MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : రింకూ సింగ్ ఔట్.. జట్టులోకి హైదరబాదీ ప్లేయర్..?

T20 World Cup 2026 : రింకూ సింగ్ ఔట్.. జట్టులోకి హైదరబాదీ ప్లేయర్..?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో హైదరబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 25 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టీమిండియాలో కీలక మార్పులు..
Image Credit : ANI

టీమిండియాలో కీలక మార్పులు..

ICC T20 World Cup 2026 : స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మరో కీలక మ్యాచ్ కు సిద్దమవుతోంది. సూపర్-8 లో ఇప్పటికే ఓ ఓటమిని చవిచూసిన సూర్య సేన ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియా వంటి బలమైన టీంను ఓడించి సూపర్-8 కు చేరిన జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయే జట్టు వరల్డ్ కప్ నుండి నిష్క్రమిస్తుంది. అందుకే జింబాబ్వేతో మ్యాచ్ ను భారత్ ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడంలేదు.

అయితే కీలకమైన మ్యాచ్ వేళ యువ క్రికెటర్ రింకూ సింగ్ జట్టుకు దూరమయ్యాడు. రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు... ప్రస్తుతం అతడి పరిస్థితి పూర్తిగా క్షీణించి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. దీంతో రింకూ సింగ్ చివరిక్షణాల్లో తండ్రివద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు... ఇప్పటికే అతడు స్వస్థలానికి బయలుదేరాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్ లో రింకూ స్థానంలో ఎవరికి ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అక్షర్ పటేల్ కు అవకాశం...
Image Credit : Getty

అక్షర్ పటేల్ కు అవకాశం...

సౌతాఫ్రికాతో తొలి సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ తేలిపోయింది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఆడించకపోవడం టీమిండియా చేసిన బిగ్ మిస్టేక్ గా క్రికెట్ విశ్లేషకులే కాదు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అతడిని జింబాబ్వేతో ఆడించక తప్పని పరిస్థితి నెలకొంది. మరి ఎవరిని జట్టులోంచి పక్కనబెట్టాలి అనుకునే సమయంలో రింకూ సింగ్ తప్పుకున్నాడు... అతడి స్థానంలోని అక్షర్ ఆడనున్నాడు.

34
మహ్మద్ సిరాజ్ కు అవకాశం దక్కుతుందా..?
Image Credit : Getty

మహ్మద్ సిరాజ్ కు అవకాశం దక్కుతుందా..?

ఈ వరల్డ్ కప్ టీమ్ లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు అనూహ్యంగా చోటు దక్కింది. అయితే అతడు టీంలో ఉన్నా ఇప్పటివరకు మైదానంలోకి దిగింది లేదు… బంతి పట్టిందిలేదు. ఇప్పటికే టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది... కాబట్టి బౌలర్లను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్ లో విఫలమైన వాషింగ్టన్ సుందర్ ను పక్కనబెట్టి మహ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది.

44
సంజూ శాంసన్ ను ఆడిస్తారా..?
Image Credit : Getty

సంజూ శాంసన్ ను ఆడిస్తారా..?

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే తిలక్ వర్మ వరుసగా విఫలం అవుతున్నారు. టీమిండియాకు బలంగా ఉండాల్సిన వీరు భారంగా మారారు. అందుకే వీరిలో ఒకరిని పక్కనబెట్టి సంజూ శాంసన్ ను ఆడించాలనే డిమాండ్ పెరుగుతోంది... జింబాబ్వేతో మ్యాచ్ లో ఈ ప్రయోగం చేసే అవకాశాలున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
T20 World Cup 2026: హ్యారీ బ్రూక్ vs సూర్యకుమార్ యాదవ్‌.. వీరి మధ్య తేడా ఇదే !
Recommended image2
T20 World Cup 2026 : రింకూ సింగ్‌ను పక్కన పెట్టాల్సిందేనా? సెమీస్ చేరాలంటే భారత్ ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved