MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Rinku Singh Net Worth : సిలిండర్లు మోసిన కుర్రాడు నేడు స్టార్ క్రికెటర్.. రింకూ ఆస్తి ఎంతుంటుందో తెలుసా?

Rinku Singh Net Worth : సిలిండర్లు మోసిన కుర్రాడు నేడు స్టార్ క్రికెటర్.. రింకూ ఆస్తి ఎంతుంటుందో తెలుసా?

Rinku Singh Net Worth : టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ ది స్పూర్తిధాయకమైన స్టోరీ. అతడు గ్యాస్ సిలిండర్లు మోసే స్థాయినుండి టాప్ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం అతడి ఆస్తిపాస్తుల విలువెంతో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 25 2026, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రింకూ సింగ్ స్పూర్తిధాయక జీవితం...
Image Credit : ANI

రింకూ సింగ్ స్పూర్తిధాయక జీవితం...

Rinku Singh : పేదరికం మనిషికి మాత్రమే... అతడి కలలకు కాదని నిరూపించాడు టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్. నిరుపేద కుటుంబంలో పుట్టిన అతడు చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలను అనుభవించారు... చివరకు ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు కూడా మోసాడు. కానీ ఈ కష్టాలే అతడి లక్ష్యానికి సోపానాలుగా మారాయి... గొప్ప క్రికెటర్ గా తీర్చిదిద్దాయి. జీవితంలోనే కాదు క్రికెట్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదిరించాలనే పాఠాన్ని నేర్చుకున్నాడు... అందుకే టీం కష్టాల్లో ఉండగా బరిలోకి దిగి అద్భుతమైన ఫినిష్ అందిస్తున్నాడు. ఇలా మహేంద్ర సింగ్ ధోని తర్వాత మ్యాచ్ ఫినిషర్ గా గుర్తింపుపొందాడు రింకూ సింగ్.

27
రింకూ సింగ్ వ్యక్తిగత జీవితం...
Image Credit : Getty

రింకూ సింగ్ వ్యక్తిగత జీవితం...

రింకూ సింగ్ 1997 అక్టోబర్ 12న ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ పట్టణంలో జన్మించాడు. ఐదుగురు తోబుట్టువులలో ఇతడు మూడవవాడు. తండ్రి ఖాన్ చంద్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో తండ్రికి సాయంగా రింకూ కూడా కొన్నిరోజులు ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశాడు.

అయితే కొడుకుకు క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గమనించిన ఖాన్ చంద్ ఆ దిశగా ప్రోత్సహించాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కొడుకు కల చెదిరిపోకుండా చూశాడు. తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రింకూ సింగ్ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదిగాడు. చివరకు టీమిండియాలో చోటు దక్కించుకుని అద్భుతమైన ఫినిషర్ గా మారాడు.

Related Articles

Related image1
Rinku Singh: ఆసియా కప్ లో ఒకే బంతి ఆడి హీరోగా మారిన రింకూ సింగ్.. రాసిపెట్టుకుని మరి కొట్టాడు !
Related image2
Rinku Singh : టీమిండియాకు బిగ్ షాక్.. రింకూ సింగ్ కు ఏమైంది?
37
రింకూ సింగ్ నెట్ వర్త్ ఎంత..?
Image Credit : Getty

రింకూ సింగ్ నెట్ వర్త్ ఎంత..?

పేదరికాన్ని ఎదిరించి క్రికెటర్ గా మారిన రింకూసింగ్ ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నాడు. అలీగఢ్‌లో సామాన్యమైన జీవితం నుంచి క్రికెటర్ గా స్టార్‌డమ్ సంపాదించే వరకు రింకూ సింగ్ ప్రయాణం అద్భుతం. కోల్‌కతా నైట్ రైడర్స్, అంతర్జాతీయ క్రికెట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఆదాయం ద్వారా అతని ఆస్తి విలువ అమాంతం పెరిగింది.

2025-26 నాటికి రింకూ సింగ్ నికర ఆస్తి విలువ సుమారు ₹20 కోట్లు ఉంటుందని అంచనా. కొన్ని రిపోర్టుల ప్రకారం ఆస్తులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను బట్టి ఇది ₹22-28 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్, అంతర్జాతీయ మ్యాచ్‌లతో అతని విలువ ఎంతలా పెరిగిందో ఈ సంఖ్య చెబుతోంది.

