MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • T20 World Cup : దశాబ్దాల నిరీక్షణకు తెర.. సూపర్ 8కు జింబాబ్వే.. భారత్‌తో పోరు ఎప్పుడంటే?

T20 World Cup : దశాబ్దాల నిరీక్షణకు తెర.. సూపర్ 8కు జింబాబ్వే.. భారత్‌తో పోరు ఎప్పుడంటే?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో జింబాబ్వే సూపర్ 8కు అర్హత సాధించింది. దీంతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుండి అవుట్ అయింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సికందర్ రజా సేన సంచలనం రేపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 17 2026, 09:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వరల్డ్ కప్ నుండి ఆస్ట్రేలియా అవుట్.. సూపర్ 8కు జింబాబ్వే
Image Credit : X/ZimCricketv

వరల్డ్ కప్ నుండి ఆస్ట్రేలియా అవుట్.. సూపర్ 8కు జింబాబ్వే

టీ20 ప్రపంచకప్‌ 2026లో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ క్రికెట్‌లో జయింట్ కిల్లర్స్ గా పేరు తెచ్చుకున్న జింబాబ్వే జట్టు మరోసారి తన సత్తా చాటింది. పల్లెకెలెలో ఐర్లాండ్‌తో జరగాల్సిన గ్రూప్-బీ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. ఈ ఒక్క పాయింట్‌తో జింబాబ్వే మొత్తం 5 పాయింట్లు సాధించి సూపర్ 8 దశకు అధికారికంగా అర్హత సాధించింది. అదే సమయంలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పల్లెకెలెలో వర్షం.. ఆసీస్‌కు శాపం
Image Credit : X/ZimCricketv

పల్లెకెలెలో వర్షం.. ఆసీస్‌కు శాపం

మంగళవారం ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫలితంపై ఆస్ట్రేలియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిస్తేనే ఆస్ట్రేలియాకు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ, పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లింది. మైదానం చిత్తడిగా మారడం, వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో జింబాబ్వేకు సూపర్ 8 బెర్త్ ఖాయమైంది. ఆస్ట్రేలియా తన గ్రూప్ దశలో జింబాబ్వే, శ్రీలంక చేతుల్లో ఓడిపోవడంతో కేవలం 2 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

36
శతాబ్దపు గొప్ప ఘనత
Image Credit : X/ZimCricketv

శతాబ్దపు గొప్ప ఘనత

జింబాబ్వే క్రికెట్ చరిత్రలో ఈ శతాబ్దంలో ఇదే అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. 1999 వన్డే ప్రపంచకప్‌లో సూపర్ సిక్స్‌కు చేరిన తర్వాత, ఐసీసీ టోర్నీలో ఆ జట్టు సాధించిన గొప్ప మైలురాయి ఇదే. గత కొన్నేళ్లుగా ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, పేదరికం వంటి అడ్డంకులను అధిగమించి ఆటగాళ్లు ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. రెండు తరాల ఆటగాళ్ల కృషికి ఇది దక్కిన ప్రతిఫలమని క్రీడాభిమానులు కొనియాడుతున్నారు.

46
గ్రూప్ G1లో భారత్‌తో పోరు
Image Credit : X/Zimbabwe Cricket

గ్రూప్ G1లో భారత్‌తో పోరు

సూపర్ 8కు చేరిన ఏడో జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఈ జట్టు ఇప్పుడు గ్రూప్ G1లో భాగమైంది. ఈ గ్రూప్‌లో ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. జింబాబ్వే తన సూపర్ 8 ప్రయాణాన్ని టీమ్ ఇండియాతో ప్రారంభించనుంది. ఫిబ్రవరి 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం లో భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో భారత్ తలపడుతుంది.

56
ఇది ఆరంభం మాత్రమే.. సికందర్ రజా
Image Credit : X/ZimCricketv

ఇది ఆరంభం మాత్రమే.. సికందర్ రజా

తమ జట్టు సాధించిన విజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హర్షం వ్యక్తం చేశారు. "మేము సాధించిన ఈ ఘనత కేవలం ఒక ఆరంభం మాత్రమే. మా లక్ష్యం ఇంకా పెద్దదిగా ఉంది. దీనిని మేం చిన్న వేడుకగా జరుపుకుంటాం, కానీ వెంటనే తదుపరి మ్యాచ్‌లపై దృష్టి పెడతాం. అండర్ డాగ్స్ కథలను అందరూ ఇష్టపడతారు, మేం ప్రపంచ క్రికెట్‌లో మా గౌరవాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం" అని రజా పేర్కొన్నారు. అలాగే తమకు సపోర్టుగా నిలుస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

66
మారిన గ్రూప్ సమీకరణాలు
Image Credit : Getty

మారిన గ్రూప్ సమీకరణాలు

గ్రూప్ బీ నుండి శ్రీలంక ఇప్పటికే 6 పాయింట్లతో సూపర్ 8కు చేరింది. జింబాబ్వే తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 19న సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకతో ఆడనుంది. మరోవైపు సూపర్ 8 గ్రూప్ G2లో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉండగా.. పాకిస్థాన్ లేదా అమెరికాలో ఒక జట్టు చేరనుంది. గ్రూప్ G1 మ్యాచ్‌లన్నీ భారత్‌లో జరగనుండగా, గ్రూప్ G2 మ్యాచ్‌లు శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలెలో నిర్వహించనున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : గ్రూప్ స్టేజ్‌లోనే ఆస్ట్రేలియా ఇంటికి.. ఇవే అసలు కారణాలు
Recommended image2
T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved