MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • BCCI Awards: కోహ్లీ, బుమ్రా కాదు.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రిన్స్

BCCI Awards: కోహ్లీ, బుమ్రా కాదు.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రిన్స్

BCCI's Annual Awards: 2025 సీజన్‌కు గాను బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌లకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాలు దక్కనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 12 2026, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీసీసీఐ సంచలన నిర్ణయం: టీ20ల్లో లేకపోయినా నెంబర్ 1 ప్లేయర్‌గా గిల్!
Image Credit : Getty

బీసీసీఐ సంచలన నిర్ణయం: టీ20ల్లో లేకపోయినా నెంబర్ 1 ప్లేయర్‌గా గిల్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రతి ఏడాది నిర్వహించే ప్రతిష్ఠాత్మక 'నమన్ అవార్డుల' వేడుకకు ముహూర్తం ఖరారైంది. 2025 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చూపించిన ఆటగాళ్లను గౌరవించే ఈ కార్యక్రమంలో, అందరి కళ్లు 26 ఏళ్ల యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పైనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లేదా సంజూ శాంసన్ వంటి హేమాహేమీలను కాదని, బీసీసీఐ ఈ ఏడాది 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' (పాలి ఉమ్రిగర్ అవార్డు) పురస్కారానికి గిల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

మే 15, ఆదివారం జరగనున్న ఈ వేడుకలో గిల్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోనున్నారు. గతేడాది గిల్ బ్యాట్‌తో సృష్టించిన పరుగుల సునామీ, కెప్టెన్‌గా అతను సాధించిన విజయాలే అతడిని ఈ రేసులో ముందంజలో నిలబెట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శుభ్‌మన్ గిల్: రికార్డుల రారాజుగా 2025 సీజన్
Image Credit : Getty

శుభ్‌మన్ గిల్: రికార్డుల రారాజుగా 2025 సీజన్

2025 క్యాలెండర్ ఇయర్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. గణాంకాల పరంగా చూస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. అతను మొత్తం 1,764 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 49గా ఉండటం గమనార్హం.

ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. రోహిత్ శర్మ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్, ఇంగ్లాండ్‌తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో ఏకంగా 754 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొత్తం మీద టెస్టుల్లో 983 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు.

35
వన్డేల్లో తోపు.. ఐపీఎల్‌లోనూ గిల్ జోరు
Image Credit : Getty

వన్డేల్లో తోపు.. ఐపీఎల్‌లోనూ గిల్ జోరు

కేవలం టెస్టుల్లోనే కాకుండా వన్డే ఫార్మాట్‌లోనూ గిల్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. భారత్ విజేతగా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ ఓపెనర్‌గా రాణించి 188 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో జట్టును ముందుండి నడిపించాడు. వన్డేల్లో మొత్తం 490 పరుగులు రాబట్టాడు.

అంతర్జాతీయ టీ20ల్లో గిల్ ఫామ్ అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరపున 650 పరుగులు చేసి తన సత్తా చాటాడు. 50 సగటుతో పరుగులు సాధించి లీగ్‌లో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ, మిగిలిన రెండు ఫార్మాట్లలో అతని ప్రదర్శన అసాధారణం అని చెప్పాలి.

45
రాహుల్ ద్రవిడ్‌కు సి.కె. నాయుడు జీవన సాఫల్య పురస్కారం
Image Credit : Getty

రాహుల్ ద్రవిడ్‌కు సి.కె. నాయుడు జీవన సాఫల్య పురస్కారం

ఈ వేడుకలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ అత్యున్నత 'కల్నల్ సి.కె. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డుతో గౌరవించనుంది. 16 ఏళ్ల పాటు ఆటగాడిగా, ఆ తర్వాత కోచ్‌గా ద్రవిడ్ అందించిన సేవలు వెలకట్టలేనివి. అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 పరుగులు (టెస్టుల్లో 13,288, వన్డేల్లో 10,889) చేసిన ద్రవిడ్, కోచ్‌గా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.

ఆయన పర్యవేక్షణలో 2018 అండర్-19 ప్రపంచకప్ గెలవడంతో పాటు, 2024 టీ20 ప్రపంచకప్‌లో సీనియర్ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో ద్రవిడ్ పాత్ర కీలకమైంది. ద్రవిడ్‌తో పాటు మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు కూడా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కనుంది. వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) చేసిన రికార్డు మిథాలీ పేరిటే ఉంది.

55
డొమెస్టిక్ స్టార్లకు గుర్తింపు.. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అవార్డు
Image Credit : X/BCCI

డొమెస్టిక్ స్టార్లకు గుర్తింపు.. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అవార్డు

అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించిన వారికి కూడా బీసీసీఐ సముచిత గౌరవం కల్పించనుంది. ముంబైకి చెందిన యంగ్ ప్లేయర్ ఆయుష్ మ్హత్రేకు 'లాలా అమర్‌నాథ్ అవార్డు' దక్కనుంది. దేశవాళీ టోర్నీలలో నిలకడగా రాణిస్తున్న ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) 'బెస్ట్ అసోసియేషన్'గా నిలిచింది.

ప్రస్తుతం భారత క్రికెట్ స్వర్ణ యుగంలో ఉంది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కాపాడుకున్న ఆనందంలో ఉన్న తరుణంలో, ఈ నమన్ అవార్డుల వేడుక ప్రస్తుత స్టార్లను, పూర్వపు దిగ్గజాలను ఒకే దగ్గరకు తీసుకురానుంది. గిల్ వంటి యువ రక్తం జట్టును ముందుండి నడిపిస్తుంటే, ద్రవిడ్ వంటి అనుభవజ్ఞులు పునాదులు వేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జైలుకు వెళ్లే ఛాన్స్? అసలు మ్యాటర్ ఇదే !
Recommended image2
LPG Crisis : ఐపీఎల్ 2026పై ఎల్‌పీజీ దెబ్బ.. మెగా టోర్నీ స్టార్ట్ అవుతుందా? లేదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved