ఫినిషర్లకు మధ్య ఒక బ్రిడ్జ్‌లా మారుతుంది.
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఒకవేళ ఫెయిల్ అయినా, రిచా ఘోష్ మిడిల్ ఆర్డర్‌లో ఉంటే రన్ రేట్ తగ్గకుండా చూసుకుంటుంది. దీనివల్ల ఆమెకు పిచ్‌ను అర్థం చేసుకోవడానికి, బౌలర్ల ప్లాన్స్ తిప్పికొట్టడానికి కొంచెం టైమ్ దొరుకుతుంది. ప్రెజర్‌లో సిక్సర్లు కొట్టే డెస్పరేషన్ హిట్టర్ లా కాకుండా, ప్లాన్ ప్రకారం ఆడే స్ట్రాటజిక్ అగ్రెసర్ లా మారుతుంది.
ప్రత్యర్థి బౌలర్లపై సైకలాజికల్ ప్రెజర్
టీ20 క్రికెట్‌లో 7 నుంచి 15 ఓవర్ల మధ్య ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ పోతాయి కాబట్టి బౌలర్లు వికెట్లు తీయడానికి చూస్తారు. కానీ రిచా ఘోష్ లాంటి డేంజరస్ బ్యాటర్ నంబర్ 5లోనే బ్యాటింగ్‌కు వస్తే, ప్రత్యర్థి కెప్టెన్ తన బెస్ట్ బౌలర్లను ముందే దించాల్సి వస్తుంది. ఎందుకంటే రిచాను త్వరగా అవుట్ చేయకపోతే మ్యాచ్ చేజారిపోతుందని వాళ్లకు తెలుసు.
రన్ చేజింగ్స్ లో నంబర్ 5 పొజిషన్‌లో రిచాకు సూపర్ రికార్డ్ ఉంది. ఛేజింగ్‌లో 20 మ్యాచ్‌ల్లో 34 యావరేజ్‌తో, 122.68 స్ట్రైక్ రేట్‌తో 238 రన్స్ చేసింది. ఆమె మిడిల్ ఆర్డర్‌లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు.
మ్యాచ్ విన్నింగ్ పొటెన్షియల్ ఉపయోగించుకోవడం
రిచా ఘోష్ కేవలం హిట్టర్ మాత్రమే కాదు, మ్యాచ్‌ను ఎలా ఫినిష్ చేయాలో తెలిసిన స్మార్ట్ క్రికెటర్. క్రీజులో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే చాలు, డెత్ ఓవర్లలో ఎంతటి ప్రెజర్‌నైనా తట్టుకుని టీమ్‌ను గెలిపించగలదు. ఆమె మ్యాచ్ విన్నింగ్ కెపాసిటీని కేవలం చివరి 2 లేదా 3 ఓవర్లకే పరిమితం చేయకూడదు.
మోస్ట్ బాల్స్ ఫేస్డ్ అనే ఫార్ములాను టీమిండియా మేనేజ్‌మెంట్ ఫాలో అవ్వాలి. రిచా ఘోష్‌కు ఎక్కువ ఓవర్లు ఆడే ఛాన్స్ ఇస్తే టీమిండియా భారీ స్కోర్లు చేయడానికి లేదా పెద్ద టార్గెట్లను ఈజీగా ఛేజ్ చేయడానికి వీలవుతుంది. మనకున్న అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌కు టైమ్ సరిపోలేదు అనే బాధ లేకుండా ఉండాలంటే ఆమెను నంబర్ 5లో ఆడించడమే కరెక్ట్ ఛాయిస్.