47
రింకూ సింగ్ ఆదాయ మార్గాలివే...
Image Credit : Getty

రింకూ సింగ్ ఆదాయ మార్గాలివే...

1. ఐపీఎల్ జీతం

రింకూసింగ్ సంపాదనలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) నుంచే సింహభాగం వస్తుంది. 2025 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని ఏకంగా రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతంలో కేవలం రూ.55 లక్షలు ఉన్న అతని ఐపీఎల్ జీతం ఇప్పుడు భారీగా పెరిగింది.

2. బీసీసీఐ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు

రింకూ సింగ్ కు బీసీసీఐ గ్రేడ్ C సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంది. దీని విలువ ఏడాదికి సుమారు కోటి రూపాయలు. అలాగే మ్యాచ్ ఫీజులు కూడా అందుకుంటాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ ద్వారా ఏటా కోటి నుండి కోటిన్నర వరకు సంపాదిస్తాడు.

3. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు

స్టార్ క్రికెటర్ గా ఎదిగిన రింకూకు పాపులారిటీ పెరిగింది. దీంతో పలు స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ ఏటా లక్షల్లో సంపాదిస్తున్నాడు.

4. ఇతర ఆదాయాలు

క్రికెట్ తో పాటు ఇతర మార్గాల్లోనూ రింకూ డబ్బులు సంపాదిస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ చెల్లింపులు, సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇక స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు.. దీంతో నెలనెలా సుమారు రూ.70,000–రూ.90,000 వరకు శాలరీ లభిస్తుంది.

57
స్వస్థలంలో అద్భుతమైన ఇళ్లు...
Image Credit : Instagram

స్వస్థలంలో అద్భుతమైన ఇళ్లు...

రింకూ సింగ్ ఎక్కడైతే గ్యాస్ సిలిండర్లు మోశాడో అక్కడే ఇప్పుడు కోట్ల విలువచేసే లగ్జరీ ఇళ్లు కట్టుకున్నాడు. అలీగఢ్‌లో సుమారు రూ.3–3.5 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని రింకూ కట్టించుకున్నాడు. సొంత ఊరిలో నివాస స్థలాలు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి.

67
రింకూ కార్లు, బైక్‌ల కలెక్షన్
Image Credit : X/@BCCI

రింకూ కార్లు, బైక్‌ల కలెక్షన్

రింకూ సింగ్ కు బైక్స్ అంటే చాలా ఇష్టం. అలాగే అతడివద్ద విలువైన కార్లు కూడా ఉన్నాయి.  

ఫోర్డ్ ఎండీవర్

టయోటా ఇన్నోవా క్రిస్టా

మహీంద్రా స్కార్పియో N

మారుతి బ్రెజా & స్విఫ్ట్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్

ఈ వాహనాలు అతని బ్యాలెన్స్‌డ్ లైఫ్‌స్టైల్‌ను చూపిస్తాయి. సౌకర్యవంతంగా ఉన్నా, అనవసర ఆడంబరాలకు పోడు.

77
ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్
Image Credit : ANI

ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్

ఎంత సంపాదించినా రింకూ సింగ్ చాలా సింపుల్‌గా ఉంటాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతను, కష్టపడి సంపాదించిన డబ్బుకు విలువ ఇవ్వాలని ఎప్పుడూ చెబుతుంటాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి స్టార్‌ క్రికెటర్ మారిన అతని కథ అందరినీ ఆకట్టుకుంటుంది, స్ఫూర్తినిస్తుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే రింకూ సింగ్ కు ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం జరిగింది.. ఈ నెల (ఫిబ్రవరి 2026) లోనే వివాహం జరగనున్నట్లు సమాచారం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL : క్రికెట్ లవర్స్ కు షాక్.. ధోనీ రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ ! ఆ నలుగురు కూడా అవుట్?
Recommended image2
IPL 2026 : రింకూ సింగ్ ను దెబ్బకొట్టిన షారుఖ్ కేకేఆర్ !
Recommended image3
Rishabh Pant : వైట్ బాల్ క్రికెట్‌కు రిషబ్ పంత్ గుడ్ బై? అసలు ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
Rinku Singh: ఆసియా కప్ లో ఒకే బంతి ఆడి హీరోగా మారిన రింకూ సింగ్.. రాసిపెట్టుకుని మరి కొట్టాడు !
Recommended image2
Rinku Singh : టీమిండియాకు బిగ్ షాక్.. రింకూ సింగ్ కు ఏమైంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved