MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • India Super 8 Schedule : సూపర్-8 సమరానికి సూర్య సేన రెడీ.. భారత్ ఢీకొట్టే జట్లు ఇవే

India Super 8 Schedule : సూపర్-8 సమరానికి సూర్య సేన రెడీ.. భారత్ ఢీకొట్టే జట్లు ఇవే

India Super 8 Schedule : టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా అవుట్ కావడంతో టీమిండియా సూపర్ 8 గ్రూపు ఖరారైంది. భారత్ తన తదుపరి పోరులో ఏ జట్లతో తలపడనుంది? సూపర్-8 షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 17 2026, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆస్ట్రేలియా ఖేల్ ఖతం.. టీమ్ ఇండియాకు సూపర్ 8 లో ఎదురేలేదు!
Image Credit : Getty

ఆస్ట్రేలియా ఖేల్ ఖతం.. టీమ్ ఇండియాకు సూపర్-8 లో ఎదురేలేదు!

టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగుస్తున్న తరుణంలో భారత జట్టుకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. బలమైన ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీ నుంచి అవుట్ కావడంతో భారత్ సెమీఫైనల్ దారి మరింత సులభమైందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా అవుట్ కావడంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకోగా, అక్కడ ఏ జట్లతో ఎప్పుడు తలపడాలనే దానిపై స్పష్టత వచ్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సూపర్-8 గ్రూపులో నిలిచిందెవరు?
Image Credit : Getty

సూపర్-8 గ్రూపులో నిలిచిందెవరు?

మంగళవారం పల్లెకెలెలో ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వేకు ఒక పాయింట్ లభించింది. దీంతో గ్రూప్ బీ నుంచి జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించింది. ఇదే సమయంలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ అయింది. ప్రస్తుత ఛాంపియన్ టీమ్ ఇండియా ఇప్పుడు సూపర్-8 గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూపులో భారత్‌తో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.

36
సూపర్ 8 లో సౌతాఫ్రికాతో భారత్ తొలి సమరం
Image Credit : X@BCCI

సూపర్ 8 లో సౌతాఫ్రికాతో భారత్ తొలి సమరం

సూపర్-8 దశలో భారత్ తన ప్రయాణాన్ని ఫిబ్రవరి 22న ప్రారంభించనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా తో భారత్ తలపడుతుంది. గత సీజన్ రన్నరప్ అయిన సౌతాఫ్రికా తో జరిగే ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. అనంతరం సూర్య సేన చెన్నైకి పయనం అవుతుంది. అక్కడ ఫిబ్రవరి 26న ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో జింబాబ్వే జట్టుతో తలపడుతుంది. సూపర్-8లో తన చివరి మ్యాచ్‌ను మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో ఆడుతుంది.

46
గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టిన భారత్
Image Credit : Getty

గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టిన భారత్

గ్రూప్ స్టేజ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆదివారం కొలంబోలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచుల్లో మూడూ గెలిచి 6 పాయింట్లతో గ్రూప్ ఏ టేబుల్ టాప్‌లో నిలిచింది. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. సూపర్-8 లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తోంది.

56
నెదర్లాండ్స్‌తో భారత్ చివరి లీగ్ మ్యాచ్
Image Credit : BCCI

నెదర్లాండ్స్‌తో భారత్ చివరి లీగ్ మ్యాచ్

సూపర్-8 మ్యాచ్‌లకు ముందు భారత్ బుధవారం నెదర్లాండ్స్‌తో తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గతంలో 2022 టీ20 వరల్డ్ కప్‌లో సిడ్నీలో ఈ రెండు జట్లు తలపడగా, భారత్ విజయం సాధించింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్‌లపై గెలిచిన భారత్, నెదర్లాండ్స్‌ను కూడా ఓడించి అజేయంగా తదుపరి దశకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

66
భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే
Image Credit : BCCI

భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే

  1. ఫిబ్రవరి 22: భారత్ vs సౌతాఫ్రికా, అహ్మదాబాద్
  2. ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే, చెన్నై
  3. మార్చి 1: భారత్ vs వెస్టిండీస్, కోల్‌కతా

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ లు జరుగుతాయి.

భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : గ్రూప్ స్టేజ్‌లోనే ఆస్ట్రేలియా ఇంటికి.. ఇవే అసలు కారణాలు
Recommended image2
T20 World Cup : దశాబ్దాల నిరీక్షణకు తెర.. సూపర్ 8కు జింబాబ్వే.. భారత్‌తో పోరు ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved