MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఆ ఇద్దరినీ తీసేయండి మహాప్రభూ.! ఉంచితే టీమిండియా గెలవడం కష్టమే..

ఆ ఇద్దరినీ తీసేయండి మహాప్రభూ.! ఉంచితే టీమిండియా గెలవడం కష్టమే..

Team India: సౌత్ ఆఫ్రికా చేతిలో ఇటీవల టీ20 సూపర్ హిట్ మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో, జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అసిస్టెంట్ కోచ్ రాన్ టెన్ డస్కెట్ ఈ మార్పుల గురించి స్పష్టమైన హింట్స్ ఇచ్చారు. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 25 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఘోర పరాభవం తర్వాత..
Image Credit : BCCI\Twitter

ఘోర పరాభవం తర్వాత..

దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవం అనంతరం టీమిండియాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. అసిస్టెంట్ కోచ్ రాన్ టెన్ డస్కెట్ తదుపరి జింబాబ్వే మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడని హింట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సంజు ఒక ముఖ్యమైన చర్చనీయాంశం అవుతాడని డస్కెట్ పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శాంసన్ జట్టులోకి వస్తే
Image Credit : ANI

శాంసన్ జట్టులోకి వస్తే

సంజూ శాంసన్ జట్టులోకి వస్తే, వరుసగా నాలుగో మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్ శర్మపై లేదా చెత్త ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మపై వేటు పడవచ్చు. డస్కెట్ లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల గురించి ప్రస్తావించడం బట్టి అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

35
పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్లు
Image Credit : ANI

పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్లు

పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలంటే టాప్ ఆర్డర్‌లో రైట్-లెఫ్ట్ కాంబినేషన్ అవసరమని డస్కెట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

45
అభిషేక్ శర్మను జట్టులో కొనసాగించాలనుకుంటే..
Image Credit : ANI

అభిషేక్ శర్మను జట్టులో కొనసాగించాలనుకుంటే..

ఒకవేళ అభిషేక్ శర్మను జట్టులో కొనసాగించాలనుకుంటే, తిలక్ వర్మపై వేటు పడే అవకాశం ఉంది. అప్పుడు అభిషేక్ శర్మతో సంజు ఓపెనింగ్ చేయించి, ఇషాన్‌ను వన్ డౌన్ స్థానంలో పంపించే ప్రణాళికను టీమిండియా మేనేజ్‌మెంట్ పరిశీలించవచ్చు. ఈ మార్పుల ద్వారా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థిరత్వాన్ని, ప్రత్యర్థి ఆఫ్ స్పిన్ ప్రయోగాలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

55
అక్షర్ పటేల్ తుది జట్టులోకి
Image Credit : Team India\BCCI

అక్షర్ పటేల్ తుది జట్టులోకి

అక్షర్ పటేల్ తుది జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో అక్షర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ మార్పులు టీమిండియా ఆటతీరును మెరుగుపర్చడానికి దోహదపడతాయని అంచనా వేస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Recommended image2
Cricket Records : క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కసారి కూడా రనౌట్ కాని ఐదుగురు క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved